Priyanka Jain: సడెన్‌గా పెళ్లిచేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్.. ఇలా షాకిచ్చిందేంటి?

సీరియల్ నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ జానకీ కలగనలేదు, మౌనరాగం సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందడి చేసిన ఈబ్యూటీ.. తన ఆటతో టాప్ 5లో నిలిచింది. అయితే ఈ బ్యూటీ సీరియల్ నటుడు శివ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఎప్పుడూ అంటూ ఎంతో కాలంగా మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికీ వీరు పెళ్లితో ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రియాంకపై ముద్దుల వర్షం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఫైనల్స్ వరకు వెళ్లిన ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి తెలిసిందే. బుల్లితెరపై పలు సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక.. తన సహ నటుడు శివ్‌తో ప్రేమలో గత కొన్నేళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వీక్‌లో తనను కలవడానికి శివ్ రావడం... ఆమెపై ముద్దుల వర్షం కురిపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Shiv Marriage Video Goes Viral Full Details Here

కలిసే ఉంటున్నారు కానీ...
ప్రియాంక మీద శివ్ చూపించిన ప్రేమను చూసి చాలామంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ జంటకు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హాస్ లో శివ్.. పెళ్లి చేసుకుందాం వెంటనే... హౌస్ నుంచి బయటకు రాగనే చేసుకుందామంటూ చెప్పుకువచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ జంట ఇప్పటి వరకు పెళ్లిచేసుకోలేదు. కలిసి ఉంటూ తమ యూట్యూబ్ వేదికగా వీడియోలు చేస్తూ.. ట్రెండింగ్ లో ఉంటున్నారు.

Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Shiv Marriage Video Goes Viral Full Details Here

ఫ్యామిలీస్టార్ సందడి
అయితే ఈ జంట సడెన్ గా అభిమానులకు షాక్ ఇచ్చారు. సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. అయితే రియల్ లైఫ్ లో పెళ్లి కాదు.. స్టార్ మాటీవీ ఉగాది పండుగ సందర్భంగా ఉగాదికి పండగొచ్చింది అనే పేరుతో షో నిర్వహించారు. ఇక ఈ షోలో స్టార్ మా యాక్టర్స్ ఫ్యామిలీతో కలిసి వచ్చి సందడి చేశారు. దీనికి ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్టుగా చేసింది. ఇక ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీ వచ్చారు.ఇక దిల్ రాజు తన భార్యతో, కొడుకుతో వచ్చి సందడి చేశాడు.

OTTలోకి అన్ లిమిటెడ్ కామెడీ మూవీ... ఎందులో చూడాలంటే?

షాకిచ్చిన ప్రియాంక
ఇక ఈ వీడియోలో ప్రియాంక జైన్ పెళ్లి చేసుకుని షాకిచ్చింది. స్టార్ మా నటుల మధ్య నటుడు శివ్ ని వివాహం ఆడింది. కన్నుల విందుగా వీరి పెళ్లిని జరిపించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, స్టార్ మా యాక్టర్స్ అందరూ వచ్చారు. అయితే ఇది నిజమైన వివాహం కాదని తెలుస్తోంది. కేవలం షో కోసం ఇలా చేశారని అర్థం అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. ప్రియాంక డబ్బుల కోసం ఇంత అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ ప్రోమోను చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X