ఆ మాత్రం తెలియదా? ఎలా సీఎం అయ్యావు.. వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సెటైర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా కళారంగంలోనూ దుమారం రేపుతున్నాయి. ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ మహిళతో అశ్లీల నృత్యాలు చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ కళాకారుడు, లేడీ గెటప్ గా ప్రసిద్ధి చెందిన శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన శాంతి స్వరూప్, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ, 'జగన్ గారు... మీరంటే నాకు ఒకప్పుడు అభిమానం ఉండేది. మీరు 'ఆ వీడియో చూపించండి... అమ్మాయిలతో మంత్రి అశ్లీలంగా డ్యాన్స్ చేస్తున్నారు' అని అంటున్నారు. కానీ మంత్రి సుభాష్‌తో స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది నేనే. నేను మహిళను కాదు. లేడీ గెటప్ వేసే కళాకారుడిని. లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Jabardasth Artist Shanti Swaroop Slams YS Jagan Over Obscene Dance Allegations on Minister Subhash

తనపై, తన వృత్తిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన శాంతి స్వరూప్, 'మీకు నేను వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలను లేదా చుట్టూ ఉన్న నేతలను అడిగి ఉంటే నా గురించి చెప్పేవారు. గతంలో మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేశాను. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేను తెలుసు. నిజాలు తెలుసుకోకుండా 'అమ్మాయిలతో అసభ్యంగా చిందులేసే మంత్రి' అంటూ ప్రచారం చేయడం సరికాదు' అంటూ హితవు పలికారు.

ఈ వివాదానికి పూర్తి నేపథ్యాన్ని కూడా శాంతి స్వరూప్ వివరించారు. జనవరి 15న సంక్రాంతి పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో 'సంక్రాంతి సంబరాలు' అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి హైపర్ ఆది టీమ్‌ను ఆహ్వానించారని, అందులో భాగంగానే తాము డ్యాన్స్‌లు, స్కిట్లు ప్రదర్శించామని తెలిపారు. 'డ్యాన్స్ చేస్తుండగా మేమే మంత్రిగారిని స్టేజ్‌పైకి రావాలని కోరాం. కళాకారుల కోరిక మేరకే ఆయన రెండు స్టెప్పులు వేశారు. మంత్రి నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేయలేదు. నేనే ఆయన దగ్గరకు వెళ్లి నృత్యం చేశాను' అంటూ స్పష్టత ఇచ్చారు.

ఇది రికార్డింగ్ డ్యాన్స్ కాదని, వేలమంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన బహిరంగ సాంస్కృతిక కార్యక్రమమని శాంతి స్వరూప్ తెలిపారు. 'ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి మంత్రి రెండు స్టెప్పులు వేస్తే, దాన్ని అశ్లీలంగా చిత్రీకరించడం చాలా బాధ కలిగించింది' అని అన్నారు. అంతేకాదు, 'మేము ఈవెంట్ల మీదే బతుకుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మా బతుకుతెరువును దెబ్బతీస్తాయి. ఆ విషయం కూడా ఆలోచించకుండా మాట్లాడడం సరికాదు'అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయని, కళాకారులను మంత్రి సుభాష్ గౌరవంగా చూసారని శాంతి స్వరూప్ పేర్కొన్నారు. 'ఆ కార్యక్రమం సక్సెస్ కావడాన్ని ఓర్వలేకే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కానీ మంత్రిగారిపై చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా అనిపించాయి'అని అన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యం ఆ మాత్రం తెలియదా? ' అంటూ వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సెటైర్లు వేశారు.

'మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదా కనీసం మీ చుట్టూ ఉన్న కార్యకర్తలను, మీ పార్టీ నేతలను అడిగి నిజాలు తెలుసుకుని మాట్లాడాలి' అంటూ జగన్‌కు శాంతి స్వరూప్ నేరుగా హితవు పలికారు. ప్రజల్లోకి వెళ్లే ప్రతి మాటకు ఒక ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా కళాకారుల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని ఆయన పేర్కొన్నారు.

అలాగే, జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను కూడా శాంతి స్వరూప్ ప్రస్తావించారు. 'లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా మీరు ఎలా సీఎం అయ్యారు?' అంటూ నెట్టింట్లో ఫ్యాన్స్, నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌ను చూసి తనకు చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రోలింగ్ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కళారంగాన్ని, కళాకారుల వృత్తిని కూడా అవమానించేలా మారిందని తెలిపారు.

'ఈ వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధపెట్టినంత మాత్రాన కాదు. ఒక కళాకారుడిగా, ఈవెంట్ల మీదే జీవించే వ్యక్తిగా మా బతుకుతెరువుపై కూడా దెబ్బ పడేలా ఉన్నాయి. ప్రజల్లో తప్పు అభిప్రాయం కలిగితే, రేపు మాకు పని అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విషయం కూడా నాయకులు ఆలోచించాలి'అని శాంతి స్వరూప్ స్పష్టం చేశారు. జగన్‌పై తనకు ద్వేషం లేదని, వ్యక్తిగతంగా ఇంకా గౌరవం ఉందని చెబుతూనే, "నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలాంటి ట్రోలింగ్ జరుగుతోంది. అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది' అని అన్నారు.

ఆ టెలివిజన్ నటి‌తో అలా బ్రేకప్.. లవ్ అఫైర్ గురించి విజయ్ కార్తీక్ ఎమోషనల్!
ఇదిలా ఉండగా, ఈ వివాదానికి ముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన జగన్, సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో 'ఆటవిక రాజ్యం' నడుస్తోందని వ్యాఖ్యానిస్తూ, మంత్రి సుభాష్‌పై 'అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు, స్టేజీపై చిందులు' అంటూ ఆరోపణలు చేశారు.

జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంత్రి సుభాష్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. తాను మహిళతో కాదని, లేడీ గెటప్ వేసే కళాకారుడు శాంతి స్వరూప్‌తోనే డ్యాన్స్ చేశానని స్పష్టం చేశారు. "ఈ విషయం జగన్‌కు తెలియదా? కనీసం రోజాను అడిగినా చెప్పేవారు కదా?" అంటూ ఎద్దేవా చేశారు. కళాకారులకు, రికార్డింగ్ డ్యాన్సర్లకు తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం కళారంగాన్నే అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తంగా ఈ పరిణామం చర్చనీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X