Gunde Ninda Gudi Gantalu Weekly: 40 లక్షల స్కాం షాక్.. బాలు మాస్టర్ ప్లాన్..గుణతో డీల్ రోహిణి..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 18వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకూ 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్ లో 40 లక్షల వ్యవహారం బయటపడటంతో ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంలో రోహిణిదే తప్పు అంటూ అందరూ మాట్లాడటంతో ఆమె ఆవేదనకు గురై, చివరికి అక్కడి నుంచి వెళ్లిపోవడం హైలైట్‌గా నిలిచింది. బాలు-మీనా స్కిట్ రూపంలో మనోజ్, రోహిణి పరిస్థితిని చూపిస్తూ కొంత రిలీఫ్ ఇచ్చినా, బాలు "కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు" అంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కథకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. మరోవైపు మనోజ్-రోహిణి మధ్య గొడవ పెరుగుతుండగా ప్రభావతి ఎంట్రీ ఇచ్చి, డబ్బు సమస్యను వెంటనే సెట్ చేయాలని కఠినంగా ఆదేశించింది. రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేసినా, "డబ్బు తెచ్చే వరకు గౌరవం లేదు" అంటూ షాక్ ఇచ్చింది.

Gunde Ninda Gudi Gantalu week roundup story May 18 th to May 22th Episodes highlights

Photo courtesy: Jio Hotstar

ఇక బాలు ప్లాన్ అసలు ట్విస్ట్ తీసుకొచ్చింది. "పదవి మార్పు ఫంక్షన్" అంటూ షోరూమ్‌లో మనోజ్ స్థానంలో సత్యంను ఓనర్‌గా ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించిన ప్రభావతి కూడా చివరకు బాలు వైపు నిలవడం కీలక మార్పు. అంతలోనే సబ్ డీలర్స్ వచ్చి మనోజ్‌పై మోసం ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముంబై ముఖేష్ ఎంట్రీ ఇచ్చి, మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఎపిసోడ్‌ను మరింత హైలైట్ చేసింది. చివరగా బాలు, మీనా తమ నిర్ణయాన్ని సమర్థించగా, కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి. ఇలా సస్పెన్స్‌తో ముగిసిన ఈ ఎపిసోడ్ తర్వాతి భాగంపై ఆసక్తిని పెంచింది.

Ramayana: రామాయణ బిజినెస్ నెక్స్ట్ లెవెల్.. హిందీ రైట్స్‌కే అన్ని కోట్లా?
మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలు, ఘర్షణలు, ట్విస్ట్‌లతో నిండిపోయింది. షోరూమ్ ఓనర్‌గా ఉన్న మనోజ్ స్థానంలో సత్యంను కూర్చోబెట్టడం కథలో పెద్ద మలుపుగా మారింది. ఈ నిర్ణయం మనోజ్, రోహిణికి షాక్ ఇవ్వగా, ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రోహిణి ఆరోపణలకు మీనా గట్టిగా కౌంటర్ ఇస్తూ, సత్యం కష్టార్జితంతో వచ్చిన డబ్బుతోనే వారు ఇంతకాలం సుఖంగా ఉన్నారని చెప్పడం హైలైట్ అయ్యింది. రవి కూడా తండ్రికి గౌరవం ఇవ్వడమే తమ విలువలని చెప్పడం కుటుంబ భావోద్వేగాన్ని మరింత బలపరిచింది.ఇదే సమయంలో శృతి, మీనా ఇద్దరూ మనోజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయగా, ప్రభావతి జోక్యం చేసుకునే ప్రయత్నం విఫలమైంది.

సత్యం కూడా రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది. చివరికి అసలు సమస్య డబ్బేనని గుర్తించిన సత్యం, 30 లక్షలు మోసం చేసిన వారిని పట్టుకోవాలని బాలు కి బాధ్యత అప్పగించడం కథను కొత్త దిశగా తీసుకెళ్లింది. బాలు-మీనా కలిసి స్మార్ట్ ప్లాన్ సిద్ధం చేయడం మరో ఆసక్తికర అంశం. టీవీ నటుడు ఇంటికి పూల సరఫరా పేరుతో వెళ్లి సమాచారం సేకరించాలని మీనాను బాలు పంపడం థ్రిల్లింగ్‌గా మారింది. ఇదే సమయంలో మనోజ్-రోహిణి కూడా డబ్బు వెతికే వేటలోకి దిగడం కథలో ఉత్కంఠ పెంచింది. మరోవైపు బాలు-రాజేష్ డ్రైవింగ్ స్కూల్ ఐడియా, మీనా డబుల్ సక్సెస్ వార్త అన్ని కలిసి ఎపిసోడ్‌ను ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ గా మార్చేశాయి.

బుధవారం ఎపిసోడ్ పూర్తిగా రోహిణి చుట్టూ తిరుగుతూ, ఆమె భండారం ఒక్కొక్కటిగా బయటపడేలా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి, మనోజ్-రోహిణిలను డబ్బు గురించి నిలదీస్తూ, "డబ్బు తెచ్చేవరకు ఇంట్లో గౌరవం లేదు" అని గట్టిగా చెప్పడం టెన్షన్ పెంచింది. ఇదే సమయంలో బాలు, మీనా ఎంట్రీ ఇచ్చి, వాళ్లను మరింత ఇరికించేలా మాట్లాడారు. ముఖ్యంగా రోహిణి తన తండ్రి గొప్పలు చెప్పడంతో మీనా ఘాటుగా కౌంటర్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. పరిస్థితి మరింత దిగజారుతూ, చివరకు మనోజ్-రోహిణి తినడానికి కూడా నోచుకోని స్థితి వచ్చింది. అందరూ బయట నుంచి భోజనం తెచ్చుకోవడంతో, రోహిణి కిచెన్‌లోకి దిగాల్సి వచ్చింది.

