Brahmamudi May 16th episode: కావ్యను కిడ్నాప్ చేసిన రౌడీలు.. ఆ షాక్‌లో రాజ్!
కావ్యకి నిజం తెలుసని సుభాష్ తెలుసుకొని షాక్ అవుతాడు. కంపెనీకి వెళ్లనని తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని మొండికేస్తాడు కళ్యాణ్. సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని మాయని వెతకటానికి బయలుదేరుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 16వ తేదీ ఎపిసోడ్ 411 లో ఏం జరిగిందంటే..
అనామిక రుద్రాణి దగ్గరికి వచ్చి కళ్యాణ్ మళ్లీ ఆఫీస్ కి వెళ్లేలా చేయటానికి ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతుంది. నేను ఇచ్చిన సలహాతో కళ్యాణ్ మరెప్పుడూ ఆఫీస్ మొహం చూడకూడదని మనసులో అనుకొని నీ తల్లిదండ్రులని ఈ ఇంటికి రప్పించు అని అనామిక కి చెప్తుంది రుద్రాణి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటుంది అనామిక . నువ్వు చెప్తే కళ్యాణ్ ఎలాగో వినటం లేదు అదే వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళు మాటకి విలువ ఇచ్చి ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్ కి బుద్ధి చెప్తారు అంటుంది రుద్రాణి.

సరే అమ్మ వాళ్ళని ఇప్పుడే రమ్మంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఆమె తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటుంది రుద్రాణి. మరోవైపు కావ్య అడ్రస్ వెతుక్కుంటూ ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ప్రకారం ఉన్న ఇంటికి వెళ్తే ఆ ఇల్లు తాళం వేసి ఉంటుంది అక్కడ ఉన్న ఆవిడని మాయ గురించి అడిగితే ఆమె సొంత ఇల్లు కొనుక్కొని ఇక్కడనుంచి వెళ్ళిపోయింది అని చెప్పి కొత్త ఇంటి అడ్రస్ ఇస్తుంది. అదే సమయంలో ఆమెని ఫాలో అవుతున్న రౌడీలలో ఒక స్త్రీ కూడా ఉంటుంది.
కావ్యని చూపించి ఆమెని నువ్వు పట్టించాలి అని ఆవిడతో చెప్తాడు ఒక రౌడీ. మరెందుకు ఆలస్యం పదా అని ఆవిడ అనడంతో అందరూ కలిసి కావ్య ని ఫాలో అవుతారు. అప్పుడే కావ్య అప్పు వస్తానంది ఇంకా రాలేదు ఏంటి అనుకుంటూ కొత్త అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరుతుంది. మరోవైపు అనామిక ఫోన్ చేయడంతో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ అనామిక ఇంటికి వస్తారు. అనామికాని తన భర్త సరిగ్గా చూసుకోవటం లేదు తను అనుకున్నట్లుగా ఆమె భర్త ఉండటం లేదు అని కంప్లైంట్ చేస్తారు.
మా అబ్బాయి ప్రేమ గా ఉండాలంటే ముందు మీ అమ్మాయి కూడా ప్రేమగా ఉండాలి కదా, ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటే ఏ భర్త మాత్రం కాపురం చేస్తాడు అంటాడు సుభాష్. అయినా ఆఫీస్ కి వెళ్ళాలి కదా ఎన్నాళ్ళని ఇలా కవితలు రాసుకొని కూర్చుంటాడు అంటాడు అనామిక తండ్రి. మీ అమ్మాయి పరిచయమయ్యేనాటికి వాడు కవితలు మాత్రమే రాసేవాడు కదా అవి నచ్చే కదా మీ అమ్మాయి వెంటపడి మరీ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది.

అల్లు అర్జున్‌పై ట్వీట్.. నాగబాబు చేసింది కరెక్టేనా? ఐకాన్ స్టార్‌పై భగ్గుమంటున్న జనసేన క్యాడర్!
అయినా వాడు సంపాదించకపోతే మీ అమ్మాయికి పూట గడవడం లేదా, ఆఖరికి తన మాట మేరకు ఆఫీసుకు వెళ్లడం ప్రారంభించాడు అయినా పోలీస్ కేసు పెట్టింది అందుకే వాడి మనసు విరిగిపోయి మొత్తానికే ఆఫీసుకు వెళ్ళనంటున్నాడు అంటూ కళ్యాణ్ ని వెనకేసుకొస్తారు అతని కుటుంబ సభ్యులు. మరోవైపు కావ్య వెళ్తున్న రూట్లో వస్తున్న రాజ్ కి చైల్డ్ కేర్ సెంటర్ వ్యక్తి కనిపించి భయంతో రాజ్ కేమి తెలియకపోయినా అన్ని తెలుసు అనుకొని నన్ను క్షమించండి నేను చెప్పాలనుకోలేదు.
కానీ కావ్య మేడం పోలీసులని తీసుకురావడంతో భయంతో జరిగిందంతా చెప్పేసాను నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్యకి నిజం తెలిసిపోయిందా అనుకుంటాడు రాజ్. మరోవైపు కావ్య అప్పు ఫోన్ చేస్తే దారిలోనే ఉన్నాను అని చెప్తుంది. కావ్యకి ముఠాలోనే ఉన్న స్త్రీ ఎదురుపడి ఏదో అడ్రస్ వెతుకుతున్నట్లు ఉన్నారు అంటుంది. అవును అని అడ్రస్ చెప్తుంది కావ్య.
ఆ అడ్రస్ నాకు తెలుసు నాతో రండి నేను తీసుకు వెళ్తాను అని తనతో పాటు తీసుకు వెళుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఉన్న అనాలిక తల్లి మాట్లాడుతూ మేము ఏమి చేయాలో అది చేస్తాము అంటుంది. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది చిట్టి. పిల్లల్ని కలిపే దానివైతే ఇక్కడ కూర్చో లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్లి పో నువ్వు మాత్రమే ఏమైనా చేయగలవా, మేమేమీ చేయలేమా అంటూ ఆమెపై కేకలు వేస్తుంది.

ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మీరందరూ పోలీస్ స్టేషన్ లో ఉంటారు అని హెచ్చరిస్తుంది. మరోవైపు అప్పు కావ్య ఫోన్ చేసి నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చాను ఇల్లు తాళం వేసి ఉంది అంటుంది. నేను కాస్త ముందుకు వచ్చాను అని లైవ్ లొకేషన్ పెడుతుంది కావ్య. తర్వాత మీరు నన్ను చాలా దూరం తీసుకువచ్చేస్తున్నారు అని పక్కావిడితో అంటుంది కావ్య. లేదమ్మా నువ్వు చెప్పిన అడ్రస్ కే వెళ్తున్నాము లేదంటే ఇంత ఎండలో నీతో రావాల్సిన అవసరం నాకు ఏముంది అంటుంది ఆవిడ.
తరువాయి భాగంలో రాజ్ సెక్యూరిటీ కి ఫోన్ చేస్తాడు, కావ్య మేడం హార్ట్ డిస్క్ తీసుకువెళ్లారు అని చెప్తాడు సెక్యూరిటీ. మరోవైపు కావ్యని కిడ్నాప్ చేయడం అప్పు చూస్తుంది. వ్యాన్ వెనుక పరిగెడుతుంది కానీ వ్యాన్ అందుకోలేక పోతుంది.


Click it and Unblock the Notifications










