Gunde Ninda Gudi Gantalu Weekly: మౌనిక సంసారం ముక్కలు.. బాలు నిమ్మకాయ డ్రామా.. ప్రభావతి, మనోజ్ గుట్టురట్టు..

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం (నవంబర్ 24) ఎపిసోడ్ ఉత్కంఠతో సాగింది. వ్యాపార నష్టాన్ని దాచిన మనోజ్‌ను రోహిణి నిలదీస్తూ, "నా పరువు ఎందుకు తీసావ్?" అంటూ ప్రశ్నిస్తుంది. తనను విడిచిపెడతుందేమో అన్న భయంతో నిజం చెప్పలేదని మనోజ్ ఒప్పుకుంటాడు. మరింత షాకింగ్‌గా, తన ఫ్రెండ్ దగ్గర లోన్ తీసుకోలేదని, అమ్మతో కలిసి మీనా నగలను అమ్మేసి నాలుగు లక్షలు తెచ్చుకున్నానని చెబుతాడు. ఇది విన్న రోహిణి కంగారు పడుతుంది. బాలు విషయం తెలిసితే ఇంట్లో రచ్చ ఖాయమని భయపడుతుంది. ఇక, శ్రుతి తన ఇంట్లో జరుగుతున్న డ్రామాను ఆధారంగా చేసుకుని కొత్త సీరియల్ రాస్తుండటం రవిని షాక్‌కు గురిచేస్తుంది. "డబ్బింగ్ నా ఊపిరి.. రైటింగ్ నా శ్వాస" అంటూ సీరియల్‌కి గయ్యాళి గంగమ్మ అనే టైటిల్ పెట్టడంతో రవి ఏం మాట్లాడాలో అయోమయంలో పడిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu week roundup story November 24th to November 28th Episodes highlights

మరోవైపు కార్తీక పౌర్ణమి కోసం ప్రభావతి-రోహిణి కలిసి వత్తులు తయారు చేస్తుంటే, పండుగ మహత్యాన్ని మీనా అందంగా వివరిస్తుంది. "365 వత్తులు వెలిగించడం నిత్య దీపారాధన పుణ్యంతో సమానం" అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కుటుంబం మొత్తం పండుగ కలసికట్టుగా తయారవడం బాలును ఆశ్చర్యంలో ముంచుతుంది. "ఇది మా ఇల్లేనా?" అంటూ సెటైర్ వేస్తాడు. ఇదే సమయంలో మౌనిక-సంజు జంటలో ఉద్రిక్తత పెరుగుతుంది. గుడిలో ఎవరినీ కలవకూడదని సంజు వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో పండుగ వాతావరణం ఉన్నప్పటికీ, మీనా నగల రహస్యం ఎప్పుడు బయటపడుతుందోనన్న భయం మాత్రం ఎపిసోడ్ పూర్తిగా వెంటాడుతుంది.

Bigg Boss 9 Telugu 12th Week Elimination: ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్‌లో ఆ నలుగురు.. ఈ వారం ఎలిమినేట్ ఎవరు?
మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ ఉత్కంఠతో సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులంతా శివాలయానికి చేరుకున్నారు. గుడి బయట బాలు తన తాగుబోతు ఫ్రెండ్‌ను చూసి, "ఏంటి ఓ పనికిరాని వాడిలా తిరుగుతున్నావ్?" అని అడుగుతాడు. ఆ వ్యక్తి "నా భార్య గుడికి తీసుకువచ్చింది... తాగితేనే బుర్ర పనిచేస్తుంది" అని చెబుతాడు. ఈ మాట విన్న బాలు మనోజ్‌ను టార్గెట్ చేసే ప్లాన్ చెబుతూ "నా మాట చేస్తే ₹1000 ఇస్తా" అని డీల్ కుదురుస్తాడు. తర్వాత దేవుడు పూనినట్లు నటిస్తూ మనోజ్‌ని అందరి ముందు నిలదీస్తాడు. "నీ మోసాలు అన్నీ తెలుసు... ఇంట్లో మోసం... తండ్రిని మోసం... ఇప్పుడు కొత్త మోసం ఏంటో చెప్పాలా?" అంటూ జాతకం చదివేస్తాడు. ప్రభావతి అడ్డుకోవడమే కాక, సత్యం ఆపేయమని కోరుతాడు. అదే సమయంలో తాగుబోతు భార్య వచ్చి అతడిని లాగిపోవడంతో మనోజ్ ఊపిరి పీల్చుకుంటాడు.

