Jabardasth యాంకర్​ రష్మీకి ఇమ్మాన్యుయెల్​ ​వార్నింగ్​.. ఎక్కువ చేస్తే అలా చేసేస్తానంటూ..!

యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలిసే ఉంటుంది. ఓ వైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలా అడపాదడపా చిత్రాలు చేస్తూ కెరీర్​లో ముందుకు వెళ్తోంది. అయితే తాజాగా ఈమెను అందరి ముందే ఓ స్టార్ కమెడియన్ కాస్త డబుల్ మీనింగ్​లో తిట్టాడు. స్టేజీ మీదే నీ.. లెక్కేస్తా అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. అసలు రష్మిని అతడు ఎందుకలా అన్నాడు అనేది స్టోరీలోకి వెళ్లి క్లుప్తంగా తెలుసుకుందాం.

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోస్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పలువురు కమెడియన్స్ కూడా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, ధన్ రాజ్, గెటప్ శ్రీను వంటి వారు ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు. వేణు అయితే దర్శకుడిగా మారి హిట్ కూడా అందుకున్నారు.

Jabardasth comedian emmanuel Warning To Anchor Rashmi Gautam Full Details Here

ఇక జబర్దస్త్​కు సిరి హనుమంత్ యాంకరింగ్ చేస్తుండగా ఎక్స్​ట్రా జబర్దస్త్​కు రష్మి యాంకర్​గా వ్యవహరిస్తోంది. ఇంద్రజ. వేణు భగవాన్ జడ్జిలుగా వ్యవహారిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈవారం కూడా తమ కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించారు కంటెంస్టెంట్​లు. అయితే వీరిలో ఇమ్మాన్యుయెల్ - వర్ష కూడా ఉన్నారు.

ఈ ఇద్దరు స్కిట్ చేసే క్రమంలో వర్ష నైట్ టైమ్​ చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో అని తెలుసుకోవడానికి ఆమె ఓ వాట్​ తగిలిస్తాడు ఇమ్మాన్యుయెల్​. అదీ తెలియని వర్ష బయటకు వెళ్లి వస్తుంది. దాన్ని కనిపెట్టిన ఇమ్మన్యుయెల్​ నీకు తెలీకుండా వాచీ పెట్టా ఎక్కడి వెళ్లొచ్చావ్ చెప్పూ అంటూ నిలదీస్తాడు. కాస్త గ్యాప్ దొరికితే ప్రపంచమంతా తిరిగొస్తావ్ అంటూ అంటాడు. అది విన్న రష్మి... ఆడపిల్లల్ని అలా ఎవరైనా అంటారా అంటూ ప్రశ్నిస్తుంది. దానికి ఇమ్మాన్యుయెల్​ స్టేజ్​ మీదే ఎక్కువ మాట్లాడకు ఎక్కువ చేస్తే నీ వాచీలోని అడుగులను లెక్కేస్తా అంటూ డబుల్ మీనింగ్ కామెడీ చేస్తాడు. దానికి రష్మి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్లీ షోలో నవ్వులు వస్తాయి.

SS Rajamouli పెను ప్రమాదం బారిన జక్కన్న ఫ్యామిలీ.. జస్ట్‌లో మిస్ అంటూ పోస్ట్

వెంటనే మార్చేయడానికి అది బాయ్ ఫ్రెండ్ కాదు బల్బ్​ అంటూ బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ కూడా కడుపుబ్బా నవ్వించింది. ఇక రోహిణి అయితే తన మార్క్ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఇంకా ఈ షోలో బుల్లెట్ భాస్కర్, రోహిణితో పాటు సత్యశ్రీ, ఆటో రామ్​ప్రసాద్​ సహా పలువురు తమ స్కిట్​లతో తెగ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. మరీ ఎంచక్కా దీన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మార్చి 22న ప్రసారం కానుంది.

ఇక రష్మి సినిమాల విషయానికొస్తే చివరిగా చిరంజీవి నటించిన భోళాశంకర్, హాస్టల్ బాయ్స్​ చిత్రాల్లో నటించింది. ఇందులో భాళాశంకర్ డిజాస్టర్​గా నిలవగా హాస్టల్ బాయ్స్​ పర్వాలేదనిపించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X