Gunde Ninda Gudi Gantalu June 23rd : ప్రభావతికి కడుపు మంట.. బాలును గోస పెడుతున్న కన్న తల్లి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 20వ తేదీ 449వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా కోసం బాలు పూలు, స్వీట్లు తీసుకొని వస్తాడు. కానీ రాత్రంతా ఇంట్లో వాళ్లందరూ హాలులోనే అటూ ఇటూ తిరుగుతూ వారికి నిద్ర లేకుండా చేస్తారు. ముఖ్యంగా బాలు, మీనాను ఏకాంతంగా, ప్రైవేట్ గా మాట్లాడుకోకుండా చేస్తారు. ముందుగా ప్రభావతి కిందికి వస్తూ విజిల్ వేస్తుంది. దాంతో అప్పటికే మీనా జడలో పూలు పెట్టాలని అనుకున్న బాలు ఆ పూలు పక్కన పెట్టేసి పడుకున్నట్టుగా నటిస్తాడు. ఇక ప్రభావతి వచ్చి మీనాపై అనవసరంగా అరుస్తుంది. నీ పూల కొట్టు వల్ల ఇంట్లో పనులేవీ సరిగా చూసుకోవడం లేదని మండిపడుతుంది. ఇక మీ మామయ్యకు పాలు తీసుకు వెళ్లాలని వచ్చాను త్వరగా వేడి చేసి ఇవ్వు అని అంటుంది.
దాంతో బాలు ప్రభావతిపై మండిపడుతాడు. ఎప్పుడూ తన భార్యనే ఎందుకు పనిచేయాలని ప్రభావతిని ప్రశ్నిస్తాడు. ఈ పనులన్నీ ఇంట్లో ఉన్న మిగితా ఇద్దరు కొడళ్లకు చెప్పుకొచ్చు కదా అని గట్టిగా నిలదీస్తాడు. దాంతో ప్రభావతి వాళ్లు మొదటి నుంచి ఉద్యోగాలు ఉన్న కుటుంబంలో జన్మించారు. ఈ వంట చేయడాలు, అంట్లు తోమడాలు వారికి రాదని, మీనాకైతే మొదటి నుంచి అదే పని కదా అని చులకనగా మాట్లాడుతుంది. మీనా పాలు తీసుకురాగానే పైనున్న గదిలోకి వెళ్తుంది. ఇక ఆ తర్వాత బాలు మీనాకు హల్వా తినిపిద్దామని బాక్స్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే శృతి కిందికి వస్తుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టానని వచ్చి తినేసి వెళ్తుంది. శృతితో పాటు ప్రభావతి కూడా కడుపునిండా అర్ధరాత్రి బిర్యానీ తింటుంది. ఇక అది అరగక రాత్రంతా నానా అవస్థలు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 23వ తేదీ 450 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

ప్రభావతి పట్టకున్న కూడా అర్ధరాత్రి బిర్యానీ తిని అరగక అవస్థలు పడుతుంది. ఇక రాత్రంతా నిద్రపోకుండా ఇంట్లో మొత్తం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. పట్టకున్న కూడా బిర్యానీ ఎందుకు తిన్నావని సత్యం ప్రభావతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే గదిలో నుంచి బయటికి వస్తుంది. కిందికి వెళ్లి కాస్తా అటూ ఇటూ తిరుగుదామని అనుకుంటుంది. అంత కంటే ముందే రోహిణి - మనోజ్ ల గది దగ్గరకు వెళ్తుంది. అప్పటికే వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దీంతో ప్రభావతి వెళ్లి డోర్ తడుతుంది. దీంతో మనోజ్ చిరాకు పడుతూ డోర్ చేసి ఏంటమ్మా అర్ధరాత్రి నిద్ర చెడగొడుతున్నావని అంటాడు. దాంతో ప్రభావతి తిన్నది అరగక అని బదులిస్తుంది. అయితే ఇప్పుడేం చేయాలని మనోజ్ అంటాడు. ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వరా అని అడుగుతుంది. మా దగ్గర ఎలాంటి టాబ్లెట్స్ లేవని చెప్పి తలుపు మూసేస్తాడు.
