అషు రెడ్డిపై సర్వ హక్కులు నావే.. జబర్దస్త్ కమెడియన్ నోటి దురుసు

ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫీచర్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న ఫాలోవర్స్‌కి వీరంతా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్, బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు ఈ సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ చేస్తున్నారు. తెలుగులో దీనిని యాంకర్ విష్ణుప్రియ దీనికి శ్రీకారం చుట్టగా.. ఆమె క్రేజ్.. ఆదాయం చూసి అనన్య నాగళ్ల, పాయల్ రాజ్‌పుత్, అషురెడ్డి తదితర ముద్దుగుమ్మలు కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లోకి దిగారు.

Also Read
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్
నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

సినిమాల్లో అవకాశాలు లేనివారికి ఈ సదుపాయం ఆదాయాన్ని అందిస్తుండగా.. మరికొందరికి అదనపు ఆదాయంగా మారుతోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో అసభ్యకరమైన ఫోటోలు, అశ్లీల వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీనిపై సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. దీని వల్ల యువత తప్పుడు మార్గం వైపు వెళ్తున్నారని.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. కొందరు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి కూడా. అయినప్పటికీ ఈ ట్రెండ్ నానాటికీ విస్తరిస్తోంది.

Family Stars Season 2 Promo Jabardasth Nukaraju Trolls Ashu Reddy s Instagram Subscription

అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ పెట్టిన వారిపై తోటి సహచరులే సెటైర్లు, విమర్శలు వేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డిపై పంచ్‌ల వర్షం కురిపించాడు జబర్దస్త్ ఫేమ్ నూకరాజు. ఈటీవీలో గతంలో ప్రసారమైన సూపర్‌ హిట్ షోలలో ఫ్యామిలీ స్టార్స్ కూడా ఒకటి. దీనికి కొనసాగింపుగా ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ ఇటీవల విడుదల చేసింది. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా.. స్రవంతి చొక్కారపు, అషురెడ్డిలు మెంటార్లుగా ఈ షో త్వరలో ప్రసారం కానుంది. లాంచింగ్ ఎపిసోడ్‌లో హీరోయిన్ సీరత్ కపూర్, సీనియర్ నటి సుధ, బుల్లితెర ముద్దుగుమ్మలు హిమజ, రీతూ చౌదరి, తేజస్విని, హరితేజ తదితరులు సందడి చేయనున్నారు. జూలై 26 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 ప్రసారమవుతుందని ఈటీవీ ఈ ప్రోమో ద్వారా తెలియజేసింది.

Recommended For You
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

అయితే ఈ ప్రోమోలో అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పంచ్‌లు విసిరాడు. ఏమో అషూ అని నూకరాజు పిలవగా.. నన్ను ఏమే అంటావా అంటూ ఆమె షాక్ అయ్యింది. మేడంని ఏమైనా అనే అధికారం నాకే ఉందని నూకరాజు చెప్పగా.. అంతలా రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయని సుధీర్ ప్రశ్నిస్తాడు. 399 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా అని నూకరాజు చెప్పడంతో అషురెడ్డికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాక తన చేతులతో ముఖాన్ని కవర్ చేసుకుంది. మిగతా వాళ్లు అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు. చివరిలో ఓ బౌల్ పెట్టి ఇందులో ఓ బాంబు ఉంది.. మీరేం భయపడొద్దు, ఈ బాంబు ముందు ఈ బాంబు నథింగ్ అని సీరత్ కపూర్‌ను చూస్తూ చెబుతాడు సుధీర్.

You May Also Like
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!

అయితే యాంకర్ స్రవంతి ఆ బౌల్‌ను ముట్టుకోబోతుండగా అది సడెన్‌గా పేలడంతో అంతా పారిపోతారు. సుధీర్ కూడా చెవులు పట్టుకుని ఓ మూలన నిలబడతాడు. ఆ తర్వాత నిఖిల్ మలియాక్కల్, అంబటి అర్జున్‌లను సుధీర్ స్టేజ్ మీదకి పిలవగా ఇద్దరూ భయంతో వణికిపోతారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా స్రవంతి, అషు రెడ్డి, సుధీర్ తదితరుల అల్లరి చూడాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more about: jabardasth nukaraju ashu reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X