Bigg Boss 7 Telugu అయ్యో పాపం రతిక.. అందరూ మాములూగా వేసుకోలేదుగా.. దామిని నోర్మూయ్ అంటూ!
ఉల్టాపుల్టా అంటూ మొదలైన బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో రకరకాల ట్విస్టులతో 5వ రోజు ఆట కొనసాగింది. టాస్క్‌లు, ఫన్ గేమ్స్‌తో ఇంటి సభ్యులు ఒకరికొకరు క్లోజ్ అవుతుండగా, మరో పక్క కొందరు బద్దశత్రువులగా మారేందుకు పావులు కదుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఇంటి సభ్యుల మధ్య అవేశాలు, విభేదాలను రెచ్చగొట్టడానికి పవర్ అస్త్ర అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఎలా ఉపయోగించుకొన్నారంటే.. ?
పవర్ అస్త్ర టాస్క్‌లో: బిగ్‌బాస్ తెలుగు మొదలైనప్పటి నుంచి ఈ ఆటలో మీరు కంటెస్టెంట్లే కానీ.. హౌస్‌మేట్స్ కాదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. టాస్కులు ఆడుతూ గెలిచి హౌస్‌మేట్స్ అవ్వాలి అనే కండీషన్ పెట్టారు. ఆ క్రమంలోనే పవర్ అస్త్ర అనే టాస్క్‌ను 5వ రోజు బిగ్‌బాస్ ఇంటిలో ఆడించారు. ఈ సందర్భంగా సందీప్, ప్రియాంక జైన్, రతిక, శివాజీ పవర్ అస్త్రను సాధించేందుకు దగ్గరలో ఉన్నారు అంటూ గేమ్‌ను బిగ్‌బాస్ ట్విస్ట్ చేశాడు.

పవర్ అస్త్ర రేసులో ఆ నలుగురు: పవర్ అస్త్ర సాధించే టాస్క్‌లో శివాజీ, రతిక, ఆట సందీప్, ప్రియాంక జైన్‌ను నిలబెట్టి వారి ముందు ఓ బాక్స్ పెట్టారు. టాస్క్ ప్రకారం ఎవరైతే పవర్ అస్ట్రకు అనర్హులో వారి బాక్స్‌లో ఇసుకపోయాలి అని రూల్ చెప్పారు. దాంతో ప్రతీ సభ్యుడు తన ప్రత్యర్థిగా ఉన్న కంటెస్టెంట్‌లోని బలహీనతలను చెప్పి ఇసుకపోయడం ప్రారంభించారు.
రతికపై దామిని ఫైర్: పవర్ అస్త్ర టాస్క్‌లో మొదట శుభశ్రీ ముందుకొచ్చి.. ఈ గేమ్‌లో అత్యంత అనర్హత ఉన్న కంటెస్టెంట్ రతిక. ఆమె గేమ్‌ను ఫెయిర్‌గా ఆడాలని కోరుకొంటున్నాను అని అన్నారు. ఆ తర్వాత సింగర్ దామిని వచ్చి .. రతికకు అనర్హత లేదని భావిస్తున్నాను. ఒకవేళ పవర్ అస్త్ర గేమ్‌లో పాల్గొని గెలిస్తే.. నామినేషన్‌కు అర్ధం ఉండదు. ఇప్పటి వరకు నామినేషన్ అంతా వేస్ట్ అయినట్టే అని దామిని తన రీజన్ చెప్పింది.
శివాజీని టార్గెట్ చేసిన డాక్టర్ గౌతమ్: దామిని తర్వాత వచ్చిన షకీలా కూడా రతికను నామినేట్ చేసింది. అనంతరం వచ్చిన డాక్టర్ గౌతమ్ వచ్చి అందరూ రతికను నామినేట్ చేస్తున్నారు. అయితే నేను గేమ్ మూడ్‌ను మార్చేందుకు శివాజీకి అర్హత లేదని చెబుతున్నాను అని గౌతమ్ అన్నాడు. ఆ తర్వాత వచ్చిన శోభా శెట్టి కూడా రతికపై ఆరోపణలు చేస్తూ.. టాస్క్ ఆడాల్సి వస్తే.. అందులో పాల్గొనడం లేదు అని అంటే.. ఇక నుంచి టాస్కులలో నా ఆట చూడు అని రతిక సవాల్ విసిరింది.
Shahrukh Khan Jawan మూవీలో తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ క్యారెక్టర్ చేసిందో తెలుసా?
శివాజీ నీతి సూత్రాలు: ఇక శివాజీ బిగ్‌బాస్ ఇంటిలో ప్రత్యేకంగా కనిపించారు. నీతి సూత్రాలు చెబుతూ బాబాజీలా మారిపోయారు. తనకు మాలిన ధర్మం పనికి రాదు.., పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదని అనుకొంటారు. ఇక్కడ పిల్లి మనం.. పాలు ప్రేక్షకులు అని సామెతలు చెప్పి ఆకట్టుకొన్నారు. అయితే శివాజీ ఏదో బిగ్ స్ట్రాటెజీతోనే పవర్ అస్త్రను సాధించేందుకు రెడీ అవుతున్నట్టు కనిపించింది.
దామినిపై రతిక ఆగ్రహం:ఇక తనపై అందరూ మాటల దాడికి దిగడంతో రతిక కౌంటర్ ఘాటుగానే ఇచ్చింది. ముందుగా సింగర్ దామినికి కౌంటర్ ఇస్తూ.. నోరు అదుపులో పెట్టుకో. నిలబడి నామినేట్ చేసినప్పుడు ఒకలా.. కూర్చొన్న తర్వాత మరోలా మాట్లాడుతున్నావు. అది సరికాదు అని అంటే.. ఒకే మేడమ్.. నా నాలికను కంట్రోల్‌లో పెట్టుకొంటాను అని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











