Bigg Boss Telugu 7: టాప్-5లో లేకపోతేనేం.. బిగ్‌బాస్‌ విన్నర్‌కి కూడా దక్కని ఛాన్స్ కొట్టేసిన శోభాశెట్టి

బిగ్ బాస్ తెలుగు 7 రేపటితో ముగియనుంది. అయితే ఈ సీజన్ లో 14వ వారంలో ఎలిమినేట్ అయిన శోభాశెట్టికి.. విన్నర్ కు మించిన అవకాశం లభించింది. ఈ భామ ఎలిమినేట్ అయ్యాక.. బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్రలో ఛాన్స్ కొట్టేసిందంట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా మోనిత పాత్ర పోషించి అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది ఈ భామ. బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఈ సీజన్ లో కచ్చితంగా శోభ శెట్టి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ భామ బిగ్ బాస్ హౌస్ నుంచి 14వ వారం ఎలిమినేట్ అయింది.

 Bigg Boss Telugu 7 Shobha Shetty got a chance in the movie Chiranjeevi Mega 156 Viswambhara Movie Full Details Here

శోభాశెట్టి ట్రోఫీ గెలవక పోయిన టాప్ 5లో ఉంటుందని భావించింది. అసలు ఈ భామ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందని... కాకపోతే.. బిగ్ బాస్ కాపాడుతూ వచ్చి 14వ వారంలో ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఈ భామ ఎంటర్ అవ్వకుండా ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి బాగానే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఆమె వల్లే టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగాయని చెప్పవచ్చు. అనవసర విషయాలలో తల దూర్చే వాళ్లే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం ఉంటారు. ఇక 14 వారాలుగా ఈ భామ ఎలిమినేట్ అవ్వకుండా బాగానే ఆటను సాగించింది. నలుగురితో మంచిగా ఉంటూ ఎవరైతే తనకు యాంటీగా ఉన్నారో వాళ్లను టార్గెట్ చేయడం అలాంటి పనులు బాగానే చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన శోభా శెట్టిపై కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. 5వ వారంలో ఎలిమినేట్ కావాల్సింది... ఇన్ని వారాలు ఎలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. శోభాశెట్టి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్... ఇది కదా విన్నర్ కు మించిన ఆఫర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 Bigg Boss Telugu 7 Shobha Shetty got a chance in the movie Chiranjeevi Mega 156 Viswambhara Movie Full Details Here

Year End 2023 ప్రభాస్‌ను కొట్టే వాడు లేడుగా.. ఎంత మంది ఉన్నా రెబల్ స్టార్ తర్వాతే!

చిరంజీవి సినిమాలో శోభాశెట్టికి ఆఫర్ వచ్చిందట. ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం ఆమెను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు శోభ శెట్టి ఫ్యాన్స్ కూడా చిరంజీవి సినిమా అంటే 100 బిగ్ బాస్ ట్రోఫీలతో సమానం .. డోంట్ వర్రీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X