Gundeninda Gudigantalu November 22th Episode: బాలు మాస్టర్ ప్లాన్.. గుడిలో మనోజ్ టార్గెట్.. ప్రభావతి షాక్

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: బాలు, రాజేష్ లు కలిసి ఫర్నిచర్‌ షాప్‌కి వెళ్తారు. అక్కడ ప్రతి వస్తువుపై 50% ఆఫర్‌ చూసి ఆశ్చర్యపోతారు. ఆ ఆఫర్‌తో రాజేష్‌ ఒక బీరువాను కొనేస్తాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని, "ఇది మొత్తం దొంగ మాల్... ఇతర షాపుల నుంచి దొంగిలించిన వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరూ కదలకుండా ఉండండి" అంటూ హెచ్చరిస్తారు. ఏ తప్పూ చేయలేదని చెప్పినా, పోలీసులు నమ్మక బాలు-రాజేష్‌లను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. లాకప్‌లో పెట్టడంతో తీవ్ర కోపానికి గురైన బాలు దొంగలను కొడతాడు. రాజేష్ అతన్ని ఆపుతూ "ఇంక్వయిరీ జరగనివ్వు... నిజం బయటపడితే పోలీసులు మనల్ని విడిచిపెడతారు" అని చెప్పి శాంతింపజేస్తాడు. ఇంతలో పోలీసులు ఫర్నిచర్‌ షాప్‌ యజమానులను విచారిస్తుండగా మనోజ్ కూడా స్టేషన్‌కు చేరుకుంటాడు.

ఇది చూసి బాలు షాక్ అవుతాడు. కానీ మాట్లాడే తీరు చూసి మనోజ్ కూడా ఈ దొంగల చేతిలో మోసపోయాడని అర్థం చేసుకుంటాడు. మనోజ్ తన అమ్మిన ఫర్నిచర్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తాడు. ఏ వస్తువులు పోయాయో అడిగిన పోలీసులకు అన్నీ వివరంగా చెబుతాడు. ఈ మొత్తం విషయాన్ని బాలు సెల్‌లో కూర్చొని తన ఫోన్‌లో రికార్డ్‌ చేసేస్తాడు. విచారణ పూర్తయిన తర్వాత బాలు-రాజేష్‌లను పోలీసులు విడుదల చేస్తారు. ఇంటికి వచ్చిన బాలు డోర్‌ లాక్‌ చేస్తాడు. "ఏంట్రా మధ్యాహ్నం గేట్లు వేస్తున్నావ్?" అని సత్యం అడగగా, "కొత్త సినిమా ట్రైలర్‌ వచ్చింది... అందరితో కలిసి చూడాలి" అన్నట్టు నటిస్తాడు. మనోజ్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ బాలు, "అన్నయ్య మీరు లేకుండా ఎలా ట్రైలర్‌ చూపిస్తాను?" అని అడ్డుకుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 560 November 22th 2025 here is full story

ఇంతలో మీనా, "మీరు ఫర్నిచర్‌ షాప్‌కి వెళ్లారు కదా... మరి ఈ ట్రైలర్‌ ఏంటి?" అని ప్రశ్నిస్తుంది. బాలు అసలు విషయాన్ని బయట పెట్టడం ప్రారంభిస్తాడు.ఇంతలో బాలు మనోజ్ పోలీస్‌ స్టేషన్‌లో చెప్పిన వీడియోను అందరికీ చూపిస్తాడు. దీంతో ఆగ్రహనికి లోనైనా..సత్యం మనోజ్‌కు చెంపదెబ్బ కొట్టి మందలిస్తాడు. ప్రభావతి అసలు మోసం బయటపడకుండా కవర్‌ చేస్తూ "నాలుగు లక్షలు అప్పు చేసావా?" అంటూ క్లూ ఇస్తుంది. దీంతో మనోజ్ "ఫ్రెండ్‌ దగ్గర అప్పు చేశా" అని అబద్ధం చెబుతాడు. రోహిణి మనోజ్‌కు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సత్యం, "ఇంట్లో అబద్ధం చెప్పడం తప్పా?" అంటూ ఆమెను నిలదీయడంతో రోహిణి సిగ్గుతో గదిలోకి వెళ్లిపోతుంది. ప్రభావతి ఈ డ్రామాతో తాత్కాలికంగా నకిలీ నగల విషయం బయట పడకుండా కాపాడుతుంది. కానీ, బాలు మాత్రం.. ఎలాగైనా అసలు నిజం బయట పెట్టాలని ఫిక్స్ అవుతాడు.