ఇక కిందికి వెళ్లి హాలులో కాస్తా వాకింగ్ చేద్దామని వెళ్తుంది. ఇక నిద్ర చెడిపోవడంతో బాలు, మీనా ఒకరికొకరు దగ్గరిగా పడుకొని కళ్లలోకి చూస్తూ మాట్లాడుకుంటారు. మళ్లీ ప్రభావతి విజిల్ సౌండ్ వేయడంతో ఉలిక్కి పడి లేస్తారు. ఈ రాత్రంతా ఇక మనల్ని పడుకోనివ్వరని బాలు అప్సెట్ అవుతారు. ఇక ప్రభావతి కిందికి వచ్చి వాళ్లతో ఏమీ మాట్లాడకుండా అవస్థ పడుతూ తిరుగుతూ ఉంటుంది. దీంతో ఏమైందని అడిగిన మీనాపై చిరాకు పడుతుంది. తిన్నది అరగక అజీర్తితో బాధపడుతుందని తెలుసుకున్న మీనా జిలకర్ర నీళ్లు ఇస్తుంది. అయినా ప్రభావతికి ఛాతిలో నొప్పి తగ్గదు. గ్యాస్ వల్ల ఆ సమస్య వచ్చిందని గుర్తిస్తారు. ఇక కుటుంబం మొత్తం హాలులోనే చేరిపోతుంది.
ప్రభావతికి నొప్పి వస్తుందని తెలిసిన ఆమె వదిన కామాక్షి కూడా ఇంటికి వస్తుంది. ఇక ప్రభావతి కూర్చిపై కూర్చొని నొప్పి నొప్పి అంటూ అవస్థలు పడుతుంది. దాంతో వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్దామని మీనా అంటుంది. కానీ ఆస్పత్రికి వెళ్తే అనవసరంగా 25 వేలు ఖర్చు అవుతుందని బాలు వద్దని అంటాడు. ఇప్పుడా బిల్లు కట్టే వారెవరూ లేరని చెబుతాడు. మరోవైపు కామాక్షి ప్రభావతి వీపులో పిడిగుద్దులు గుద్దుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇలా సడెన్ గా వీపులో గుద్దితే గ్యాస్ వెళ్లిపోతుందని చెబుతుంది. అలాగైతే ఇంకా గుద్దమని బాలు అంటాడు. దాంతో ప్రభావతి వాళ్లిద్దరిపై మండిపడుతుంది. ఇక శృతి కూడా ప్రభావతిని వీలుపులో గుద్ది గ్యాస్ పోయేలా చేస్తానని అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక బాలు తన దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పి కిచెన్ లోకి వెళ్లి రోకలి తీసుకొని సడెన్ ప్రభావతిని కొట్టేందుకు ఉరికొస్తాడు. దాంతో ప్రభావతి వెంటనే లేచి పరిగెత్తుతుంది. ఈ క్రమంలో గ్యాస్ రివీల్ అయ్యి నొప్పి పోతుంది. సమస్య నుంచి ప్రభావతి గట్టెక్కుతుంది.
Karthika Deepam 2 June 23rd : పట్టుకోల్పోతున్న జ్యోత్స్న.. పెత్తనం మొత్తం ఇక కార్తీక్ బాబుకే
ఇక శృతి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ గురించి మాట్లాడటానికి వాళ్ల అమ్మ ప్రభావతి ఇంటికి వస్తుంది. ఆమె రాగానే ఇంట్లో ఏసీ గదిలో కూర్చొబెట్టి మాట్లాడుతుంది. శృతి వాళ్ల అమ్మ బాలును ఫంక్షన్ కు రానివ్వొద్దని చెబుతుంది. గతంలోనే శృతి వాళ్ల నాన్న రిటైర్ మెంట్ ఫంక్షన్ లో నానా రచ్చ చేశాడని, ఇప్పుడు చేసే ఫంక్షన్ ను గొప్పింటి వారు, పెద్ద స్థాయి ఉన్న వారు వస్తారని బాలు మళ్లీ గొడవ చేస్తే బాగుందని చెబుతుంది. అందుకు బాలును రాకుండా నువ్వే చూసుకోవాలని అంటుంది. దాంతో ప్రభావతి కూడా వాడంటే నాకు నచ్చదు. ఆ విషయం నేను చూసుకుంటానని చెబుతుంది. ఇక ఇదే విషయాన్ని భర్త సత్యంతో చెబుతుంది. శృతి వాళ్ల అమ్మ వచ్చి వెళ్లింది. ఫంక్షన్ కు బాలును రావొద్దని చెప్పిందని, మళ్లీ గొడవ పడతాడని భయపడుతున్నదని చెబుతుంది. ఆ రోజు బాలు నన్ను అవమానించినందుకే గొడవ పడ్డాడని మర్చిపోయావా? అని ప్రభావతిని సత్యం ప్రశ్నిస్తాడు. ఇక బాలు వస్తేనే మేమంతా వస్తామని సత్యం తన నిర్ణయం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











