Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు బెయిల్.. కానీ రైతుబిడ్డకు అలాంటి కండీషన్లు!
బిగ్ బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్.. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఇటీవల కోర్టులో హాజరు పరచగా ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుపై తనకు బెయిల్ కావాలంటూ తన తరఫున లాయర్ తో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయించాడు ప్రశాంత్. గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరుపగా... ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ తెలుగు 7 ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం ముగియడం లేదు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరుపుకున్న బిగ్ బాస్ షో.. ఆరోజున విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. బిగ్ బాస్ షో అనంతరం పల్లవి ప్రశాంత్ ను బిగ్ బాస్ నిర్వాహకులు మెయిన్ గేట్ నుంచి కాకుండా... వెనుక గేట్ నుంచి పంపించాలని చూశారు. పోలీసులు కూడా సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోమ్మని ప్రశాంత్ కు సూచించారు.
Recommended Video


అయితే నేనేం తప్పు చేయలేదు.. కప్పు గెలుచుకున్నాను.. నేను ఒక రైతు బిడ్డను అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చి మరీ ర్యాలీ నిర్వహించాడు. అలా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి.. మళ్లీ అన్న పూర్ణ స్టూడియోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కారుపైన, బిగ్ బాస్ బజ్ హోస్టుగా చేస్తున్న గీతు రాయల్, అశ్విని శ్రీ కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేశారు.
ఇక ఈ దాడిలో కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఇక అమర్ దీప్ ఫ్యామిలీ కారులోపల ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆస్తులైన టీఎస్ఆర్టీసీ బస్సులను సైతం వీరు ధ్వంసం చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పల్లవి ప్రశాంత్ పై పబ్లిక్ న్యూసెన్స్ కింద సుమోటగా పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇక ఈ క్రమంలోనే పల్లవిప్రశాంత్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్డులో హాజరు పరిచారు.

ఇక కోర్టులో హాజరు పరుచగా.. పల్లవి ప్రశాంత్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ ను చంచల్ గూడా జైలుకి తరలించారు. ఇక పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరులు, మరో 16 మందిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం... తన తరుపు న్యాయవాదితో నాంపల్లి కోర్టులో పిటిషన్ వెయించారు. ఇక గురువారం విచారణ జరిపిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇక పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు... అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రశాంత్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని సమాచారం. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశిందని తెలుస్తోంది.

ఇక ఈ కేసులో A-1గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా, A-2గా అతడి సోదరుడు మనోహర్ ను, A-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు పోలీసులు. ప్రస్తుతం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