ఇదిలా ఉండగా మౌనిక గుడికి బయలుదేరుతుండగా సంజు ఆమెను బెదిరిస్తాడు. "గుడి పేరుతో బయట తిరిగితే పరిస్థితి మరోలా ఉంటుంది" అని హెచ్చరిస్తాడు. ఇక్కడ నీలకంఠం ఎంట్రీ ఇచ్చి, సంజుపై క్లాస్ పీకుతూ మౌనికపై అనుమానాలు పెడతాడు. మౌనిక తన కుటుంబ సభ్యులను కలవడానికి వస్తోన్నదని, బామ్మ పుట్టినరోజు ఫోటోలు చూపిస్తుంది. ఆ విషయం తట్టుకోలేక సంజు ఆవేశంతో గుడికి చేరుకుంటాడు. మౌనిక దేవాలయంలో తన కుటుంబాన్ని చూసి ఆనందపడుతుంది. పూజలు పూర్తయ్యాక ప్రభావతి వాయనం మొదలుపెట్టబోతుండగా అందరూ సంతోషిస్తారు. అదే సమయంలో సంజు వచ్చి ఆ వాయనాన్ని కిందికి విసరేస్తాడు. "ఇదేనా బాగోతం?" అంటూ మౌనికను నిందిస్తాడు. ఆమె ఎంత చెప్పినా వినక, చేతి చేసేందుకు ప్రయత్నించగా బాలు జోక్యం చేసుకుని సంజును చితకబాదేస్తాడు. పండుగ రోజు, గుడి మధ్యలోనే ఘర్షణ మరో తుపానుకు తెరతీసింది.

బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్‌లో సంజు-మౌనిక మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. సంజు మౌనికపై చేయి చేసుకోవడం చూసిన బాలు ఆగ్రహంతో అతనిపై దాడి చేస్తాడు. ఎవరు అడ్డుకున్నా ఆగకుండా సంజును చితకబాదుతుంటే, మౌనిక షాక్‌లో బాలు చెంపదెబ్బ కొడుతుంది. "మరోసారి ఇలా జరిగితే జన్మలో నీ ముఖం చూడను" అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఆ సందర్భాన్ని సంజు ఉపయోగించుకొని మౌనికను వెంట తీసుకెళ్తాడు. ఇంటికి చేరిన తర్వాత బాలు చేసిన పని కోసం అందరూ విమర్శలు కురిపిస్తారు. ప్రభావతి "నీ వల్లే మౌనికకు కష్టాలు" అని నోరు జారుతుండగా, మీనా ధైర్యంగా ఎదురు నిలుస్తూ "మౌనికను ఎప్పుడైనా కాల్ చేసి అడిగారా?" అంటూ ప్రశ్నిస్తుంది. కుటుంబంలో ఉద్రిక్తత పెరిగినా, మీనా అసలు విషయాన్ని దాచిపెట్టి బాలు కోసం నిశ్శబ్దంగా ఉంటుంది.

ఇక ఇంటికి చేరుకున్న సంజు, మౌనికను మళ్లీ కొడతాడు. మణికంఠ కూడా సంజుకే మద్దతు ఇస్తూ "పుట్టింటికి వెళ్తే తప్పు కాదు... కానీ మోసం చేసి వెళ్తే తప్పు" అంటూ హెచ్చరిస్తాడు. రెచ్చిపోయిన సంజు, మౌనికను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తుంది. కానీ మౌనిక తాను తప్పు చేశానని ఒప్పుకుంటూ "జీవితం చివరి వరకు ఇక్కడే ఉంటా" అని ప్రతిజ్ఞ చేస్తుంది. పుట్టింటి వారితో మాట్లాడకూడదన్న కండిషన్‌ను కూడా బలవంతంగా అంగీకరిస్తుంది. సత్యం ఫోన్ చేసి విచారించినప్పుడు, మౌనిక నిజం దాచిపెట్టి బాలు కారణంగా సంజు కోపం వచ్చిందని చెప్పి తప్పుదారి పట్టిస్తుంది. మరోవైపు తన చర్యలపై బాలు బాధ పడుతుంటే, "మీరు కరెక్ట్‌గానే బుద్ధి చెప్పారు" అంటూ మీనా అతనికి ధైర్యం ఇస్తుంది.

గురువారం (నవంబర్ 27) ఎపిసోడ్ మొత్తం బాలు-మీనా భావోద్వేగాలపై నడిచింది. తన చెల్లెలు పరిస్థితి గుర్తు చేసుకుంటూ బాలు బాధపడుతుంటే, మీనా అతనికి ధైర్యం చెప్పింది. "ఏ అన్నయ్య అయినా తన చెల్లెలు కష్టంలో ఉంటే ఊరుకోడు" అంటూ బాలు చేసిన పనిని సమర్థించింది. కానీ నగల విషయం బయటపడకపోవడం, గుడిలో బాలు స్నేహితుడు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం ఆమెను కలవరపెట్టింది. ఇదంతా మనోజ్-ప్రభావతి కుట్రేనని భావించిన బాలు, గతంలో వాళ్లు చేసిన తప్పుడు పనులను గుర్తుచేస్తూ మీనాను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే "నిజం బయటపడటం లేదు" అంటూ మీనా ఆలోచనలో పడుతుంది. మరుసటి ఉదయం బాలు కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్లాడు. మనోజ్‌కు దగ్గరైన మణికంఠను కలసి, "కొత్త కార్ కొంటున్నాను... రెండు లక్షలు అవసరం" అని డబ్బు విషయంలో నిజం తీయాలని చూశాడు.

