Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ రివర్స్ గేమ్.. కెప్టెన్సీ ఇవ్వకుండా టైటిల్ ఇచ్చేందుకు ప్లాన్.. ఎవరికో అర్థమైంద

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. పన్నెండో వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఈక్రమంలోనే 13వ వారం కెప్టెన్ కోసం అద్భుతమైన టాస్స్ ను ఇచ్చారు. బిగ్ బాస్ తనకు కావాల్సిన వాళ్లనే కెప్టెన్ చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. ఆక్రమంగానే అడుగులు వేసి.. తనకు నచ్చిన సీరియల్ బ్యాచ్ వాళ్లను కంటెండర్లుగా చేశాడు. కానీ చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. టైటిల్ ఫేవరెట్ కు ప్లస్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అసలేం జరిగింది అనుకుంటున్నారు.. చూద్దాం పదండి.

ఈవారం కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్, అంబటి అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, శివాజి, పల్లవి ప్రశాంత్ లు వచ్చారు. అయితే వీరిలో ఇద్దరి ఫొటోలు ఫిక్స చేసి ఉండగా.. మరో ఇద్దరు హౌస్ మేట్స్ వచ్చి వారిలో ఒకరని కంటెండర్ షిప్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇలా ఈ టాస్క్ నుంచి ముందుగా అంబటి అర్జున్, శోభా శెట్టిల ఫొటోలు వచ్చాయి. గౌతమ్, ప్రియాంకలు కలిసి శోభాశెట్టిని తప్పించారు. ఆ తర్వాత వచ్చిన యావర్, రతికలు.. శివాజి, పల్లవి ప్రశాంత్ ఫొటోలు రాగా.. రైతుబిడ్డను రేస్ నుంచి తప్పించారు. అక అమర్ దీప్, అశ్విని ఫొటోలు రాగా.. అశ్విని ఫొటో కాల్చేసి ఆమెను రేస్ నుంచి తప్పించేశారు.

Bigg Boss Telugu 7 Reverse Game on Amardeep Check Details Here

ఇలా ఫైనల్స్ కు వచ్చిన అమర్ దీప్, అంబటి అర్జున్, శివాజిలు వచ్చారు. రతికా రోజ్ ఫొటో చూపించలేదు, అలాగే ఆమె రేస్ లో ఉన్నట్లు చూపించలేదు. కానీ ఇప్పుడు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే మాత్రం అమర్ దీప్ కెప్టెన్ కాలేకపోయాడని తెలుస్తోంది. ముందుగా శివాజి.. అంబటి అర్జున్, అమర్ దీప్ ఫొటోలు వస్తే కష్టం అని.. అర్జున్ వైఫ్ కడుపుతో ఉంది, అతడిని రెండోసారి కెప్టెన్ గా చూడాలనుకుంది కాబట్టి వాడికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఆయన ఊహించినట్లుగానే ఫైనల్స్ లో వీరిద్దరి ఫొటోలు వచ్చాయి. అయితే శివాజి మాత్రం అమర్ కు సపోర్ట్ చేయలేదు.

శోభాను, శివాజిని పిలిచి.. అమర్ దీప్, అర్జున్ లలో ఒకరిని కెప్టెన్ చేయాలని సూచించారు. అయితే శివాజి మాత్రం తాను అర్జున్ కే సపోర్ట్ చేస్తానని చెప్పగా.. శోభాశెట్టి మాత్రం అమర్ కే సపోర్ట్ చేస్తానని వివరించింది. కారణాలు చెప్పు అంటే తాను ఇంట్లోంచి వెళ్లిపోయేలోపు అమర్ కు ఏదైనా చేస్తానని మాటిచ్చానని..అందుకే తనకు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పింది. దీంతో గెలవలేకపోతున్నాననే బాధతో అమర్ దీప్ గుక్కపెట్టి ఏడ్చాడు. అది చూసిన శివాజి ఏడ్చి గెలవాలనుకోకూడదు.. అసలు ఏడ్వడం ఏంట్రా వద్దు అని చెబుతూనే సపోర్ట్ చేయనని వివరించాడు.

స్వలింగ సంపర్కుడి పాత్రలో స్టార్ హీరో.. సినిమాను బ్యాన్ చేసిన రెండు దేశాలు!

Bigg Boss Telugu 7 Reverse Game on Amardeep Check Details Here
మరోవైపు అంబటి అర్జున్ కూడా ఏడ్చి సాధించేది కాదురా ఇది అంటూ వివరించే ప్రయత్నం చేసినా అమర్ దీప్ మాత్రం ఏడుపు ఆపలేదు. నేను దేనికీ పనికిరాను, ఏ గేమూ ఆడలేదు, కండలుండి, బాడీ ఉంటేనే వాళ్లు గ్రేట్,.. వారికే అంతా సపోర్ట్ చేస్తారంటూ విపరీతంగా ఏడుస్తూ చెప్పాడు. ఆ తర్వాత అమర్ దీప్ ఫొటో కాలిపోవడం.. ఆయన గుక్కపెట్టి ఏడ్వడం మనం ప్రోమోలో చూడవచ్చు. వాస్తవానికి ఈయనకి కెప్టెన్సీ ఇవ్వడం కంటే ఇవ్వకపోతే ఎక్కువ సింపతీ గెయిన్ అవుతుందని భావించిన బిగ్ బాస్ యే ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ సింపతీ వల్ల ఈ మధ్య అమర్ దీప్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X