Bigg Boss: ఫినాలే ముందు సిరి, షణ్ముఖ్‌కు షాక్.. బిగ్ బాస్ చేసిన పనికి బిత్తరపోయిన కంటెస్టెంట్లు
ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా దీనికి తెలుగు ప్రేక్షుకులు భారీ స్పందన అందించారు. దీంతో ఇప్పటి ఐదో సీజన్ వరకూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. తాజా సీజన్‌లో ఎక్కువ హైలైట్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ పేర్లు ముందుగా చెప్పుకోవాలి. దీనికి కారణం హౌస్‌లో వీళ్లిద్దరూ చేస్తున్న రచ్చే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్‌కు బిగ్ బాస్ షాకిచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జంటగా ఫేమస్ అయిన సిరి, షన్ను
తాజా సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిచారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి హన్మంత్ తరచూ విమర్శలను ఎదుర్కొంటూ వచ్చారు.

హగ్గులు... ముద్దులతో హాట్ టాపిక్‌గా
సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బయట స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులిచ్చుకోవడం.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో వీళ్ల బంధంపై విమర్శలు చెలరేగాయి.

ఇద్దరూ టాప్ 5లోకి చేరకున్నారుగా
ఆరంభం నుంచీ తమ తమ ఆటతీరుతో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఇద్దరూ సత్తా చాటారు. ఎవరికి వారే చక్కగా ఆడుకుంటూ ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. దీంతో ఇద్దరూ ఇంటికి కెప్టెన్లుగా కూడా ఎంపికయ్యారు. అలా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను సైతం తప్పించుకున్నారు. ఇలా మొదటి నుంచీ ఆకట్టుకుంటూ సిరి, షన్నూ ఇద్దరూ ఫినాలేకు చేరుకున్నారు.

సిరి జర్నీ వీడియో.. ప్రశంసలతోనే
ఫినాలేకు సమయం దగ్గర పడడంతో అందరి జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో సిరి వంతు వచ్చింది. ఆ సమయంలో 'అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నది మీ విషయంలో నిజమైంది. ఈ బిగ్‌బాస్ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు' అని ప్రశంసించాడు బాస్.

ఆమె వీడియోలో కూడా షణ్ముఖ్‌నే
సిరి హన్మంత్ గురించి బిగ్ బాస్ మాట్లాడిన తర్వాత ఆమె జర్నీ వీడియోను చూపించారు. ఇందులో తనను తాను అన్ని రకాలుగా చూసుకుని ఆమె ఎంతగానో సంతోషించింది. అదే సమయంలో వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు, చోటూ (శ్రీహాన్) కనిపించగానే కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. ఇక, ఈమె జర్నీ వీడియో మొత్తంలో షణ్ముఖ్ జస్వంత్ ఎక్కువ సార్లు కనిపించాడు.
Pushpa Business: షాకిస్తోన్న పుష్ప బిజినెస్.. బాహుబలిని దాటేసి రికార్డు.. అన్ని కోట్లు వస్తేనే హిట్

సర్‌ప్రైజ్ చేయాలని అనుకుందిగా
బిగ్ బాస్ జర్నీ వీడియో చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఫొటోల్లో ఒక దానిని తీసుకునే అవకాశం కంటెస్టెంట్లకు ఉంటుంది. అయితే, ఇప్పుడున్న వాళ్లంతా (శ్రీరామ చంద్ర మినహా) రెండేసి ఫొటోలు కూడా తీసుకున్నారు. కానీ, సిరి హన్మంత్ మాత్రం తనకు ఇష్టమొచ్చినన్ని ఫొటోలను తీసుకెళ్లింది. అందులో ఒక దాన్ని షన్నూను సర్‌ప్రైజ్ చేయాలని ఆమెతో పాటు తీసుకెళ్లింది.
Recommended Video

వాళ్లిద్దరికి భారీ షాకిచ్చిన బిగ్ బాస్
షణ్నుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చిన సిరి హన్మంత్.. సర్‌ప్రైజ్ ఇద్దామని దాన్ని డైనింగ్ టేబుల్‌పై దాచిపెట్టింది. ఇంతలో బిగ్‌బాస్ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేశారు. దీంతో వాళ్లిద్దరికీ భారీ షాక్ తగిలినట్లు అయింది. ఈ విషయాన్ని తర్వాత సిరి.. షన్నూకు చెప్పింది. దీంతో అతడు కూడా నిరాశకు లోనయ్యాడు.


Click it and Unblock the Notifications