'ఆ తేడా ఎందుకు? హీరోల్లాగా మాకు ప్రాధాన్యత ఇవ్వరా?'
ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో.. కార్తీక మాసం కావడంతో ప్రభావతి కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వెళ్లారు. ఇంట్లో జరుగుతున్న డ్రామాను బయట పెట్టాలని నిర్ణయించిన బాలు, ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తాడు. వరుస వేసిన ప్లాన్ విఫలం అయినందున, ఎలాగైనా మనోజ్ నోటి ద్వారానే నిజం బయటకు రప్పించాలి అనేది బాలువి ఆలోచన. గుడిలో ఒకరితో ఒకరు కలిసినప్పుడు, బాలు తనకు పరిచయమైన ఓ వ్యక్తిని గుర్తిస్తాడు. వెంటనే అతన్ని పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించి, "ఒక చిన్న నాటకం ఆడాలి... మనోజ్ నిజం బయటకు రావాలి" అని చెబుతాడు. ఆ వ్యక్తి కూడా బాలుకు సహాయం చేయడానికి రెడీ అవుతాడు.

ఇలా బాలు ప్లాన్ ప్రకారం.. ఆ వ్యక్తి పోతురాజు మేకప్‌లో, చేతిలో వేపకమ్మలతో, కొరడాతో పరుగెత్తుకుంటూ మనోజ్ వైపు వస్తాడు. "ఆగురా... నువ్వు గుడికి ఎందుకు వచ్చావురా? ఇంకా ఎంతోమందిని మోసం చేస్తావురా?" అంటూ గట్టిగా అరుస్తూ మనోజ్‌ను కొరడాతో చితకబాదుతాడు. ఇది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఏం జరుగుతుందో అసలు అర్థం కాక అవాక్కవుతారు. ప్రభావతి, రోహిణి, సత్యం అందరూ కంగరూ పడుతారు. పోతురాజు లుక్‌లో వచ్చిన ఆ వ్యక్తి "నీ పాపాలన్నీ నాకు తెలుసు... కన్నవారిని మోసం చేశావు... కట్టుకున్న దానికీ మోసం చేశావు... ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావో నాకు స్పష్టంగా తెలుసు" అంటూ మనోజ్‌ను దడదడలాడిస్తాడు.

దీంతో బాలు " స్వామి.. మనోజ్ గురించీ మీకంతా తెలుసా? ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో చెప్పండి" అని ప్రశ్నిస్తాడు. కానీ, ఆ వ్యక్తి, "నువ్వే చెప్పాలి... లేక నేను అన్నీ బయట పెడతానా?" అంటూ మనోజ్‌ను మరింత బెదిరిస్తూ కొడతాడు. అడపాదడపా తగిలిన దెబ్బలకు భయపడి, ఎవరూ రక్షించకపోవడంతో, మనోజ్ చివరికి మానసికంగా కుంగిపోతాడు. "చెప్పేస్తాను... నిజం చెప్తాను... దయచేసి ఆపండి" అని ఆర్తనాదం చేస్తాడు. ఎక్కడ మనోజ్ నోరు జారిపోతాడేమో అన్న భయం ప్రభావతిని పట్టిపీడిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, తానెక్కడ బైటపడుతానోనని ఆందోళన చెందుతుంది. ఇంతకీ మనోజ్ నిజంగానే అన్ని ఒప్పుకుంటాడా? ప్రభావతి తన తప్పుల్ని ఒప్పుకుంటుందా? బాలు వేసిన ఈ డ్రామా సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X