యాంకర్ సుమకు బ్రహ్మాజీ వార్నింగ్... పబ్లిక్‌గా అంత మాట అనేశాడేంటీ?
స్టార్ యాంకర్ సుమ కనకాల ఎక్కడుంటే అక్కడే సందడి నెలకొంటుంది. పంచ్‌లు, ప్రాసలతో చెడుగుడు ఆడుకుంటూ జోష్ తీసుకొస్తారు సుమ. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఫన్నీ క్వశ్చన్స్‌తో సెలబ్రిటీల నుంచి ఆన్సర్లు రాబడుతూ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. ఆమెతో కొందరు స్టార్స్ కలిశారంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే అలీ - సుమ, అనుదీప్- సుమలు ఈవెంట్స్‌లో చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఈ కోవలోకి వస్తుంది బ్రహ్మాజీ- సుమ జోడీ కూడా.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ లెనిన్. జూలై 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 5వ తేదీన తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా నాగార్జున హాజరై చిత్ర యూనిట్‌ని ఆశీర్వదించగా.. హోస్ట్‌గా సుమ వ్యవహరించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీని స్టేజీ మీదకి ఆహ్వానిస్తూ.. ఆయన నడిచొస్తుంటే జెన్ జీ అని అర్ధమైపోతుందని సెటైర్లు వేసింది సుమ. నాగార్జున గారు మాస్ అని అందరూ అనుకుంటారు.. కానీ బ్రహ్మాజీ గారే అసలైన మాస్ ఆయనకి ఒక కర్ర ఇవ్వండి సారీ మైక్ ఇవ్వమని పంచ్‌లు విసురుతుంది.

తిరుపతి ప్రజలు మీ డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. కానీ మేం వద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే చాలామందికి ఇన్సూరెన్స్ లేదని సెటైర్లు వేసింది. మీకొక సర్‌ప్రైజ్ ఉంది, ఇప్పటి వరకు నాగార్జున గారికి కూడా చెప్పలేదని స్క్రీన్‌పై బ్రహ్మాజీ విమానం మీద కూర్చొన్న ఫోటోను ప్రదర్శించారు. ఇది బ్రహ్మాజీ గారు రీసెంట్‌గా కొనుక్కున్న ఛార్టెర్ట్ ఫ్లైట్ అని సుమ చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఇది ఎప్పుడు కొన్నారు? ఎలా కొన్నారు? ఎంతకి కొన్నారు? ఎక్కడ పార్క్ చేశారని సుమ అడిగింది.
ప్రస్తుతం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉంది... ఆ ఫ్లైట్‌లోనే యూనిట్ మొత్తం వచ్చిందని బ్రహ్మాజీ ఆన్సర్ ఇచ్చారు. గాలిలో ఉండగానే విమానంపైకెక్కి బ్రహ్మాజీ ఫోటో దిగారు, దానిని ఎవరు తీశారని సుమ అడిగింది. ఈ ఫోటోను అమల గారు తీశారని బ్రహ్మాజీ చెబుతాడు. ఈ సినిమాలో మీరు అఖిల్‌కి తమ్ముడిగా యాక్ట్ చేశారా? అని సుమ అడగ్గా.. అఖిల్‌కి అపోజిట్‌గా చేశా, నా క్యారెక్టర్ పేరు కుంటి దామోదరమని నడిచి మరి చూపించారు బ్రహ్మాజీ. మీరు నటించాల్సిన అవసరం లేదు.. జీవిస్తున్నారని సుమ అనడంతో బ్రహ్మాజీ సీరియస్ అవుతారు. దాంతో అన్నయ్య అంటూ సుమ కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది అది కాదు అనడంతో గుర్తొచ్చిందని అంటుంది సుమ. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతరం బ్రహ్మాజీ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ చెట్టుకింద టీ తాగిన బ్యాచ్ మా అందరిదీ. అక్కడి నుంచి జర్నీ చూసుకుంటే నాగార్జున గారు ఒక టార్చ్ బేరర్. ఎంతోమంది చిన్నచిన్న దర్శకులని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, నాగచైతన్యతో యాక్ట్ చేశాను, అఖిల్‌తో యాక్ట్ చేశాను. అమల గారితో యాక్ట్ చేశాను, సుమంత్, సుశాంత్ అందరితో యాక్ట్ చేశాను. నెక్ట్స్ జనరేషన్‌తో కూడా యాక్ట్ చేస్తానని బ్రహ్మాజీ అన్నారు.
నేను చేసిన టాప్ 5 బెస్ట్ క్యారెక్టర్స్‌లో కుంటి దామోదరం పాత్ర కూడా ఒకటి. శివాజీ కానీ, సునీల్ కానీ అంతా బాగా చేశారు. అఖిల్ క్యారెక్టర్‌ని సెట్‌లో చూసిన ప్రశాంత్ నీల్ గారు ఎంతో మెచ్చుకున్నారు. భాగ్యశ్రీ వెలిగిపోతూ ఉంటుంది, కెమెరామెన్ లైట్ కూడా వేసేవాడు కాదు. అఖిల్ ఈ సినిమా కోసం ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు, ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు, 24 క్రాఫ్ట్స్‌లోనూ పనిచేశాడు. షూటింగ్ ముగిసిన రెండు గంటల పాటు డిస్కషన్స్‌లో పాల్గొనేవాడని బ్రహ్మాజీ ప్రశంసించారు.


Click it and Unblock the Notifications



