5 ఏళ్లుగా ఆమె కోసం నిద్రలేని రాత్రులు.. నిత్యం నరకం చూస్తున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?
జబర్దస్త్ షో గురించి అందులో కామెడీ చేసే కమెడియన్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ఈ షో ఎప్పుడూ ముందే ఉంటుంది. అనేక మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన ఈ షో.. పదేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ షోలో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి టీమ్ లీడర్ గా మారిన కెవ్వు కార్తీక్ అందరికీ బాగా తెలుసు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఒకరి కోసం తాను 5 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు గడిపినట్లు.. ఇప్పటికీ నడుపుతున్నట్లు తెలిపాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కమెడియన్ గా కెరియర్ గా ప్రారంభించిన.. అద్భుతమైన పంచులు, స్కిట్లతో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు కెవ్వు కార్తీక్. గతేడాది పెళ్లి చేసుకున్న ఈయన హాయిగా జీవించాల్సిన సమయంలో కూడా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా చాలా రోజులుగా తాను ఓ సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా ఐదు సంవత్సరాలుగా.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని.. ఆమెతో పాటు తాను కూడా నరకం చూస్తున్నానని పేర్కొన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈయన తాజాగా ఈ పోస్ట్ చేశాడు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా కెవ్వు కార్తీక్ ఓ పోస్ట్ పెట్టాడు. ఓ వీడియోను షేర్ చేయడంతో పాటు ఓ పెద్ద ఉపోద్ధాతం రాసుకొచ్చాడు. ఆ వీడియోలో తన తల్లితో పాటు తాను ఉన్న ఫొటోలను పెట్టి వీడియో చేశాడు. అందులో ఈమె గురించి వివరించాడు. మార్చి 19వ తేదీకి కరెక్టుగా తన తల్లికి క్యాన్సర్ సోకి 5 సంవత్సరాలు అవుతుందని చెప్పుకొచ్చాడు. 2019 మార్చి 19వ తేదీన ఆమెకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు గుర్తించారని వివరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తల్లి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే వస్తుందని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ ఐదేళ్ల కాలంలో తన తల్లి ఎన్నో సర్జరీలు, ముఖ్యంగా బోలెడన్ని కీమో థెరఫీలు చేయించుకుందని.. ఎన్నో నిద్రలేని రాత్రులు, భరించలేని బాధలు పడిందని కెవ్వు కార్తీక్ వెల్లడించాడు. ముఖ్యంగా తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని తెలిసినప్పటి నుంచి అర్తంకాని అగాధంలో కూరుకుపోయామని... గమ్యం తెలియని చీకట్లో ప్రయాణం సాగించామని చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నిటికీ ఒక్కటే సమాధానం అని.. తన తల్లి ఆత్మస్థైర్యంగా నిలవడం తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందని వివరించాడు.
Amardeep: అమర్‌దీప్‌కు మరో షాక్.. ఆమెతో ఇంట్లో బందీగా..!
అలాగే క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి తాను చేసే ప్రయత్నాలు చూస్తుంటే.. ఆమె ఓ అలుపెరగని పోరాట యోధురాలిలా కనిపిస్తుందని అన్నాడు తన తల్లికి చికిత్స చేస్తున్న వైద్యులు అందరికీ తాను పాదాభివందనాలు చేస్తున్నట్లు వివరించాడు. అలాగే తన తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతీ ఒక్కరికీ తన కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. కెవ్వు కార్తీక్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీ తల్లి త్వరగానే కోలుకుంటుంది.. మీరు ధైర్యంగా ఉండండి అంటూ చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











