Bigg Boss Telugu 7: రైతుబిడ్డను మరోసారి కాపాడిన శివాజి, భోలె.. వాళ్లకు మాత్రం బిగ్ షాకిచ్చారుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజు సండే కావడంతో.. ఫుల్ కామెడీ టాస్కులు పెడుతారు. అలాగే చివరకు ఓ వ్యక్తిని ఎలిమినేట్ చేసి అందరినీ కంటతడి పెట్టేలా చేస్తారు. కానీ అంతకు ముందు వచ్చే ఫన్నీ టాస్కులను మాత్రం ప్రతీ ఒక్కరూ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా చేస్తారు. అయితే తాజాగా ఈరోజుటి ప్రోమో విడుదల అయింది. అందులో నాగార్జున ఓ ఫన్నీ టాస్కును ఇచ్చారు. అయితే దీని ద్వారా కామెడీకి బదులుగా... ఇంటి సభ్యులపై తమకు ఉండే ఫేవరిజం కనిపించింది.
సండే ప్రోమోలో.. ముందుగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో మాస్ డ్యాన్సుతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఇంటి సభ్యులకు హాయ్ చెబుతారు. ఈక్రమంలో చాలా బాగున్నారని శోభా శెట్టి చెబుతుంది. ఆ తర్వాత నాగార్జున సరదాగా ఓ చిన్న ఆటాడుకుందామని చెప్పి.. గౌతమ్ కృష్ణను పిలుస్తాడు. అయితే ఆయనకు ఎక్కువగా ఇంట్లో నచ్చే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ ల ఫొటోలు ఇచ్చి.. వారిద్దరి ఫొటోలను ఓ పడవలో పెట్టమని వివరించాడు. ఆ తర్వాత బోటు మునిగిపోయే అవకాశం వస్తే వీరిలోంచి నీళ్లలో ఎవర్ని తోసేసి ఎవర్ని సేవ్ చేస్తావని అడిగాడు. అందుకు కాస్త ఆలోచించిన గౌతమ్.. అర్జున్ ను నీళ్లలో పడేస్తానని.. ప్రియాంకతో తనకు బాండింగ్ ఎక్కువని చెప్పాడు.

ఇక ఆ తర్వాత అంబటి అర్జున్ పిలవగా.. గౌతమ్ కృష్ణను సేవ్ చేసి అమర్ దీప్ ను నీళ్లలో తోసేస్తానని చెప్పాడు. అలాగే వాడంతట వాడు ఎవరి హెల్స్ లేకుండా సేవ్ కావలి ఈ ఇంటి నుంచి కవర్ చేశాడు. దానికి అమర్ దీప్ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ ను పిలిచి ప్రియాంక జైన్, శోభా శెట్టిల్లో ఎవర్ని కాపాడి, ఎవర్ని నీళ్లలో తోసేస్తావని అడగ్గా.. తానే మునిగిపోతానని చెప్పాడు. దీనికి అంతా నవ్వారు. అలాగే ప్రిన్స్ యావర్ ను పిలిచి.. రతిక, శివాజిల ఫొటోలు ఇచ్చారు. దీనికి యావర్ ఫుల్లగా ఆలోచిస్తుంటే.. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావని అడిగారు. అందుకో యావర్ ఈ టాస్కు అయిన పోయిన తర్వాత ఏం జరుగుతుందనేది నేను ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఆ తర్వాత శివాజిని సేవ్ చేసి రతిక ఫొటోను నీళ్లలో వేస్తాడు.
ఇక ఆ తర్వాత టేస్టీ తేజను పిలవగా.. శోభా శెట్టిని నీళ్లలో తోసేసి ప్రిన్స్ యావర్ ను కాపాడినట్లు చూపించారు. అనంతపరం వచ్చిన భోలె షావళి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను కాపాడతానని, అశ్వినీ శ్రీని నీళ్లలో తోసేస్తానని చెప్పారు. రైతుబిడ్డగా వచ్చి మంచి బీజం ఏర్పరుచుకున్నాడని పల్లవి గురించి వివరించాడు. ఇక ఆపై వచ్చిన శివాజికి... పల్లవి ప్రశాంత్, యావర్ ల ఫొటోలు ఇవ్వగా... రైతుబిడ్డను సేఫ్ చేశాడు శివాజి. అలాగే ప్రిన్స్ యావర్ మనసు నొచ్చుకోకుండా.. తాను ఇంట్లో ఉన్నా లేకున్నా ప్రిన్స్ యావర్ ఫైనస్స్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
Sobhita Dhulipala: తెగించిన తెలుగు అందం.. చీరతోనే చిత్రవధ చేస్తున్న శోభితా!

ఫన్నీగా ఇచ్చిన ఈ టాస్కులో ఇంట్లోని సభ్యుల మనసుల్లోని మాటలను బయటకు తెచ్చారు హీరో నాగార్జున. కానీ కొందరికి మాత్రం ఈ టాస్కు ఎవరికి ఎవరు ఫేవరెట్ అనేది తెలిసేలా చేశారంటూ అంతా అనుకుంటున్నారు. మరికొందరేమో క్లోజ్ గా ఉన్న వాళ్లకు గొడవలు పెట్టేందుకే బిగ్ బాస్ ఇలాంటి టాస్కులు ఇస్తారని అంటున్నారు. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం రాత్రి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











