Brahmamudi May 17th Episode: కిడ్నాప్ కి గురైన కావ్య.. కళ్యాణ్‌కు కుటుంబ సభ్యుల చివాట్లు!

కంపెనీకి వెళ్లనని తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని మొండికేస్తాడు కళ్యాణ్. సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని మాయని వెతకటానికి బయలుదేరుతుంది కావ్య. కళ్యాణ్ తనకి నచ్చినట్లుగా ఉండటం లేదని పంచాయతీ పెడుతుంది అనామిక. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 17వ తేదీ ఎపిసోడ్ 412 లో ఏం జరిగిందంటే..
పెళ్లికి ముందు ఆ పని చేయమని.. నేను బలవంతం చేశా: రకుల్ ప్రీత్ సింగ్

అడ్రస్ చూపిస్తానంటూ కావ్య ని మారుమూల ప్రదేశానికి తీసుకు వెళుతుంది పెద్దావిడ. చాలా దూరం నడిచాము, అసలు ఆ అడ్రస్ మీకు తెలుసా అంటుంది కావ్య. తెలుసమ్మా అంటుంది పెద్దావిడ. ఇంతలో రౌడీలు వ్యాన్ తీసుకువచ్చి కావ్య ని కిడ్నాప్ చేస్తారు ఆమె దగ్గర ఫోన్ లాక్కొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. కావ్య వాళ్ళతో పెనుగులాడటం, వాళ్ళు బలవంతంగా ఆమెని వ్యాన్ లో కూర్చోబెట్టి తీసుకుపోవటం అప్పు చూస్తుంది. వ్యాన్ వెనుక పరిగెడుతుంది కానీ వాళ్ళని క్యాచ్ చేయలేకపోతోంది.

Brahmamudi serial May 17th Episode of 412 Here is full story

కంగారుపడి రాజ్ కి ఫోన్ చేస్తుంది. కానీ రాజ్ కి అప్పుడే సెక్యూరిటీ ఫోన్ చేసి లాస్ట్ ఫ్రైడే మేడం వచ్చారు. హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారు అని జరిగిందంతా చెప్తాడు ఇంకా తిరిగి ఇవ్వలేదు అందుకే మీకు ఫోన్ చేశాను అంటాడు. అప్పటికే రాజ్ కి అప్పు దగ్గరనుంచి కాల్స్ వస్తూ ఉంటాయి అంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే కావ్యకి అంతా తెలుసు తెలిసే ఇన్నాళ్లు ఏమీ జరగనట్లుగా ఊరుకుంది అనుకుంటాడు.

రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో అప్పు కల్యాణ్ కి ఫోన్ చేస్తుంది. అతను కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి బావకి జరిగింది చెప్పాలి అని బయలుదేరుతుంది. మరోవైపు కళ్యాణ్ ఇంట్లో పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. ఎంతసేపు తనకు నచ్చినట్లుగా నేను ఉండటం లేదు అని చెప్తుంది కానీ నాకు నచ్చినట్లుగా తను మాత్రం ఉంటుందా, తను ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్ర పోయిందే లేదు అంటాడు.నేను కూడా తన వల్ల చాలా సార్లు బాధపడ్డాను.

Brahmamudi serial May 17th Episode of 412 Here is full story

కానీ ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడాలు, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీలు పెట్టడాలు లాంటివి చేయలేదు. ఇంక ఈ కాపురం సజావుగా సాగదు, అందుకే తనకి విడాకులు ఇద్దామనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. అతని నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ కోప్పడతారు. సరి అయిన నిర్ణయం కాదు ఆమెని మార్చుకోవాల్సిన బాధ్యత నీదే అని మందలిస్తారు. అంతలోనే అప్పు అక్కడికి వస్తుంది. ఆమెను చూసి మరింత కోపంతో రగిలిపోతారు అక్కడ వాళ్ళు.

వాళ్ళిద్దర్నీ విడదీసేదాకా నీకు నిద్ర పట్టదా అని ధాన్యలక్ష్మి అప్పుని కోప్పడుతుంది. విషయం అర్థం కాని అప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటుంది. నీవల్లే కళ్యాణ్ కి అనామికకి గొడవలు వస్తున్నాయంట అందుకే అనామిక పంచాయతీ పెట్టింది అని చెప్తుంది స్వప్న. వీళ్ళు అన్నమాటలే నిజం చేద్దాం పద లేచిపోదాం అని కళ్యాణ్ తో అంటుంది అప్పు, అందరూ షాక్ అవుతారు. నువ్వు కూడా ఏంటి అప్పు అంటాడు కళ్యాణ్. లేకపోతే ఏంటిది, మీ గొడవ లేవో మీరు పడండి

Brahmamudi serial May 17th Episode of 412 Here is full story

అయినా కోరి చేసుకున్నావు కదా జీవితాంతం అనుభవించాల్సిందే అంటుంది అప్పు. ఇంకా అనామిక తల్లి తప్పుగా ఏదో మాట్లాడుతూ ఉంటే ఆమె నోరు మూయిస్తుంది అప్పు. రాజ్ బావ ఇంట్లో లేరా నేను ఆయన కోసమే వచ్చాను అంటుంది. రాజ్ ఇంట్లో లేడు అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు. ఆ తర్వాత సీతారామయ్య మాట్లాడుతూ అప్పు కూడా కళ్యాణ్ వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటుంది.

ఇక ఈ విషయం వదిలేయండి అంటాడు. వియ్యంకులతో మాట్లాడుతూ వస్తే వియ్యంకులు గా రండి అంతేగాని గొడవపడతానంటే మాత్రం అసలు రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో వైపు కావ్యని కిడ్నాప్ చేసిన రౌడీలు ఆమెని ఒక గదిలో బంధిస్తారు, అక్కడ చాలామంది ఆడపిల్లలు ఉంటారు.మరోవైపు రాజ్ కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్న అప్పు రాజ్ ఇంటికి రావడంతో జరిగిందంతా చెబుతుంది.

తరువాయి భాగంలో కంగారు పడిన రాజ్ మీరెందుకు అక్కడికి వెళ్లారు అనటంతో మాయా కోసం అంటుంది అప్పు. పోలీసులు కావ్య ని వెతుకుతూ ఉంటారు. వాడి అడ్రస్ ఫలానా దగ్గర టర్న్ తీసుకుంది, వాళ్లది అమ్మాయిలని కిడ్నాప్ చేసే ముఠా, రెండు రోజులలో వాళ్ళని పట్టుకోకపోతే వాళ్లు ఆ అమ్మాయిలని విదేశాలకి అమ్మేస్తారు అని చెప్తాడు పోలీస్. రౌడీలు ఆడపిల్లలందరినీ చేతులు, మూతులు కట్టేసి వ్యాన్లో ఎక్కిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X