అయితే దోసెలు కూడా సరిగా వేయలేకపోవడం, చేసిన చట్నీ కారంగా ఉండటంతో మనోజ్, ప్రభావతి కళ్లలో నీళ్లు రావడం సన్నివేశానికి కొంచెం కామెడీ టచ్ ఇచ్చింది. ఇక అసలు ట్విస్ట్ కిచెన్ సీన్‌లో వచ్చింది. మీనా, రోహిణిని గుణ దగ్గర అప్పు గురించి నిలదీయడం ఆమెను కంగారు పెట్టింది. గుణ ఓ రౌడీ అని, శివ ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పడంతో రోహిణి టెన్షన్ పడింది. అదే సమయంలో బాలు, రవి కూడా మనోజ్‌కు ఈ విషయం చెబుతారు. మొదట నమ్మని మనోజ్, తర్వాత అనుమానంతో భార్యను నేరుగా ప్రశ్నించడం ఎపిసోడ్‌ను హై వోల్టేజ్‌లో ముగించింది.

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగి కథను కీలక మలుపు వైపు తీసుకెళ్లింది. ముఖ్యంగా రోహిణి చుట్టూ తిరిగిన అనుమానాలు మరింత బలపడుతూ ఇంట్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. బాలు ప్రభావంతో మనోజ్ కూడా రోహిణిని నేరుగా ప్రశ్నించగా, ఆమె తడబడటం అనుమానాలను పెంచింది. చివరికి గుణ దగ్గర అప్పు తీసుకున్న విషయాన్ని ఒప్పుకున్న రోహిణి, ఆ నిర్ణయం కుటుంబ అవసరాల కోసమేనని చెప్పి పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించింది. ఇక మరోవైపు 30 లక్షల మోసం కేసు కథలో ప్రధానాంశంగా మారింది. తండ్రి సత్యం బాధను చూసిన బాలు, మోసగాడిని పట్టుకుని డబ్బులు తిరిగి తెస్తానని మాట ఇస్తాడు.

ఈ క్రమంలో బాలు-మీనాలు టీవీ ఆర్టిస్ట్ కిరణ్‌ను కలవడం ద్వారా కీలక సమాచారం తెలుసుకుంటారు. విల్లా డీల్‌లో అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని కిరణ్ చెప్పడంతో మోసం వెనుక ఉన్న వ్యక్తిపై స్పష్టత పెరుగుతుంది. తర్వాత ధవలేశ్వరం వెళ్లిన బాలు-మీనాలు విల్లా విజయ్‌ను గుర్తించి ఎదుర్కొంటారు. అతడిని నిలదీసి డబ్బులు అడిగే సమయంలో క్లైమాక్స్ టెన్షన్ తారస్థాయికి చేరుతుంది. అయితే మనోజ్ నుంచి వచ్చిన అనవసర ఫోన్ కాల్స్ కారణంగా ఏర్పడిన గ్యాప్‌ను ఉపయోగించుకుని విజయ్ తప్పించుకోవడం పెద్ద ట్విస్ట్‌గా నిలిచింది. చేతికి చిక్కిన మోసగాడు తప్పించుకోవడంతో బాలు-మీనాలు నిరాశ చెందగా, కథ మరింత ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ కథను మరింత ఉత్కంఠభరితంగా మలిచింది. ఫేక్ విల్లా ఓనర్‌ను పట్టుకునేందుకు బాలు చేసిన ప్రయత్నం విఫలమవడంతో టెన్షన్ పెరిగింది. అతడు దొరికినట్టే దొరికి మళ్లీ తప్పించుకోవడంతో బాలు నిరాశ చెందగా, చేపలను ఫ్రీగా పంచిపెట్టి ఇంటికి రావడం కొంత సరదాగా కనిపించింది. అయితే ఇంట్లో మాత్రం వాతావరణం వేడెక్కింది. మీనా వంట చేయలేదని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేయడం, మనోజ్ తన ఫ్రెండ్‌ను తీసుకురావడం పరిస్థితిని అసౌకర్యంగా మార్చింది.30 లక్షల మోసం విషయం బయటపడడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. మనోజ్ సమాధానాలు ఎవరికీ నమ్మశక్యంగా లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.

ఈ సమయంలో సత్యం ఎంట్రీ ఇచ్చి ప్రభావతికి కౌంటర్ ఇవ్వడం సీన్‌కు బలం చేకూర్చింది.బాలు-మీనాలు జరిగిన విషయాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. 30 రూపాయల కోసం మనోజ్ చేసిన ఫోన్ కాల్స్ కారణంగా మోసగాడు తప్పించుకున్నాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు. రోహిణి ప్రవర్తన మాత్రం అనుమానాలకు తావిచ్చింది. "మా డబ్బులు మేమే చూసుకుంటాం" అన్న ఆమె మాటలు బాలుకు అనుమానం కలిగించాయి. మరోవైపు విద్య-గిరి సన్నివేశాలు కాస్త వినోదాన్ని అందించాయి. చివరగా రోహిణి గుణను కలవడం, తక్కువ కమిషన్‌తో డీల్ చేయడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనే సస్పెన్స్‌తో ఎపిసోడ్ ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X