SS Rajamouli పెను ప్రమాదం బారిన జక్కన్న ఫ్యామిలీ.. జస్ట్‌లో మిస్ అంటూ పోస్ట్
దర్శక ధీరుడు రాజమౌళికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రస్తుతం జపాన్ దేశంలో ఫ్యామిలీతో కలిసి ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ భూకంపం బారి నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. జస్ట్ లో మిస్ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వరల్డ్ వైడ్ క్రేజ్...
ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమాలకు హాలీవుడ్ రేంజ్ ఖ్యాతినీ తీసుకువచ్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. తీసింది కొన్ని సినిమాలే అయినా.. ఆయన సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఒక్కో సినిమాతో ఆయన ఇమేజ్ ప్రపంచవ్యాప్తం అయింది. బాహుబలి సీరిసుతో ఇండియాలో షేక్ చేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ కూడా వచ్చింది.

అవార్డులు సైతం...
కలెక్షన్లే కాదు.. అవార్డులు సైతం మన దేశానికి తీసుకువచ్చిన ఘనత రాజమౌళికి దక్కింది. అయితే ఈ చిత్రం జపాన్ దేశంలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. జపాన్ దేశంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికీ వసూళ్లు రాబడుతుంది. ఇక జక్కన్న ఇటీవల జపాన్ దేశానికి వెళ్లారనే సంగతి తెలిసిందే. అక్కడ ఫ్యామిలీతో కలిసి పర్యటిస్తున్నారు. RRR మూవీ జపాన్ దేశంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉండగా జక్కన్న అండ్ ఫ్యామిలీ అక్కడి వెళ్లారు.
ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
రాజమౌళి అక్కడ RRR స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని.. ఆ సినిమా వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకువస్తారు. మహేష్ బాబును త్వరలో జపాన్ దేశానికి తీసుకువచ్చి పరిచయం చేస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై జపాన్ దేశంలో కూడా అంచనాలు పెరిగాయి.
ఆరోజు బాలయ్య గ్రాండ్ సర్ప్రైజ్ - ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే - చూసేందుకు మీరు రెడీయా?
కార్తికేయ పోస్ట్...
ఆ విషయం పక్కన పెడితే... తాజాగా జపాన్ లో రాజమౌళి కుటుంబానికి ఓ ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న రాజమౌళి ఫ్యామిలీ అక్కడ భూకంపం బారి నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌లోని 28వ అంతస్తులో ఉన్నామని అప్పుడే మెళ్లిగా భూమి కంపించడం మొదలైందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
మేం సేఫ్ అంటూ...
ఆ పోస్టులో... 'జపాన్‌లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశామన్న కార్తికేయ... మేం 28వ అంతస్తులో ఉండగా.. బిల్డింగ్ మెళ్లిగా కదలడం స్టార్ట్ అయిందని చెప్పుకువచ్చాడు. ఇది భూకంపం అని అర్ధం చేసుకుని టెన్షన్ పడ్డాం... కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారని రాసుకువచ్చారు. జపాన్ వాళ్లు లైట్ తీసుకున్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేశామంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











