Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణి అబార్షన్ డ్రామా.. ప్రభావతి హత్య ఆరోపణలు.. తోడికోడళ్ల మధ్య చిచ్చు..
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 26వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (జనవరి 26)ఎపిసోడ్‌లో సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాల తీవ్రతతో, ఉత్కంఠ భరితంగా సాగింది. ఇంట్లో రోహిణి గతం గురించి చర్చ మొదలవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అసలు నిజం బయటపడుతుందన్న భయంతో రోహిణి మరో కొత్త డ్రామాకు తెరతీయగా, తనకు నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందని, అది అబార్షన్ అయ్యిందని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. దీంతో ప్రభావతి పూర్తిగా కరిగిపోయి మీనాను ఈ గొడవకు కారణమంటూ తీవ్రంగా మందలిస్తుంది.ఇదే అవకాశంగా తీసుకున్న రోహిణి, మీనా తనను మొదటి నుంచీ తప్పుగానే చూస్తోందని ఆరోపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తుంది. మనోజ్ కూడా భార్యకు మద్దతుగా నిలిచి, ఇకపై ఆమె విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు.

Photo Courtesy: jiohotstar
అయితే బాలు మాత్రం మీనాకు అండగా నిలుస్తూ, రోహిణి నిజాలను దాచిపెట్టిందని స్పష్టంగా ప్రశ్నిస్తాడు. మీనా హాస్పిటల్‌లో నిజం ఎలా తెలిసిందో వివరించినా, ప్రభావతి మాత్రం ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చివరకు సత్యం జోక్యం చేసుకుని గొడవకు తాత్కాలిక బ్రేక్ వేస్తాడు. అయినప్పటికీ మీనా తీవ్రంగా కుంగిపోతుంది. బాలు ఆమెను ఓదార్చుతూ రోహిణి బాగోతం తప్పకుండా బయటపడుతుందని ధైర్యం చెబుతాడు. ఇవన్నీ విన్న రోహిణి మరింత భయపడి, ప్రభావతి-మనోజ్‌ల వద్ద మరో డ్రామా ఆడుతూ పరిస్థితిని తనవైపుకు తిప్పుకుంటుంది. మరోవైపు సుమతిపై రోహిణి ఫిర్యాదు ఇవ్వడంతో ఆమె ఉద్యోగానికి ముప్పు వస్తుంది. జాబ్ నుంచి తీసివేస్తానని డాక్టర్ హెచ్చరించారు.
మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్‌లో మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, డ్రామా, హాస్యంతో ఆసక్తికరంగా సాగింది. రోహిణి చేసిన తప్పిదానికి నేరుగా శిక్ష అనుభవించాల్సి వచ్చిన వ్యక్తి మీనా చెల్లెలు సుమతి. రోహిణి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఘటన హాస్పిటల్‌లో పెద్ద వివాదంగా మారడంతో, సుమతిని ఆమె డాక్టర్ తీవ్రంగా మందలిస్తుంది.'నీ నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్‌కు చెడ్డ పేరు వచ్చింది' అంటూ ఉద్యోగం నుంచి తీసేస్తానని హెచ్చరిస్తుంది. ఉద్యోగం తన జీవితానికి ఎంత ముఖ్యమో చెబుతూ సుమతి కన్నీళ్లతో వేడుకున్నా, డాక్టర్ పూర్తిగా క్షమించదు. శిక్షగా ఈ నెల మొత్తం ఆఫ్ సాలరీతోనే పని చేయాలన్న కఠిన నిర్ణయం తీసుకుంటుంది. డబ్బు విలువ నేర్చుకోవాలంటూ చేసిన హెచ్చరిస్తుంది. దీంతో సుమతి బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక మరోవైపు మీనా జీవితంలో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. పూలు గుచ్చడానికి రమ్మన్న స్నేహితులను మీనా నిరాకరించడంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోతారు. అదే సమయంలో బాలు ఫోన్ చేసి ఈరోజు రానని చెప్పడంతో మీనా మరింత కుంగిపోతుంది. మరో ట్రాక్‌లో శృతి-రవి మధ్య గొడవ జరుగుతుంది. రవి ఈవెంట్ కారణంగా లేటవుతానని చెప్పడంతో శృతి అలుగుతుంది. మీనా మధ్యలోకి వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతుంది. రాత్రి శృతి హారర్ మూవీ ప్లాన్ వేయడంతో కథ హాస్యంగా మారుతుంది. ప్రభావతి 'నాకు భయం తెలియదు' అంటూ ఓవర్ యాక్షన్ చేయడంతో, శృతి టెక్నాలజీ సహాయంతో అత్తయ్యను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అరుపులు, హడావుడితో మనోజ్ కూడా భయపడిపోతాడు. చివరికి ఇది శృతి, మీనా పని అని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠతో ముగిసింది.
చిరంజీవికి జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ! బాబీ అసలు ప్లాన్ అదేనా?
