Bigg Boss Telugu 7: టికెట్ టు ఫినాలే టాస్క్‌తో తారుమారవుతున్న టాప్ 5 లెక్కలు.. విన్నర్ మాత్రం అతడే!
బిగ్ బాస్ షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రేటింగ్ తో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈషో ఏడో సీజన్ కు సక్సెక్ ఫుల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారం కూడా సూపర్ టాక్ తెచ్చుకుంటూ ముందుకెళ్తోంది. నామినేషన్ల పర్వం చాలా హాట్ హాట్ గా ముగిసిందో లేదో వెంటనే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం 8 టాస్క్ లు ఇచ్చాడు. ఇందులో గెలిచేందుకు కంటెస్టెంట్లు చాలా కష్టపడుతున్నారు.
ముఖ్యంగా టికెట్ టు ఫినాలే సాధించేందుకు స్నేహితులను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తామే గెలవాలన్న కసితో గేమ్ ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ లో అమర్ దీప్ కు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. విన్నర్ కూడా ఆయనే అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ టాస్క్ లో భాగంగా ప్రియాంక, అమర్ దీప్ లు గొడవ పడ్డారు. శోభా కూడా ఇద్దరినీ కలపాల్సింది పోయి అమర్ పక్కన చేరి మరింత గొడవ పెడుతోంది. ఈక్రమంలోనే ప్రియాంక కూడా తన పాయింట్లను ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ కు ఇచ్చి అమర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ టాస్క్ తో ఓటింగ్ లిస్ట్ అంతా ఉల్టాపుల్టాగా మారిపోతుంది. ఇప్పటి వరకు బాటమ్ లో ఉన్న శోభా శెట్టి ఈరోజు ఓటింగ్ లో పైకి వచ్చింది. అయితే ఆమె ఎలాగూ టాప్ 5లోకి రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ వారం శివాజి ఓటింగ్ పూర్తిగా పెరిగిపోతుంది. ఈ సీజన్ విన్నర్ గా ఆయనే నిలుస్తారని చూసిన ప్రతీ ఒక్కరికీ అయిపోతుంది. అంతే కాకుండా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ రన్నరప్ గా నిలవబోతున్నాడు. ప్రతీ వారం ఓటింగ్ ను పరిశీలించినట్లు అయితే వీరే టాప్ లో ఉంటున్నారు. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ నిలవబోతుండగా.. ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉంటాడు.
అయితే టాప్ 5 లో చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉంటుంది. అయితే శోభా శెట్టికి, ప్రియాంక జైన్ కు ఓటింగ్ విషయంలో పెద్దగా తేడా అయితే లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ప్రియాంక జైన్ టాప్ 5 లోంచి కిందకు రాదు. ఒకవేళ వస్తుందంటే మాత్రం శోభాశెట్టి పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఇక చివరగా ఉన్నది అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణలు. వీరిలో ఈ వారం కచ్చితంగా అంబటి అర్జున్ యే ఇంట్లోంచి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక రాబోయే వారంలో గౌతమ్ కృష్ణ, శోభా శెట్టిల్లో ఎవరో ఒకరు వెళ్లిపోతారు.
ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప శోభాశెట్టి వెళ్లిపోదు. అలా టాప్ 5లోకి కూడా చేరదు. కానీ ఈ రెండు వారాల్లో టాప్ లో ఉండే ఏ కంటెస్టెంట్ అయిన తీవ్ర స్థాయిలో నెగిటివిటీ తెచ్చుకుంటే మాత్రం టాప్ 5 లిస్ట్ మరోసారి మారుతుంది. కానీ ఈ సీజన్ విన్నర్, రన్నరప్ లు మాత్రం ఫిక్స్ అని తెలుస్తోంది. శివాజి కప్పు కొట్టుకొని వెళ్తే.. ఆయన తమ్మడు పల్లవి ప్రశాంత్ రన్నప్ గా నిలుస్తాడు.


Click it and Unblock the Notifications











