Priyanka Jain: తిరుపతి దారిలో ప్రియాంక జైన్, శివ్‌లపై చిరుత దాడి.. అలా తప్పించుకున్న లవర్స్!
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుమ్మ ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈమె తన ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి తిరుపతికి వెళ్లింది. తిరుమల మెట్లపై నడకదారిన వెళ్లింది. కానీ మధ్యలో వీరికి చిరుత కనిపించగా.. తీవ్రంగా వణికిపోయారు. వీరిని చూసిన చిరుత వీరిపైకి రాగా... అలా తప్పించుకున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జైన్. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లి తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి ఎక్కువగా ఉంటూ గ్రూప్ గేమ్ ఆడుతూ.. టాప్ 5లో నిలిచింది. అయితే అప్పటి వరకు ఆమె ప్రేమ గురించి బయట చెప్పని ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ప్రియుడితో డేటింగ్ గురించి వివరించింది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆయన ఇంట్లోకి రాగా అందరికీ వీరిద్దరి గురించి పూర్తిగా తెలిసిపోయింది.

ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ప్రియాంక జైన్.. తన ప్రియుడితో కలిసి ఫుల్ గా చిల్ అవుతుంది. కేవలం యూట్యూబ్ లో వీడియోలు మాత్రమే చేసుకంటూ కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న ఈమె.. ప్రియుడితో ఇటీవలే గోవా వెళ్లింది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తిరుమలకు కూడా వెళ్లింది. అయితే ప్రియుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను కూడా వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ రెండు జంటలు నడక దారిని.. ముఖ్యంగా మెట్లపై వెళ్లారు. అలా వెళ్లిన జర్నీని వీడియోగా మలిచి ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టింది.
అయితే వీరు మెట్లు ఎక్కుతున్న క్రమంలోనే ప్రియాంక జైన్, శివ్ కుమార్ లకు మార్గ మధ్యంలో చీత కనిపించింది. చీకట్లో చీతను చూసిన ఈ జంట విపరీతంగా భయపడిపోయి.. కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ముఖ్యంగా తన స్నేహితులు కూడా ఇది చూసి ముందుకు పరిగెత్తడం ప్రారంభించారు. ఒకరినొకరు గట్టిగా పట్టేసుకుంటూ చీత బారి నుంచి తప్పించుకోలేమో అంటూ వణికిపోయారు. ముఖ్యంగా ప్రియాంక జైన్, శివ్ లతో పాటు వచ్చిన మరో జంట అయితే ప్రాణాలు పోయినట్లుగానే ఫీల్ అయ్యారు.
Vijay Devarakonda: ఆ ఈవెంట్‌కు లుంగీలో విజయ్ దేవరకొండ.. ఆ మూడే ముఖ్యమంటూ!
అయితే ఇదంతా చూసిన ప్రియాంక జైన్, శివ్ కుమార్ లు చివరకు ఇదంతా ప్రాంక్ అని చెప్పారు. తమ స్నేహితులను భయపెట్టాలని ఇలా చేసినట్లు వివరించారు. వీళ్లు కూడా భయపడ్డట్లు నటించి మరో జంటను వణికించారు. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చివరలో.. అందంగా ముస్తాబైన వీళ్లు ఆ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.


Click it and Unblock the Notifications