బుధవారం (జనవరి 28) ఎపిసోడ్‌లో బుధవారం ఎపిసోడ్ సరదా, భావోద్వేగాలు, అపార్థాలతో పాటు తీవ్రమైన ఘర్షణలతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మనోజ్ తన భయాన్ని బయటపెడుతూ, అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశాడు. అదే సమయంలో బాలు, రవి ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మీనా, శృతి వేర్వేరు కారణాలు చెప్పినా, ప్రభావతి మాత్రం దీనికి మీనానే కారణమని నిందలు మోపింది. అయితే శృతి ధైర్యంగా స్పందించి, ఇది తన ఐడియానేనని స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరుసటి రోజు బాలు ట్రిప్ నుంచి అలసిపోయి రావడం, మీనా అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం, ఇల్లు కట్టాలనే బాలు లక్ష్యం ఎమోషనల్‌గా చూపించారు. మరోవైపు శృతి రవికి ఇచ్చిన సర్ప్రైజ్ ఫెయిల్ కావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
అదే సమయంలో జరిగిన పొరపాటు వల్ల నేలపై నూనె పడటం, ఆ విషయం తెలియక ప్రభావతి జారి పడటం కథను కీలక మలుపు తిప్పింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రభావతి మీనా మీద అటెంప్ట్ మర్డర్ ఆరోపణలు చేయడం, మనోజ్ కూడా అదే బాటలో మాట్లాడడం హైలైట్‌గా నిలిచాయి. ఇక్కడ బాలు తన సెటైర్లతో పాటు ఘాటైన మాటలతో ప్రభావతిని నిలదీయడం ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. చివరికి శృతి నేరుగా ఎదురు నిలబడి నూనె పడిన తప్పు తనదేనని చెప్పడం, రోహిణి విషపు మాటలు, ప్రభావతి కొత్త మాస్టర్ ప్లాన్ సంకేతాలు ఎపిసోడ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాయి. ఇక చివర్లో మీనా అత్తకు నాటువైద్యం చేయాలనుకోవడం, తేలు-స్వామీజీ కథతో తన మనసు బలం చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ డ్రామా, ఎమోషన్, రాబోయే కుట్రలతో ఆసక్తిని పెంచింది.
గురువారం (జనవరి 29) ఎపిసోడ్‌లో గురువారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి కాలుజారి కిందపడటంతో ఇంట్లో కలకలం రేగుతుంది. నొప్పులతో విలవిల్లాడుతున్న ప్రభావతికి నాటు వైద్యం చేయాలని మీనా ప్రయత్నించగా, బాలు ముందుగానే "అమ్మ నీ మంచిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది" అని హెచ్చరిస్తాడు. అతను చెప్పినట్లుగానే ప్రభావతి మీనాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వేడి నీళ్లతో తనను కాల్చాలని చూస్తున్నావా అంటూ కసురుకుంటుంది. అయినా మీనా సహనంగా స్పందిస్తూ, "మీరు నా అత్తయ్యే... మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత" అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రభావతి మరోసారి కాపడం పెట్టుకోవాలనగా, వంటింట్లోకి వెళ్లే సమయంలో కొత్త ట్విస్ట్ జరుగుతుంది. టేబుల్‌పైకి ఎక్కి వస్తువులు సర్దుతున్న మీనాను ప్రభావతి అక్కసుతో తన్ని వేయగా, బాలు క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడతాడు.
అయితే కుంకుమ ప్రభావతిపై పడటంతో ఆమె రూపం చూసి అందరూ భయపడిపోతారు. ఈ సన్నివేశం హాస్యంగా, ఉత్కంఠగా సాగుతుంది. ఇదే సమయంలో శృతి అత్తయ్యపై సెటైర్లు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంట్లో కొత్త అగ్గిని రాజేస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రభావతి పెద్ద కోడలు రోహిణితో కలిసి మీనాక్షి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. అక్కడ శృతి తల్లి శోభన చేరి, ఈ గొడవను చాలా లైట్‌గా తీసుకుంటూ ప్రభావతికి రివర్స్ పంచులు వేస్తుంది. శోభన వైఖరితో ప్రభావతి మరింత నిరాశకు గురవుతుండగా, శోభన మాత్రం లోపల మరో ప్లాన్ వేసుకుంటుంది. మరోవైపు ప్రభావతి శృతి-మీనాలను విడదీయాలనే కొత్త కుట్రలకు సిద్ధమవుతుంది
శుక్రవారం (జనవరి 30)ఎపిసోడ్‌లో మొత్తం కుట్రలు, అపార్థాలు, ధైర్యమైన కౌంటర్లు, చివర్లో ఊహించని మైండ్ గేమ్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనాపై చాడీలు చెప్పాలని నిర్ణయించుకున్న ప్రభావతి, శృతి తల్లి శోభన ఇంటికి రాగానే తన అసలు నాటకం మొదలుపెడుతుంది. మీనా వల్ల శృతి జీవితం నాశనం అవుతుందని విషం చల్లే ప్రయత్నం చేసినా, శోభన గట్టిగా ఎదురు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రభావతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది.ఇదే సమయంలో రోహిణికి తల్లి యాక్సిడెంట్ ఫోన్ రావడంతో ఆమె అసలు నిజం చెప్పకుండా వెళ్లిపోవడం ప్రభావతిలో మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది.
ఆ తర్వాత రోడ్డు మీద శోభన-మీనా మధ్య జరిగిన ఘర్షణ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలుస్తుంది. ప్రభావతి మాటలు నమ్మిన శోభన మీనాపై తీవ్ర ఆరోపణలు చేస్తే, మీనా గౌరవంగా కానీ ధైర్యంగా కౌంటర్ ఇస్తుంది. చివరకు మీనా స్నేహితురాలి హెచ్చరికతో శోభన భయపడి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాలను గమనించిన బాలు నిజం తెలుసుకుని కోపంతో మీనాతో కలిసి ఇంటికి వస్తాడు. ఇదే సమయంలో బాలు, మీనా, రవి, శృతి ముందే ప్లాన్ చేసిన డ్రామాను స్టార్ట్ చేస్తారు. బయట ఉన్న ప్రభావతి తన ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందపడుతుండగా, నిజానికి నలుగురూ కలిసి ప్రభావతినే బకరా చేస్తారు. ఈ ట్విస్ట్‌తో శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