మణికంఠ నవ్వుకుంటూ, "మీ అన్నయ్యకు నేను లక్షలు ఇచ్చానా? 10,000 ఇచ్చినా తిరిగి తీసుకోవడానికి చావు తప్పలేదు" అని చెప్పడంతో మనోజ్ అసలు అప్పు తీసుకోలేదని బాలు అర్థం చేసుకుంటాడు. అనుమానం మరింత బలపడగానే మీనాకు చెప్పాడు. "ఎలా నిజం బయటపడుతుంది?" అని మీనా ఆవేదన చెందుతుంటే, ఆమెకు 'బాబా' ఆలోచన గుర్తొచ్చింది. అదే ఆలోచనను పెద్ద స్కెచ్‌గా మార్చిన బాలు, "బాబా మంత్రించిన నిమ్మకాయ" తీసుకొచ్చానని ప్రకటిస్తాడు. "ఇంట్లో దొంగ ఉన్నారు... 24 గంటల్లో నిజం చెప్పకపోతే చేతులు కాళ్లు పడిపోతాయి" అని భయపెట్టి ప్రభావతి-మనోజ్‌లను కుదిపేస్తాడు. శ్రుతి కూడా డ్రామాలో చేరి భయాన్ని రెట్టింపు చేస్తుంది. పూజగదిలో నిమ్మకాయను ఉంచి, వంటగదిలో మంత్రాలు చదువుతున్నట్లు నటించే బాలును చూసి అందరూ షాక్ అవుతారు. మీనాకు అనుమానం రాగానే, "నేనే బాలానంద స్వామి... నిజం బయటపెడతా" అంటూ ప్లాన్ అసలు ఉద్దేశాన్ని చెబుతాడు.

శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. బాలు తెచ్చిన మంత్రించిన నిమ్మకాయకు నిజంగా ఏదో పవర్ ఉందని ఇంట్లో అందరూ నమ్ముతారు. మీనా కూడా అదే భావనలో ఉండగా, బాలు నిజం చెబుతాడు "ఆ నిమ్మకాయ నేనే కొన్నాను, ఎలాంటి స్వామీజీ ఉండరు. దొంగతనం బయటపడేందుకు స్కెచ్ వేసాను" అని. మీనా ఆనందంగా అతనిని ప్రశంసిస్తూ, వెంటనే శ్రుతి, రవి దగ్గరికి వెళ్లి నిజం చెబుతుంది. "స్వామీజీ మీ బాలు అన్నయ్యే రవి..." అని చెప్పగానే, శ్రుతి కూడా అంగీకరిస్తూ "నిజమే... బాలు స్కెచ్ వేశాడు కదా, దొంగ దొరికిపోతాడు" అని నమ్మకం వ్యక్తం చేస్తుంది.

అంతకుమాత్రం మనోజ్, ప్రభావతి మాత్రం భయంతో వణికిపోతున్నారు. చేతులు, ముఖం వంకరపడుతున్నాయంటూ మంత్రం తమపై పడిందని అనుకుంటూ ఒకరికి మరొకరు గుసగుసలాడుతుంటారు. ఆ వేళ రోహిణి గదిలోకి వచ్చి, "బాలు భయపెట్టడానికి చెప్పాడు అంతే" అంటూ వారిని మందలించి ధైర్యం చెప్పి వెళ్లిపోతుంది. కొంత శాంతి వచ్చినా భయం పూర్తిగా తొలగదు. రాత్రి వారు ఇద్దరూ ఒకే భయంకరమైన కలతో నిద్రలేస్తారు. కదలలేని స్థితిలో వీల్ చెయిర్‌లో ఉన్నట్టుగా, భయంతో హాల్లోకి పరుగెత్తి, అక్కడే ఉన్న నిమ్మకాయలను చూసి "ఇవే శాపం" అని గుసగుసలాడుతుంటారు. చివరికి భయం తట్టుకోలేక ప్రభావతి కామాక్షీకి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, భయంతో మాటలు అడ్డగోలుగా వచ్చి పూర్తిగా వివరించలేక తడబడిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X