twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. మూట, ముళ్లే సర్దుకొనేవాడిని.. కౌశల్ కంటతడి

    |

    పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని కౌశల్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా.. బయటకు వచ్చాక కూడా అశేష ప్రజాదరణ లభిస్తున్నది. దేశ విదేశాల నుంచి అభినందనల వెల్లువ వెల్లువెత్తుతున్నది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన జీవితంలోని ముఖ్య సంఘటనలు వెల్లడించారు. కౌశల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    అలా ఎదురు చూశాను

    అలా ఎదురు చూశాను

    తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతీ టెక్నీషియన్, డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఒక కన్ను నా తల్లి అయితే, మరో కన్ను కళామతల్లి. ఆఫర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టు చాలా తిరిగాను. ఏ ఆఫీస్‌కు వెళ్లకుండా ఎవరైనా పిలిచి మా సినిమాలో నటిస్తున్నావు అని చెబితే చాలా ఎదురు చూశాను.

    పెద్దగా బ్రేక్ రాలేదు

    పెద్దగా బ్రేక్ రాలేదు

    1998లో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. దాదాపు 82 సినిమాల్లో నటించాను. కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. అయినా నిరాశ పడలేదు. బిగ్‌బాస్ తర్వాతైనా బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. బిగ్‌బాస్ తర్వాత నా కెరీర్ ముందుకు వెళ్తుందని అనుకొంటున్నాను.

    మహేష్‌బాబు ఇచ్చిన సపోర్ట్

    మహేష్‌బాబు ఇచ్చిన సపోర్ట్

    తెలుగు సినిమా పరిశ్రమలో గానీ, బిగ్‌బాస్‌ ఎంటర్ కావడానికి ప్రధాన కారణం సూపర్‌స్టార్ మహేష్‌బాబు. రాజకుమారుడు సినిమా చేస్తుంటే నా చేత మోడలింగ్ ఏజేన్సీ పెట్టించి చాలా సహకారమందించాడు. రాఘవేంద్రరావు కూడా చాలా హెల్ప్ చేశాడు. మోడలింగ్ ఏజెన్సీ లేకపోతే మూట ముళ్లే సర్దుకొని వైజాగ్ వెళ్లిపోయేవాడినే.

    మహేష్‌బాబు సూచనతోనే

    మహేష్‌బాబు సూచనతోనే

    మహేష్ బాబు సూచన మేరకు పెట్టిన మోడల్ ఏజెన్సీ నా జీవితానికి ఆసరగా నిలిచింది. సినిమా అవకాశాలు రాకపోయినా మోడల్ ఏజెన్సీ, యాడ్ ఫిలింస్ ఏజెన్సీ నాకు ఆర్థికంగా అండగా నిలిచింది. నా కోసం కాకుండా నా ఏజెన్సీ కోసం వచ్చిన మోడల్స్ కోసం చాలా కష్టపడ్డాను. 5 వేల మంది మోడల్స్‌ను నా మోడల్ ఏజెన్సీ ప్రమోట్ చేసింది.

    పవన్ కల్యాణ్ చేసిన హెల్ప్‌

    పవన్ కల్యాణ్ చేసిన హెల్ప్‌

    బద్రీ, ఖుషీ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ బాగా హెల్ప్ చేశారు. నేను కష్టపడటం చూసి నిన్ను చూసి ముచ్చటేస్తుంది. జీవితం అంటే కష్టం పడటం కాదు. పడిన కష్టాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోవడమే జీవితమని పవన్ చెప్పాడు. పవన్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. బిగ్‌బాస్ గెలువడం 30 శాతం కష్టమైతే.. దానిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం 70 శాతం అని కౌశల్ అన్నాడు.

    ఎస్ఎస్ రాజమౌళి యాడ్ ఫిలింలో

    ఎస్ఎస్ రాజమౌళి యాడ్ ఫిలింలో

    నా కెరీర్ ఆరంభంలో పూరీ జగన్నాథ్ చాలా సహాయం చేశాడు. అందుకు నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఎస్ఎస్ రాజమౌళి, ఏలేటి చంద్రశేఖర్‌ కూడా నాకు హెల్ప్ చేశారు. రాజమౌళి, చంద్రశేఖర్ చేసిన యాడ్ ఫిలింలో నేను మోడల్‌ను కావడం గర్వకారణం. ఇలాంటి గొప్ప డైరెక్టర్ కాల్ చేసి నా సినిమాలో నటిస్తున్నావని ఆఫర్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను.

    English summary
    Bigg Boss winner Kaushal speaks about his journey. He told that Mahesh Babu, Pawan Kalyan are behind my bigg boss entry. He said that he was the model for Rajamouli first Advt film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X