డిప్రెషన్‌లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఆమెతో బ్రేకప్‌యే కారణమా.. అసలు విషయాలు వెలుగులోకి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 రన్నరప్ అఖిల్ సార్థక్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 4లో అభిజీత్ తో తెగ గొడవలు పడి సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖిల్ ఆ సీజన్ లో కప్పును కొట్టలేకపోయాడు. ఈ తర్వాత వచ్చిన ఓటీటీ తెలుగు సీజన్ 1కు కూడా ఈయన ఎంపిక అయ్యాడు. కానీ ఈ సీజన్ లో కూడా ఈయన రన్నరప్ గానే నిలిచాడు. అక్కడ అభిజీత్ తో ఇబ్బంది పడిన ఇతడు.. ఇక్కడ బిందు మాధవితో గొడవ పడ్డాడు. రెండో చోట్ల అగ్రెషన్ సేమ్ గానే చూపించాడు. ప్రస్తుతం ఈయన ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మోనాల్ గజ్జర్ కోసం అభిజీత్, అఖిల్ సార్థక్ లు ఫైట్ చేయడం అందరికీ నచ్చింది. ముఖ్యంగా ఎప్పుడూ, ఎక్కువగా అఖిల్ తో కనిపించిన మోనాల్.. అభిజీత్ తో కూడా బాగానే ఉండేది. కానీ అఖిల్ మాత్రం దాన్ని అస్సలే జీర్ణించుకోలేకపోయే వాడు. అభిజీత్ తో కలిసి ఉండొద్దని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇలా వీరిద్దరి మధ్యే చివరి వరకూ ఫైట్ జరగడం వీరే విన్నర్, రన్నరప్ లు అవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే అఖిల్ సార్థక్ ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుంచి బయట పడుతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 4 Contestant Akhil Sarthak in Depression Check Full Details

అయితే ఈయన టీవీ షోలకు దూరం కావడానికి తాను డిప్రెషన్ లోకి వెళ్లడమే అని ఆయన నేరుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండస్ట్రీలో తన స్నేహితులే తనను తొక్కాలని చూడడం, అనేక రకాలుగా మోసం చేయడం తీసుకోలేకపోయానని.. అలా డిప్రెషన్ లోకి వెళ్లానని అన్నారు. అయితే మోనాల్ గజ్జర్ తో లవ్ బ్రేకప్ వల్లే మీరు ఇలా అయ్యారా అంటూ యాంకర్ అడగ్గా.. అదేం లేదని ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పుకొచ్చాడు. తామిద్దరూ కలిసి గతంలో చాలా ఫొటోలు దిగి పెట్టేవాళ్లమని, కానీ దాన్ని ఆపేశాకా జనాలు తాము బ్రేకప్ చెప్పుకున్నట్లు భావిస్తున్నారని అఖిల్ అన్నాడు.

అయితే అఖిల్.. మోనాల్ తో ఎక్కువగా కలిసి కనిపించకోవడానికి కారణం... తమ స్నేహానికి దిష్టి తగులుతుందేనని వివరించారు. అలాగే అందరూ తామిద్దరూ ఎప్పుడూ ఫొటోలు దిగుతుంటే తమ మధ్య ప్రేమ కొనసాగుతుందని అనుకుంటారని.. దాని వల్ల ఇద్దరి జీవితాలపై ఎఫెక్ట్ పడుతుందని భావించి ఎక్కువగా కలవకూడదని, ఫొటోలు దిగకూడదని డిసైడ్ అయ్యారట. కానీ ఇప్పటికీ ఈయన మోనాల్ తో స్నేహాన్ని కొనసాగిస్తునే ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Bigg Boss Telugu 4 Contestant Akhil Sarthak in Depression Check Full Details

బిందు మాధవి, అభిజీత్ వల్ల తాను చాలా విషయాలు నేర్చుకున్నానని.. నిజానికి వాళ్లే ఇప్పుడు తనకు అందరికంటే మంచి వాళ్లలా కనిపిస్తున్నారని అఖిల్ సార్థక్ వివరించాడు. అభిజీత్, తాను ఫోన్ లో టచ్ లోనే ఉంటామని అన్నారు. ఇద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేయాలని కాస్త అనుకున్నప్పటికీ... కుదరలేదని.. కానీ అతడెప్పుడూ తనకు స్నేహితుడే అని తెలిపాడు. ప్రస్తుతం డిప్రెషన్ నుంచి బయట పడ్డానని.. ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నానని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X