Bigg Boss Voting: తొలి వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. చిన్నోడికి భారీగా.. డేంజర్ జోన్‌లో బిగ్ సెలెబ్రిటీ
బుల్లితెరపై సరికొత్త చరిత్రను లిఖించేలా ప్రేక్షకుల రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో ప్రారంభం అయిన ఇది.. ఏకధాటిగా సీజన్ల మీద సీజన్లను ప్రసారం చేసుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎనిమిదో సీజన్‌ను సైతం నిర్వహకులు మొదలు పెట్టేశారు. భారీ అంచనాలు ప్రసారం అవుతోన్న ఇందులో మొదటి వారం ఊహించని ఓటింగ్ జరుగుతోంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
ఎనిమిదోది ఎంతో కొత్తగా
మిగిలిన అన్ని భాషల కంటే తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షో అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా ఇది వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్ అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో మొదలైంది. ఇందులో గత సీజన్లలో ఎప్పుడూ కనిపించని ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, రూల్స్ కనిపిస్తున్నాయి.
Malvika Sharma: అందాల సినిమా చూపించిన హీరోయిన్.. లోపల కూడా ఏమీ వేసుకోకుండా!

ఇప్పుడు వీళ్లే.. వైల్డ్ కార్డ్
గత సీజన్ సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ భారీ అంచనాలతో మొదలైంది. ఇందులోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. అలాగే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలనూ ప్లాన్ చేశారు.
నామినేషన్‌లో ఆరుగురు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతోనే సాగింది. అందుకే ఈ ప్రక్రియను రెండు వారాల పాటు ప్రసారం చేశారు. ఇక, ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో విష్ణుప్రియ, సోనియా, బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ బాషాలు నామినేషన్‌లోకి వచ్చారు.
ఓటింగ్‌లో బిగ్ ట్విస్టులే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ బుధవారం రాత్రి నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఇది మాత్రం ఎవరూ ఊహించని విధంగా సాగుతన్నట్లు తెలిసింది. మొదట్లో ఇందులో విష్ణుప్రియ భీమనేని టాప్‌లో ఉంది. కానీ, సింపతీ ఎక్కువగా పొందుతోన్న నాగ మణికంఠ ఇప్పుడు అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నట్లు తెలిసింది.
వాళ్ల స్థానాల్లో మార్పులే
ఎనిమిదో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో నాగ మణికంఠ మొదటి స్థానానికి రావడంతో విష్ణుప్రియ భీమనేని రెండో స్థానానికి పడిపోయింది. వీళ్ల తర్వాత స్థానాల్లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వీళ్ల స్థానాలు క్రమంగా అటు ఇటు అవుతున్నాయి. ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ మూడో స్థానంలో, సోనియా ఆకుల నాలుగో స్థానంలో ఉన్నారు.
ఫేమస్ ప్లేయర్ లాస్ట్‌లో
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో పెద్దగా ఫాలోయింగ్ లేని బెజవాడ బేబక్క ఐదో స్థానంలో ఉండగా.. మంచి ఫాలోయింగ్ ఉన్న శేఖర్ బాషా ఆరో స్థానంతో డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఓటింగ్ మారుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











