Gunde Ninda Gudi Gantalu Weekly:ప్రభావతికి శిక్ష.. మీనా వార్నింగ్.. రోహిణి ప్లాన్ ఫెయిల్.. మౌనిక గర్భవతి..
photo courtesy: jio hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (ఫిబ్రవరి 23) ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. బొమ్మల కొలువు ఏర్పాట్లలో బిజీగా ఉన్న మీనాకు ప్రభావతి అడ్డు పడే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో బాలు వచ్చి ఇంకా బొమ్మలు కావాలన్న మీనా మాటకు మద్దతుగా నిలుస్తాడు. డాన్స్ స్కూల్‌లో ప్రభావతి శిష్యుల ప్రవర్తనపై మీనా ప్రశ్నించగా, ప్రభావతి మాత్రం వారికే సపోర్ట్ చేస్తుంది. మనోజ్ కూడా తల్లి వైపు నిలబడి మీనాను తక్కువగా మాట్లాడడంతో బాలు మండిపడి... ఎవరి పనిని వాళ్లే గౌరవించాలని గట్టిగా హెచ్చరిస్తాడు. సత్యం కలగజేసుకుని అసలు విషయం తెలుసుకుని మీనాకు మద్దతుగా నిలబడి ప్రభావతిని హెచ్చరిస్తాడు. కోపంతో డాన్స్ స్కూల్‌కు వెళ్లిన ప్రభావతి అక్కడ మీనాక్షి హెచ్చరికలతో ఆలోచనలో పడుతుంది. ముందుజాగ్రత్తగా ప్రేమ జంటను దూరంగా ఉండమని ఆదేశిస్తుంది.

photo courtesy: jio hotstar
మరోవైపు మీనా-బాలు వృద్ధ దంపతులను కలిసి వారికి భోజనం అందిస్తారు. దేవుడే పంపించాడంటూ ఆ ముసలి దంపతులు ఎమోషనల్ అవ్వగా, మీనాకు మట్టి బొమ్మను బహుమతిగా ఇస్తారు. ఇక మనోజ్ ట్రాక్ పూర్తిగా థ్రిల్లర్‌గా మారుతుంది. లాటరీ డ్రామాతో వచ్చిన కస్టమర్, ఫకీర్ వేషంలో వచ్చిన వ్యక్తి ఇచ్చిన చిట్టీ... చివరకు స్వామీజీ వేషంలో ఉన్న దినేష్ మాయ మాటలతో మనోజ్ పూర్తిగా నమ్మేస్తాడు. మరో లేఖలో ప్రభావతికి గుండెపోటు, మనోజ్ ఆత్మహత్య అంటూ రాయడంతో ఈ పని చేసింది బాలు అని ఫిక్స్ అవుతాడు. ఇంటికి వచ్చి బాలు మీద ఆరోపణలు చేయగా మీనా, సత్యం అతడిని సమర్థిస్తారు. కానీ ప్రభావతి ఇదే అదునుగా బాలు-మీనా ఇంట్లో ఉండకూడదని ఆదేశిస్తుంది. మీనా గట్టిగా ఎదురు నిలవడంతో ఇంట్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది.
మంగళవారం (ఫిబ్రవరి 24) ఎపిసోడ్ మొత్తం హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనకు వస్తున్న బెదిరింపు లెటర్ల వెనుక బాలు ఉన్నాడంటూ మనోజ్ ఇంట్లో అందరి ముందే ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. మీనా మాత్రం ధైర్యంగా స్పందిస్తూ... బాలు అలాంటి వ్యక్తి కాదని, ఆధారాలు లేకుండా నిందలు వేయడం సరికాదని గట్టిగా వాదించింది. అయినా వినిపించుకోని మనోజ్ బాడీగార్డ్‌ను పిలిపించగా, బాలు ఒక్క గుద్దుతో అతడిని నేలకూల్చి తన పవర్ చూపించాడు. దీంతో మనోజ్ అవమానంతో బాడీగార్డ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు.ఆ తర్వాత బాలు అసలు లెటర్లు ఎవరు ఇచ్చారో ప్రశ్నించగా... ఫకీర్ వేషంలో ఓ వ్యక్తి ఇచ్చినట్టు మనోజ్ ఒప్పుకున్నాడు. పోలీస్ కేసు పెట్టాలన్న సత్యం, శృతి మాటలను రోహిణి అడ్డుకోవడంతో బాలు ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు.
"ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టను" అంటూ బాలు ఛాలెంజ్ విసరడంతో రోహిణి భయపడిపోయింది. వెంటనే దివ్యతో కలిసి బాలు ఫోన్‌లో ఉన్న శివ వీడియోను డిలీట్ చేయాలన్న ప్లాన్ వేసింది. కానీ దివ్య ప్రయత్నం విఫలమవడంతో రోహిణి మరింత కంగారుపడింది. ఇదిలా ఉండగా బాలు గుడికి వెళ్లి లెటర్లు ఇచ్చిన వ్యక్తి వివరాలు సేకరించి దర్యాప్తు వేగం పెంచాడు. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మీనా-మనోజ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా, బాలు నాలుగు రోజుల్లో అసలు నిజం బయటపెడతానని ప్రకటించాడు. మరోవైపు నీతూ లిఫ్ట్ డ్రామాతో శృతి-రవి మధ్య టెన్షన్ మొదలైంది. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో బాలు దర్యాప్తు, రోహిణి భయం, మీనా ఆగ్రహంతో కథ కీలక మలుపు తిరిగింది.
బుధవారం (ఫిబ్రవరి 25) ఎపిసోడ్ లో రవి-శృతి బైక్‌పై వెళ్తుండగా మధ్యలో నీతూ ఎక్కడం, ట్రాఫిక్ పోలీసులు ట్రిపుల్ రైడింగ్ అంటూ క్లాస్ పీకడం హైలైట్ అయ్యింది. చివరకు ఫైన్ కూడా శృతినే కట్టాల్సి రావడంతో రవిపై ఆమె చిరాకు చూపించింది. ఇంటివద్ద ప్రభావతి కాళ్ల నొప్పుల పేరుతో మీనాను ఆటపట్టించగా.. బాలు తన పంచ్ డైలాగ్‌లతో ఆమెను గట్టిగా ఆటాడుకున్నాడు. ఇక సత్యం సంతాన హోమం ప్రస్తావన తీసుకురావడంతో ఇంట్లో మరోసారి గొడవలు మొదలయ్యాయి. ప్రభావతి ముందుగా మనోజ్-రోహిణిలకే యాగం అంటూ మెలిక పెట్టడంతో బాలు మండిపడ్డాడు. 'మేం సెకండ్ సెటప్ పిల్లలమా?' అంటూ ప్రశ్నించి ప్రభావతిని ఇరుకున పెట్టాడు.
ఇదే సమయంలో మౌనికను పిలవాలని మీనా అనడంతో ప్రభావతి గొప్పలు చెప్పింది. కానీ అల్లుడు సంజు ఫోన్‌లోనే ప్రభావతిని అవమానించడంతో ఆమెకు భారీ షాక్ తగిలింది. అసలు మలుపు మీనా ఎంట్రీతో వచ్చింది. సంజుతో ముఖాముఖి వాగ్వాదంలో మీనా తన అసలైన స్ట్రెంగ్త్ చూపించింది. మౌనిక వస్తువు కాదు మనిషి అని క్లాస్ పీకుతూ... అవసరమైతే మీడియా, పోలీస్ కేసుల వరకూ వెళ్తానని హెచ్చరించింది. చివరకు సంజు కుటుంబం వెనక్కి తగ్గడంతో మౌనికను తీసుకొచ్చింది మీనా. ఇంటికి వచ్చాక పందెం గెలిచానంటూ ప్రభావతిపై బాలు 'ఈరోజు నుంచి ప్రభావతి కాదు... పూలవతి' అంటూ శిక్ష విధించాడు. మీనా పూలు అల్లిస్తే, ప్రభావతి పూలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. చివర్లో ప్రభావతి అత్త ఎంట్రీతో ఆమె వాయింపు మొదలవ్వడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.
నాకు ఆ ఫీలింగ్స్.. పెళ్లిపై ఓపెన్ అయిన యాంకర్ శ్రీముఖి..
