Guppedanta Manasu June 28th episode: రంగా కాదు. రిషి సార్ అని తెలుసుకొన్న వసుధార

వసుధార ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న సరోజ వసుధారని పాండు వాళ్లకి చూపిస్తుంది. అయితే రంగా వాళ్ళ నుంచి వసుధారని రక్షిస్తాడు. 15 రోజుల్లో ఆయనే రిషి సార్ అని ఒప్పించి ఆయనని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతానని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు మినిస్టర్ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటాను అనటంతో కంగారు పడతాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 28వ తేదీ ఎపిసోడ్ 1,113 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా రివ్యూ

రిషి గురించి రాధమ్మ వాళ్లకి చెప్తుంది వసుధార. మరి రిషి సార్ మీకు ఎందుకు దూరమయ్యారు అని అడుగుతాడు రంగా అసిస్టెంట్. ఒక దుర్మార్గుడి వలన మేము ఇలా విడిపోవలసి వచ్చింది అని మొత్తం కథంతా చెప్తుంది వసుధార.ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటాడు రంగా. అది చూసిన సరోజ ఇదేంటి బావ కన్నీరు పెట్టుకుంటున్నాడు, నిజంగా ఇతనే రిషి సారా అని అనుకుంటుంది. వసుధార రంగా ని చూస్తూ మీరు నిజంగానే రిషి సార్ కదా అని అడుగుతుంది. అదేంటి అలా అన్నారు అంటాడు రంగా. మీరు రిషి సార్ కాకపోతే ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు అని అడుగుతుంది వసుధార.

Guppedanta Manasu June 28th 2024 Episode number 1113 Here is the Full story

మీ కథ సినిమా కథ లాగా ఉంది అందుకే ఎమోషనల్ అయ్యాను అంటాడు రిషి. రాధమ్మ బాధపడొద్దు ఎప్పటికైనా మీ భార్య భర్తలు ఇద్దరూ కలుస్తారు అని ధైర్యం చెప్తుంది.మరోవైపు ఏంజెల్ తో మాట్లాడుతున్న అనుపమ అందరిలాగా నువ్వు మను గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించకు అలా చేస్తే నువ్వు అతనికి దూరమైపోతావు అంటుంది. నువ్వు నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు అంటే నేను బావ జీవితంలోకి రావడం నీకు ఇష్టమేనా అని అడుగుతుంది ఏంజెల్. నువ్వు మనుని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది అనుపమ.

ఇష్టపడుతున్నాను కానీ ఆ విషయం బావకి అర్థం అవడం లేదు అంటుంది ఏంజెల్. అతనికి నువ్వంటే ఇష్టమే, లేదంటే అంత రాత్రిపూట నీతో పాటు ఐస్క్రీమ్ తినటానికి ఎందుకు వస్తాడు అంటుంది అనుపమ. నువ్వు అనుకుంటున్నట్లు బావ నా మీద ఇష్టంతో రాలేదు ఎక్కడ నిన్ను డిస్టర్బ్ చేస్తానో అని వచ్చాడు. బావకి తల్లి మీద ప్రేమ, తండ్రి గురించి తెలుసుకోవాలని తపన తప్పితే వేరే ఆలోచన లేదు అంటుంది ఏంజెల్.

Guppedanta Manasu June 28th 2024 Episode number 1113 Here is the Full story

లేదు అతనికి నువ్వంటే ప్రేమ ఉంది నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వంటే ఇష్టం కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు, నీ అల్లరి నీ భరిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు నువ్వే అర్థం చేసుకోవడం లేదు. మను కి దగ్గర అవ్వాలంటే అతని గతం గురించి మరిచిపోయి అతనికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయు, ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్తుంది అనుపమ.

అందుకు ఏంజెల్ నవ్వుతూ సరే అంటుంది. మరోవైపు సరోజ రంగా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు మా నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను అంటుంది. నీకు నాకు సెట్ కాదు అంటాడు రంగా. ఎందుకు సెట్ కాదు నా అల్లరి చూసి అలా అనుకుంటున్నావా పెళ్లయితే మారిపోతారంట అమ్మమ్మ చెప్పింది అంటుంది సరోజ. ఈ మాటలు అన్నీ విన్న వసుధార అక్కడికి వచ్చి మీరు నిజంగానే సరోజ కి బావా అని అడుగుతుంది.

ఎందుకు అలా అడుగుతున్నారు అంటాడు రంగా. మరి ఆ అమ్మాయి మిమ్మల్ని అంతగా ఇష్టపడుతుంది కదా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది వసుధార. అప్పుడు సరోజ మాట్లాడుతూ మా ఇద్దరిదీ బావ మరదలు సమస్య, మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అని వసుధారపై కోప్పడుతుంది. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకో ఆయనకి ఇదివరకే పెళ్లయింది, ఆయన మీరు ఎక్కువ ఆశలు పెంచుకోకు అంటుంది వసుధార.

Guppedanta Manasu June 28th 2024 Episode number 1113 Here is the Full story

కాదు తను నా రంగ బావ అంటుంది సరోజ. అతను మీ బావ అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే నా రిషి సార్ అని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పే అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. దీని మాటలు వింటుంటే భయంగా ఉంది, నిజంగానే ఇది నా బావని నా నుంచి దూరం చేసేలాగా ఉంది అనుకుంటుంది సరోజ. మరోవైపు కొడుకుని పది మందిలో చులకనగా మాట్లాడినందుకు ఫణీంద్ర ని నిలదీస్తుంది దేవయాని.

వాడు నలుగురిలోని గొప్పగా ఉండాలి తల్లి గా అది నా ఆశ అంటుంది. పదిమందిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో వాడికి తెలియదు వాడు అలా మాట్లాడుతుంటే నాకే చిన్నతనంగా అనిపించింది,ఒక ఉన్నతమైన పదవిని చేపట్టాలంటే మంచి గుణాలు ఉండాలి అంతేగాని మీలా కక్ష సాధింపులు ఉండకూడదు అంటాడు ఫణీంద్ర. ఇప్పుడేమంటారు వాడికి ఎండి పదవి కట్టబెట్టను అంటారా అంటుంది దేవయాని.

ఎండి పదవి కట్టబెడతాను అయితే వసుధార వచ్చి వీడిని ఎండిని చేయమని చెప్పాలి అంటాడు ఫణీంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి వసుధార ఎప్పటికీ అలా చెప్పదు, ఎందుకంటే ఒక కాలేజీకి ఎన్ని బ్రాంచ్ లు ఉన్నాయో కూడా తెలియని మనిషికి అలాంటి పదవి అప్పగిస్తే కాలేజీ డౌన్ ఫాల్ అవుతుంది అందుకే వసుధార ఈయనకి ఎండి పదవి ఇవ్వటానికి ఒప్పుకోదు అంటుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X