Bigg Boss Telugu 9th Week Voting: బిగ్‌బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతున్న తనూజ.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

Bigg Boss Telugu 9th Week Voting: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రతి వారం కొత్త ట్విస్టులతో, సీక్రెట్ టాస్క్‌లతో, నామినేషన్‌లలో తలెత్తే ఉద్రిక్తతలతో ఈ సీజన్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే హౌస్‌లో పలు సీక్రెట్ టాస్క్‌లు, వ్యూహాలు, ఎమోషనల్ డ్రామా చోటు చేసుకోగా, 9వ వారం నాటికి హౌస్ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ మధ్య మాటా మాటా తగవులు, వ్యూహాత్మక కదలికలు, స్నేహాలు, విభేదాలు అన్నీ కలగలిసి హౌస్ ను హీటెక్కించాయి. ఈ నేపథ్యంలో 9వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్‌జోన్ లో నిలిచారు? అనే విషయంలోకి వెళితే..

రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్..
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు.. 15 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల, పవన్ డీమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరు హౌస్ లో ఉండటానికి తమదైన స్ట్రాటజీతో గేమ్‌లో నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వారం బిగ్ బాస్ కొత్త నామినేషన్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడంతో హౌస్‌లో కొత్త హీట్ క్రియేట్ అయ్యింది. సీక్రెట్ టాస్క్‌ల పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య అనుమానాలు, చర్చలు, భావోద్వేగాలను రగిలించాడు.

Bigg Boss Telugu 9th Week Voting Results Thanuja Leads Ram rathod Sai Srinivas in Danger Zone

నామినేషన్స్ లో నిలిచింది వీరే..
ఇక 9 వారం నామినేషన్స్ ప్రక్రియలో మోస్ట్ సెన్సేషనల్ గా తనూజ పుట్టస్వామి మారారు. తన తండ్రిలా భావించే భరణిని నామినేట్ చేయడం హౌస్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ చర్యతో ఆమెపై హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈసారి నామినేట్ అయిన వారిలో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్‌ను వీడనున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లే అవకాశముంది.

ఓటింగ్ ట్రెండ్స్ ఇలా..
సోషల్ మీడియాలో తాజా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. తనూజ పుట్టస్వామి మరోసారి టాప్‌లో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ పోల్స్ ప్రకారం ఆమె 32 శాతం ఓట్లు పొందింది. గేమ్‌లో యాక్టివ్‌గా ఉండటం, టాస్క్‌లలో దూకుడుగా ఆడటం, ఎమోషనల్ కనెక్ట్‌ కారణంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పడాల 21.35 శాతం ఓట్లు పొంది రెండో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు టాప్‌లో ఉన్న ఆయన, ఈ వారం కొద్దిగా వెనుకబడ్డారు. అయినప్పటికీ, ఆయన గేమ్‌లో వ్యూహాలు, నాయకత్వ నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక మూడో స్థానంలో సీనియర్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి నిలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన రెబల్ సీక్రెట్ టాస్క్‌ను అద్భుతంగా పూర్తి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 14.25 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్న ఆయన గేమ్ ప్రెజెన్స్ హౌస్‌లో చురుకుదనం పెంచింది.

డేంజర్ జోన్ లో నిలిచేందేవరు?
ఇక నాలుగో స్థానంలో ఉన్న భరణి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్‌ మోడ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఎవరికీ బంధాలు పెట్టుకోకుండా నో బాండింగ్ అటిట్యూడ్‌తో ముందుకు సాగుతున్న ఆయన 10.61 శాతం ఓట్లు సాధించి టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ తరువాత సంజన గల్రానీ సైలెంట్‌గా గేమ్ ఆడుతున్నా ప్రేక్షకుల నుంచి మద్దతు బలంగా వస్తోంది. ఈ వారం ఆమెకు 9.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆమె తర్వాత రాము రాథోడ్ ఉన్నారు. ఈ మధ్య ఆయన హౌస్‌లో చాలా సైలెంట్‌గా మారి ఎవరితోనూ పెద్దగా మెలగకపోవడం వల్ల 8.17 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు. చివరగా సాయి శ్రీనివాస్ ఈ వారం అత్యంత తక్కువ ఓట్లు పొందారు. కేవలం 4.09 శాతం ఓట్లతో ఆయన డేంజర్ జోన్‌లో ఉన్నారు.

బాధగా ఉంది.. మిమ్మల్నీ చాలా మిస్ అవుతున్నా: రష్మిక ఎమోషనల్
సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ ?
ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ చూస్తే ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన తొలిసారి నామినేషన్‌లోకి రావడం, బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం, పీఆర్ నెట్‌వర్క్ లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. అయితే సాయి గేమ్‌లో ఎటువంటి నెగిటివిటీ లేదు. ఫెయిర్‌గా, క్లీన్‌గా ఆడడం ఆయన ప్రత్యేకత. "నేను పోటీ పడటానికి వచ్చా.. ప్రాధేయపడటానికి రాలేదు" అని బల్లగుద్ది చెప్పిన ఆయన ఎవరికి భయపడకుండా నామినేషన్స్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.కానీ, సేఫ్ గేమ్ ఆడకపోవడం, బయట పీఆర్ సపోర్ట్ లేకపోవడం ఆయనకు ఓటింగ్‌లో వెనుకబాటు కారణమైంది.

అయితే.. ఇంకా ఓటింగ్‌కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈలోపు ఏదైనా అద్భుతం జరిగితేనే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ నుంచి తప్పుకునే అవకాశం చాలా తక్కువ. అయితే.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా డబుల్ ఎలిమినేషన్‌ వుంటుందా అనే విషయంపై ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే..రామ్ రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. మొత్తం మీద, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదవ వారం రసవత్తరంగా మారింది. ఎవరు బయటకు వెళ్తారు? ఎవరు టాప్‌లో నిలుస్తారు? అన్న ఉత్కంఠలో ప్రేక్షకులు ఉన్నాయి. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X