గురువారం (ఫిబ్రవరి 26) ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. సంతాన యాగం నేపథ్యంలో బామ్మ సుశీలమ్మ ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంట్లో ప్రభావతి-కోడలు మధ్య జరిగిన వాగ్వాదాన్ని చూసి అసలు విషయం తెలుసుకోవాలని ఆమె పట్టుబట్టింది. ఈ సమయంలో బాలు చాకచక్యంగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తూ పందెం విషయాన్ని బయటపెట్టాడు. ప్రభావతి ఓడిపోయిందని, రేపటి నుంచి పూలు అమ్మాలని ప్రకటించడంతో ఇంట్లో వాతావరణం మారిపోయింది. ప్రభావతి షాక్‌కు గురై ఆందోళనలో పడింది. రాత్రికి పూలు అమ్ముతున్నట్టు కలగంటూ మరింత భయపడింది.
మరుసటి రోజు యాగం ఏర్పాట్లలో బాలు మళ్లీ మాట నిలబెట్టుకోవాలని చెప్పడంతో, ఇంట్లో వారంతా మీనాకు మద్దతుగా నిలిచారు. చేసేది లేక ప్రభావతి పూల బుట్టతో బయటకు రావాల్సి వచ్చింది. అయితే మీనా పెద్దమనసుతో విషయాన్ని చల్లార్చింది. 'అన్ని వృత్తులూ సమానమే' అన్న బాలు మాటలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఫామ్ హౌస్‌లో మీనాక్షి కామెడీ సందడి చేస్తుండగా, మరోవైపు గుణ-రోహిణి కుట్ర మొదలైంది. బాలు ఫోన్‌లో ఉన్న వీడియో కోసం రోహిణి ప్లాన్ వేసింది. ఇదే సమయంలో సుశీలమ్మ రోహిణి గర్భస్రావం విషయం ప్రస్తావించడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. సత్యం తన తల్లితో అనుబంధాన్ని వెల్లడించడంతో క్షణిక నిశ్శబ్దం నెలకొంది. క్లైమాక్స్‌లో రోహిణి బాలు ఫోన్ దొంగిలించడం, మీనా గమనించడం కథను సస్పెన్స్ మోడ్‌లోకి తీసుకెళ్లింది.
శుక్రవారం (ఫిబ్రవరి 27) ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కామెడీ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా సాగింది. పూజా పనుల్లో మునిగిపోయిన బాలు తన ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి మర్చిపోతాడు. ఆ ఫోన్‌లో శివకు సంబంధించిన కీలక వీడియో ఉందని తెలుసుకున్న రోహిణి దాన్ని దొంగిలించి డిలీట్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కానీ గందరగోళంలో ఫోన్‌ను దాచిన చోటు నుంచి ఒక చిన్నారి తీసుకెళ్లడంతో ఆమె ప్లాన్ తారుమారవుతుంది. ఆ పిల్ల ఫోన్ ఇవ్వకుండా హంగామా చేయడం కామెడీని పండిస్తుంది. చివరికి ఐస్‌క్రీమ్ ఆశ చూపించి బాలు ఫోన్ తిరిగి తెచ్చుకుంటాడు. రోహిణి ఆశలు అడియాశలవుతాయి.
ఇక పూజకు వచ్చిన సంజును బాలు ఎంతో గౌరవంగా ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 'విషం కాదు బావా... నా ప్రేమ కలిపాను' అంటూ జ్యూస్ ఇచ్చిన సీన్ నవ్వులు పూయిస్తుంది. ప్రభావతి పాట పాడే ఎపిసోడ్‌లో కామాక్షి, సుశీలమ్మ సెటైర్లు ఎపిసోడ్‌కి హైలైట్ అయ్యాయి. మీనా పాడిన భక్తి గీతం మాత్రం ఇల్లంతా ప్రశాంతత నింపుతుంది.ఎపిసోడ్‌కు అసలైన ట్విస్ట్ మౌనిక గర్భవతి అని తెలిసిన సందర్భం. సుశీలమ్మ ప్రకటించగానే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాలు సంబరపడిపోతూ సంజును హత్తుకుని థ్యాంక్స్ చెబుతాడు. సంజు మనసులోనూ మార్పు సంకేతాలు కనిపిస్తాయి. చివరగా బాలు-మీనా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఎపిసోడ్ ముగియడం భావోద్వేగానికి తాకింది.


Click it and Unblock the Notifications











