Brahmamudi May 4th Episode: అత్తతో నిజం చెప్పించిన స్వప్న.. రాహుల్ కి వార్నింగ్ ఇచ్చిన సేటు!
అప్పుని,కళ్యాణ్ ని విడిపించి ఇంటికి తీసుకు వస్తారు కావ్య దంపతులు. అరెస్టు చేయించినందుకు అనామిక చెంప పగల కొడుతుంది స్వప్న. బాబు తల్లిని పట్టుకునే ప్రయత్నంలో రాజ్ ని ఫాలో అవుతుంది కావ్య. భర్త,అత్త మోసం చేసి డబ్బు కాజేసారని తెలుసుకుంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 4వ తేదీ ఎపిసోడ్ 401 లో ఏం జరిగిందంటే..
ఆనందంతో డ్రింక్ చేస్తున్న రుద్రాణి, రాహుల్ దగ్గరికి వచ్చి వాళ్లతో పాటు డాన్స్ చేస్తుంది స్వప్న. వాళ్ళని మాటల్లో పెట్టి మందులో మత్తుమందు కలిపి వాళ్ల చేత ఓవర్గా తాగిస్తుంది. మత్తులో ఉన్న రుద్రాణి వాళ్ళతో కోటి రూపాయల అప్పు గురించి ఎంక్వయిరీ చేస్తుంది. రుద్రాణి స్వప్న సంతకం తీసుకున్న సంగతి చెప్పేస్తుంది. అలాగే డబ్బు తన కబోర్డ్ లోనే ఉందని, కబోర్డు తాళాలు నా పాకెట్ లోనే ఉన్నాయి అని ఆనందంగా చెప్తుంది. స్వప్న తెలివిగా ఆ తాళాలు చేజిక్కించుకుంటుంది.

కాజల్ అగర్వాల్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?.. ఆ క్రికెటర్ అంటే అలాంటి పిచ్చి అంటున్న సత్యభామ
మరోవైపు రాజ్ వాళ్ళ ఇంటికి వచ్చిన సేటు సీతారామయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా రాహుల్, రుద్రాణి. ఏం జరిగింది నీ అప్పు నీకు తీర్చేస్తామని చెప్పాం కదా లే అని అతని దగ్గరికి వస్తాడు రాహుల్. ముందు ఆ పుణ్యాత్మురాలిని పిలువు అంటాడు సేటు. ఎవరా పుణ్యాత్మురాలు అంటాడు రాహుల్. ఇంకెవరు నీ భార్య స్వప్న, అమ్మవారి పరమ భక్తురాలు అంటాడు సేటు.

ఆవిడ భక్తురాలు ఏమిటి అంటుంది రుద్రాణి. నేను కాకపోతే మీరు భక్తురాలా అని అత్తగారిని అడుగుతుంది స్వప్న. నేను రోజు పూజలు చేయను గాని అమ్మవారి నామాన్ని జపిస్తూనే ఉంటాను అంటుంది. నాకు తెలుసమ్మా బుద్ధి గడ్డి తిని నీ ఆస్తి పేపర్లు నేను తీసుకున్నాను ఇదిగో నీ పేపర్లు దయచేసి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు సేటు. నిన్న అప్పు తీసుకున్నాను అన్నారు, ఈరోజు పేపర్స్ తెచ్చి నా చేతిలో పెడుతున్నారు అలా చేస్తే నా మీద పడిన నిండా ఎలా పోతుంది.
అసలు నా ఇంట్లో ఉండవలసిన పేపర్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి, దానిమీద నా సొంతంగా ఎలా వచ్చింది అని నిలదీస్తుంది స్వప్న. సేటు నిజం చెప్పేస్తాడేమో అని భయపడతారు అని భయపడతారు రాహుల్, రుద్రాణి. కొంతమంది దొంగ వెధవలు ఆస్తి పత్రాలు కొట్టేసి నా దగ్గర డబ్బు పట్టుకెళ్తూ ఉంటారు అంటాడు సేటు. ఇంతకీ ఆ ఇంటి దొంగ ఎవరు అంటాడు ప్రకాష్. పోలీసులకి అప్పజెప్తే వీడిచేత వాళ్లే నిజం చెప్పిస్తారు అంటూ సేటుని లాక్కొని బయటకు వెళ్తాడు రాహుల్.

ప్లాన్ అంతా రివర్స్ చేసావ్ ఏంటి అంటూ సేటుపై మండి పడతాడు. అదంతా పక్కన పెట్టు నా అప్పు నాకు తిరిగి ఇచ్చేయ్ రెండు రోజుల్లో డబ్బు నాకు ఇవ్వకపోతే నేనే ఇంట్లో నిజం చెప్పేస్తాను అని రాహుల్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సేటు. మరోవైపు అప్పు పంపించిన లొకేషన్ కి వస్తుంది కావ్య. అప్పుడే అప్పు కూడా పోలీసులతో అక్కడికి వస్తుంది. పోలీసులకి చెప్పొద్దని చెప్పాను కదా అంటుంది కావ్య వాళ్ళు పోలీసులు కాదు జూనియర్ ఆర్టిస్టులు.
లోపల ఉన్న వాడిని బెదిరించాలంటే ఏమాత్రం ఉండాలి అంటుంది. తర్వాత లోపలికి వెళ్లి రాజ్ తో మాట్లాడిన వ్యక్తితో మాట్లాడి బాబు గురించి నిజం చెప్పమంటుంది. పోలీసులను చూసి భయపడిన ఆ వ్యక్తి మాయ అనే ఒక ఆవిడ వాళ్ళ బాబుని రోజు రెండు గంటలు ఇక్కడ ఉంచుతుంది. ఆరోజు రాజ్ సార్ ఇక్కడికి వచ్చి ఆమెతో ఏదో మాట్లాడారు, నాకు అనుమానం వచ్చి వారు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










