తాళి కడుతా! అంటూ రెచ్చిపోయిన జబర్దస్త్ అవినాష్.. మంగళ సూత్రంతో యాంకర్‌కు చుక్కలు!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముక్కు అవినాష్. తన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాడు. జబర్దస్త్‌తో పాటు బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని, తనదైన పంచ్‌లతో నవ్వులు పంచాడు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లోని పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం', 'కుక్ విత్ జాతిరత్నాలు' వంటి షోల్లో తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా నటి తేజస్వీ మాడివాడ హోస్ట్ చేస్తున్న 'కాకమ్మ కథలు' షోలో గెస్ట్‌గా పాల్గొన్న అవినాష్.. ఈ సమయంలో చేసిన ఓ సరదా ప్రాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ షోలో ఏం జరిగిందంటే.?

Also Read
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

జబరస్థ్ అవినాష్.. ఈసారి నటి తేజస్వీ మాడివాడ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కాకమ్మ కథలు' ( Kaakamma Kathalu Show) షోలో అవినాష్‌, నటి సునైనా అతిథులుగా హాజరయ్యారు. షో సరదాగా సాగుతుండగా ఒక్కసారిగా అవినాష్ లేచి.. "ఈరోజు నీ బర్త్‌డే కాబట్టి నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను" అంటూ తేజస్విని సర్ప్రైజ్ చేశాడు. దీంతో వెంటనే తేజస్వి "ఏంట్రా అది?" అని అడగగా.. "చాలా స్పెషల్.. జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్" అంటూ ఉత్కంఠ పెంచాడు. పదేపదే "తీస్తున్నా... తీస్తున్నా..."అంటూ అందరిలో ఆసక్తిని మరింత పెంచేశాడు.

Recommended For You
Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?
Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?
Jabardasth Avinash s Mangalsutra Prank on Tejaswi Madivada in Kaakamma Kathalu Show Goes Viral

ఆ తర్వాత తన జేబులో నుంచి ఒక్కసారిగా 'మంగళసూత్రం'తీసి చూపించాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. తేజస్వి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ.. "అయ్యో బాబోయ్.. మంగళసూత్రమా? అలాంటిది ఎవరు గిఫ్ట్‌గా ఇస్తారు?" అంటూ నవ్వింది. పక్కనే ఉన్న సునైనా మాత్రం.. "నిజంగానా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో అవినాష్.. పూర్తిగా కామెడీ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. "ఇంకెన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావు? రా... మనిద్దరం కలిసి సమాజానికి మనమేమిటో చూపిద్దాం" అంటూ తేజస్వి వైపు నడవడం ప్రారంభించాడు. ఏదో తేడాగా ఉందని అని భావించినా.. సునైనా వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేసింది.

You May Also Like
ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..
ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..

"మా ఇద్దరి మధ్యకు రావద్దు.. ఈరోజు నన్ను ఎవరూ ఆపలేరు. నేను తాళి కట్టేస్తా" అంటూ మరింత హడావిడి చేశాడు. అవినాష్ ఒక్కసారిగా తనవైపు రావడంతో తేజస్వి కూడా కంగారుపడింది. "వద్దురా... ప్లీజ్ ఆపు" అంటూ నవ్వుతూ అరిచింది. అయినప్పటికీ అవినాష్ మాత్రం.. "నీకు జీవితాంతం నేనే తోడుంటా.. నేనే పెళ్లి చేసుకుంటా" అంటూ వరుసగా డైలాగులు చెప్పాడు. చివరకు తేజస్వి "నాకు వద్దురా బాబోయ్" అంటూ అరిచింది. అంతటితో కూడా ఆగని అవినాష్.. తనదైన డబుల్ మీనింగ్ పంచ్‌లతో మరింత కామెడీ చేశాడు.

Nagabandham Closing Collections: నాగబంధం క్లోజింగ్ కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి లాభమా? నష్టమా?
Nagabandham Closing Collections: నాగబంధం క్లోజింగ్ కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి లాభమా? నష్టమా?

"నీకు జీవితాంతం తోడుంటా... నీ పాలల్లో నేను వేస్తా తోడు" అంటూ సెటైర్లు వేశాడు. దీంతో తేజస్వి .. నిజంగానే తాళి కడుతాడేమోనని అక్కడి నుంచి పరుగులు తీసింది. సునైనా మాత్రం అవినాష్ మాటలకు నవ్వు అపుకోలేక కిందపడింది. ఈ ప్రాంక్ షోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా భయపట్టించావ్ బాస్, అవినాష్ కామెడీ టైమింగ్‌ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అవినాష్ తన కామెడీతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, ఈ ఎపిసోడ్‌ను వైరల్ అయ్యేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X