Rashmi Gautam రష్మి గౌతమ్‌పై వల్గర్ కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్ .. ప్రియుడిని వదిలేసిన ప..* అంటూ!
యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ఓ వైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తుంది. సుదీర్ఘకాలం పాటు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది. మరోవైపు అడపా దడపా సినిమాల్లోనూ మెరుస్తుంది. ఇదిలా ఉంటే.. అందరి ముందు రష్మిని ఓ స్టార్ కమెడియన్ బూతులు తిట్టాడు. స్టేజీ మీదే.. ప్రియుడిని వదిలేసిన ప... అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతనిపై విరుచుకుపడుతున్నారు. అసలు రష్మిని అంత బూతు అనాల్సిన అవసరం ఏం వచ్చింది.. అది ఎవరు అన్నారు.. ఎందుకు అనాల్సి వచ్చిందనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతో మంది కమెడియన్స్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. అనసూయ చాలా కాలం పాటు యాంకరింగ్ చేసి.. గుడ్ బై చెప్పేసి సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇక సుధీర్, గెటప్ శ్రీను, ధన్ రాజ్ వంటి వారు సినిమాలతో బిజీగా మారిపోయారు. వేణు లాంటి వాళ్లైతే.. ఏకంగా సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్ గా మారిపోయాడు.

ఒకప్పుడు జబర్దస్త్ షో అంటే ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉండేది. ఇప్పుడు ఒంటరిగా చూసేలా కూడా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ జబర్దస్త్ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో యాంకర్ రష్మిపై కమెడియన్ వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్స్. ఆ కమెడియన్ మీద విరుచుకుపడుతున్నారు. కామెడీలో ఇలా రష్మిపై కామెంట్స్ చేయడం సరికాదని అంటున్నారు.
Varun Tej : రామ్ చరణ్ - పవన్ కల్యాణ్ కలిసి నన్ను చాలా బాధపెట్టారు - ఒంటరోడిని చేశారు!
అసలేం జరగిందంటే.. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి తెలిసిందే. వర్షతో కలిసి వీరు స్కీట్స్ చేస్తుంటారు. ఇక ఆనాటి ప్రేమకథ ప్రేయసి రావే చిత్రం స్పూఫ్ చేశారు. ఇక వర్ష రాశిగా నటించగా.. ఇమ్మాన్యుయేల్ శ్రీకాంత్ లా చేశాడు. అందులో భాగంగానే రష్మిపై వల్గర్ కామెంట్స్ చేశారు. ప్రియుడు వదిలేసిన రష్మి పత్తిత్తా అంటూ బూతును వాడాడు. దానికి రష్మి.. నవ్వలేక.. తిట్టలేక రియాక్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇక రష్మిపై అలాంటి కామెంట్ చేయడంతో.. ఆమె ఫ్యాన్స్.. రష్మి నీకు ఈ బూతు షోలు అవసరమా అంటూ కామెంట్ చే్స్తున్నాయి. అయినా నువ్వేందుకు వాటిని భరిస్తున్నావని అంటున్నారు. ఇక రష్మి.. జబర్దస్త్ షోతో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ, స్పెషల్ ఈవెంట్లలో చేస్తుంది. వాటితో పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











