నేను ఆ బాబును కాదు.. నువ్వు పెద్ద బొ**: అమ్మాయితో హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్
ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో సినీ, బుల్లితెర రంగాల్లో రాణించడం అంటే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది కొందరు కుర్రాళ్లు మాత్రం తమదైన టాలెంట్లతో జనాల మెప్పును పొంది స్టార్లుగా మారిపోతున్నారు. అందులో టాలెంటెడ్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా మారిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో హైపర్ ఆది ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
జబర్ధస్త్‌తో సెన్సేషన్‌గా
సినిమా స్ఫూఫ్ వీడియోలు చేసుకుంటూ వెలుగులోకి వచ్చిన హైపర్ ఆది.. అలా జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టాడు. ఇందులో తనదైన టాలెంట్లను ప్రదర్శించి ఫుల్ పాపులర్ అయ్యాడు. తర్వాత టీమ్ లీడర్‌గా మారిన ఆది.. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడలేదు. అంతేకాదు, మరెన్నో షోలలోనూ భాగం అవుతూ బుల్లితెరపై సెన్సేషన్‌గా మారిపోయాడని చెప్పొచ్చు.

వరుసగా సినిమాల్లోనూ
జబర్ధస్త్ షోతో సెలెబ్రిటీ అయినపోయిన హైపర్ ఆదికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ప్రవేశించాడు. అందులోనూ తన శైలిని చూపించి ప్రేక్షకులను అలరించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అదే సమయంలో రైటర్‌గానూ సత్తా చాటుకున్నాడు. మొత్తానికి సినిమా రంగంలో కూడా ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.
డ్యాన్స్ షోలో కామెడీతో
జబర్ధస్త్ షోలో చాలా కాలం సందడి చేసిన హైపర్ ఆది.. కొన్నేళ్ల నుంచి అందులో కనిపించడం లేదు. కానీ, ఇప్పుడు 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం యమ సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే, ఈటీవీలోనే ప్రసారం అవుతోన్న ఢీ 17వ సీజన్ 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలోనూ స్పెషల్‌గా కనిపిస్తూ తనదైన కామెడీ గెటప్‌లతో నవ్విస్తున్నాడు.

సీజన్ స్పెషల్ డాక్టర్
వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 17వ సీజన్ ఎపిసోడ్ సీజనల్ స్పెషల్‌గా రాబోతుంది. ఇది గతంలో వాటి కంటే మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఇందులో జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, ప్రణితతో పాటు అందరూ వర్షాకాలం, వేసవి, శీతాకాలం థీమ్స్‌లో కనిపించారు. హైపర్ ఆది మాత్రం డాక్టర్‌గా గెటప్ వేసుకుని హల్చల్ చేశాడు.
కంట్లో నలక పడిందని
'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో హైపర్ ఆది డాక్టర్‌గా వచ్చాడు. అప్పుడతను పక్కన ఉన్న అమ్మాయితో ఏమైందని అడగ్గా 'కంట్లో నలక పడింది' అని చెప్పింది. దీంతో హైపర్ ఆది ఆమె దగ్గరకు వెళ్లి 'కంట్లో నలకపడితే ఉఫ్ ఉఫ్ అని ఊదుతారు. లేకపోతే కంట్లో నాలుక పెట్టి నలక తీసేస్తారు' అని చెబుతాడు.
Suhana Khan: షారూక్ కూతురు అందాల వరద.. లేలేత పరువాలతో పిచ్చెక్కించే ట్రీట్
కోసుకుంటా కానీ వద్దు
హైపర్ ఆది డైలాగ్ చెప్పగానే మరోపక్కన ఉన్న లేడీ కంటెస్టెంట్ 'అబ్బా.. నా కంట్లో కూడా నలక పడింది' అని చెప్పింది. దీంతో అతడు 'నా నాలుక అయినా కోసుకుంటా కానీ, నీ జోలికి మాత్రం రాను' అంటూ పంచ్ వేశాడు. తర్వాత అదే అమ్మాయి 'నా గుండెకు బొక్క పడింది' అంటుంది. దీంతో ఆది 'నువ్వు ఎపిసోడ్‌కే బొక్క' అంటూ ఆమె గాలి తీసేశాడు.
నేను డాక్టర్ బాబు కాదు
ఇదే షోలో కంటెస్టెంట్‌గా ఉన్న కార్తీక దీపం సీరియల్ హిమ 'మీరసలు డాక్టరేనా? ఎందుకు అమ్మను ఇలా చేశావు' అని హైపర్ ఆదిని ప్రశ్నించింది. దీనికతడు 'దీనికి చెప్పండ్రా.. నేను ఆ డాక్టర్ బాబు కాదని' అంటూ బదులిచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం కామెడీగా సాగుతుందని ప్రోమోను బట్టి అర్థం అవుతుంది. అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











