Pallavi Prashanth: యూట్యూబ్‌లోకి మళ్లొచ్చిన పల్లవి ప్రశాంత్.. అలాంటి వీడియోతో రైతుబిడ్డ ఎంట్రీ!
బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురింతి తెలుగు బుల్లితెర ప్రేక్షుకలుక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ మాన్ గా అనేక కష్టాలు పడి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అద్భుతమైన ఆట తీరును కనబర్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని స్థాయిలో విన్నర్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
అయితే బిగ్ బాస్ తర్వాత నుంచి ఈయన యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు అప్ లోడ్ చేయలేదు. కానీ తాజాగా ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు. తన ఛానెల్లోనే ఈ వీడియో పెట్టి ఆయన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. అయితే ఆ వీడియో ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసిన కొత్త వీడియో విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ముందుగా టిక్ టాక్ లో అనేక వీడియోలు చేసేవాడు. యూట్యూబ్ లో కూడా ఓ ఛానెల్ పెట్టి తన ఫర్మింగ్ కు చెందిన వీడియోలను అప్ లోడే చేసేవాడు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అందులో పంచుకునే వాడు. మట్టి, ఆకులు, అలములు తింటూ కూడా వీడియోలు పెట్టి రచ్చ చేశాడు. ముఖ్యంగా అమ్మకు సాయం చేస్తూ, ఇల్లూ, వాకిలి ఊడుస్తూ కూడా గతంలో ఈయన వీడియోలు చేశాడు.

అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ ఈయన కథ అంతా మారిపోయింది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ఈయన తనకు వచ్చిన క్రేజ్ ఆధారంగానే హుందాగా ఉండాలని ఫిక్స్ అయినట్లు.. ముఖ్యంగా ఈయనకు బిగ్ బాస్ హౌస్ లో ఎంతో అండగా ఉన్న శివాజీ చెప్పిన మాటలు మైండ్ లో ఉంచుకుని పిచ్చి పిచ్చి వీడియోలు చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ అయిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఈయన మాత్రం ఒక్క వీడియో కూడా చేయలేదు.
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న బాలీవుడ్ హీరో.. ఎవరు, ఎందుకో తెలుసా?
ఎంతో మంది సబ్ స్క్రైబర్లు ఉన్నా.. పల్లవి ప్రశాంత్ తన ఛానెల్ ని మానిటైజేషన్ కూడా చేసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా నేరుగా శివాజీయే దగ్గరుండా రైతుబిడ్డ యూట్యూబ్ ఛానెల్ ను మానిటైజ్ చేశారు. ఈ విషయాన్ని శివాజీయే నేరుగా చెప్పారు. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన ఇంతకాలానికి ఈయన తొలిసారి యూట్యూబ్ లో వీడియో పెట్టారు. అయితే ఈ వీడియోలో ఏముందంటే..!
పల్లవి ప్రశాంత్ యే నేరుగా తన పత్తిని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లాడు. ముఖ్యంగా ట్రాక్టర్ లో పత్తి సంచులు వేసుకుని మార్కెట్ కు వెళ్లి.. ఆయనే నేరుగా వాటిని దించి కాంటా చేయించాడు. అక్కడున్న వాళ్లతో అందరితో చక్కగా మాట్లాడాడు. సెల్ఫీలు అడిగిన వాళ్లకు కాదనకుండా సెల్ఫీలు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత తన తండ్రి వచ్చి డబ్బులు తీసుకున్నాడు. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని కొడుకుతో కలిసి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో టీ షాప్ మహిళ.. రైతుబిడ్డపై ప్రేమను కురిపించింది. నీకు ఓటేసి గెలిపించా, సపోర్ట్ చేశానంటూ చెప్పగా.. ప్రశాంత్ ఫుల్ ఖుషీ అయ్యాడు.


Click it and Unblock the Notifications











