Jyoti Poorvaj: జగతి మేడం బర్త్ డే సెలబ్రేషన్స్... ట్రెడిషనల్‌ లుక్‌‌లో జ్యోతిరాయ్ కనికట్టు

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటి జ్యోతిరాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడం అనే పాత్రలో ఒదిగిపోయిన ఆమె తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరయ్యారు. ఇప్పటికే ఆమెను జ్యోతిరాయ్ కంటే జగతి మేడం గానే ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా వెండితెరపై సత్తా చాటేందుకు జ్యోతి పూర్వజ్ సిద్ధమవుతున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు భర్త సుక్కు పూర్వజ్. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
70 ఏళ్లు పూర్తి చేసుకొన్న త్రిష తల్లి.. కూతురును మించిన గ్లామర్‌పై నెటిజన్ల ఫిదా
70 ఏళ్లు పూర్తి చేసుకొన్న త్రిష తల్లి.. కూతురును మించిన గ్లామర్‌పై నెటిజన్ల ఫిదా

కర్ణాటకలోని మడికెరె ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ 2010లో కన్నడ బుల్లితెర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోయిన్లను మించిన అందగెత్తె అయినప్పటికీ యంగ్ ఏజ్‌లోనే తన వయసును మించిన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి. కన్నడంలో కస్తూరీ నివాస, మూరు గంటూ.. తమిళంలో కాత్రుక్కేన్న వెలి తదితర సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై రాణిస్తూనే.. వెండితెర పైనా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఈ ముద్దుగుమ్మ.

Guppedantha Manasu fame Jyoti Poorvaj celebrated her birthday charming her fans with traditional look

2012లో కురల్ అనే కన్నడ సినిమాలో నటించిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే తెలుగు టెలివిజన్ రంగం నుంచి జ్యోతిరాయ్‌కు పిలుపొచ్చింది. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడెంత మనసు సీరియల్‌లో హీరోకు తల్లిగా జగతి మేడం అనే పాత్రలో అద్భుతంగా నటించారు. లెక్చరర్‌గా, భర్తకు దూరమైన భార్యగా, కొడుకు కోసం తపించిపోయే తల్లిగా ఆకట్టుకున్నారు జ్యోతిరాయ్. ఈ ఒక్క సీరియల్‌తో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ రేంజ్ దక్కింది.

Recommended For You
యాంకర్ సుమకు బ్రహ్మాజీ వార్నింగ్... పబ్లిక్‌గా అంత మాట అనేశాడేంటీ?
యాంకర్ సుమకు బ్రహ్మాజీ వార్నింగ్... పబ్లిక్‌గా అంత మాట అనేశాడేంటీ?

చిన్నతనంలోనే జ్యోతిరాయ్‌కి పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. అయితే దర్శకుడు సుక్కు పూర్వజ్‌తో పనిచేస్తుండగా అతనితో ప్రేమలో పడిన జ్యోతిరాయ్ ఆయన్ను పెళ్లాడారు. భర్త దర్శకత్వంలో కిల్లర్ అనే సైంటిఫిక్ మూవీలో నటిస్తున్నారు జ్యోతి. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ సాంకేతికతో, ఊహకందని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీఎఫ్ఎక్స్, ఇతర సాంకేతికపరమైన పనులు పూర్తి కాకపోవడంతోనే కిల్లర్ మూవీ ఆలస్యమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జ్యోతిని తెర మీద చూసేందుకు ఆమె అభిమానులు, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

You May Also Like
నేను స్వలింగ సంపర్కురాలిని.. నా భర్తతో పెళ్లికి ముందే అలా.. టీవీ నటి సంచలనం
నేను స్వలింగ సంపర్కురాలిని.. నా భర్తతో పెళ్లికి ముందే అలా.. టీవీ నటి సంచలనం

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జ్యోతిరాయ్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు. బుల్లితెరపై పద్ధతిగా కనిపించే జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా జూలై 5న జ్యోతిరాయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె భర్త బర్త్ డ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. తన సన్నిహితుల సమక్షంలో ఈ సందర్భంగా జ్యోతి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గోల్డ్ కలర్ శారీలో జ్యోతిరాయ్ మెరిసిపోతూ తన అందంతో కనికట్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా జ్యోతిరాయ్‌కి ఆమె అభిమానులు, సన్నిహితులు విషెస్ తెలియజేస్తున్నారు.

Read more about: guppedantha manasu jyoti rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X