Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి ఆ జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ... మునుపెన్నడూ లేని విధంగా?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో... ఇటీవల ఏడో సీజన్ కు సంబంధించిన బిగ్ అప్‌డేట్స్ ఇస్తూ వచ్చింది. అతి త్వరలో ఈ ఏడో సీజన్ ప్రారంభం కానుంది. దీంతో దాదాపుగా ఈ షోలో పాల్గోనే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యినట్లు సమాచారం. ఇక ఈ షో మరో జబర్దస్త్ కమెడియెన్ కూడా ఎంటర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
Jailer 4 Days Collections: బాక్సాఫీస్ వద్ద రజినీ జైలర్ ప్రభంజనం.. 4 రోజుల్లోనే 300కోట్లు.. ఎంత లాభమో తెలుసా?
బిగ్ బాస్ షో మొదట ఇతర దేశాల్లో ప్రారంభం అయింది. అలా మన ఇండియాకి వచ్చి హిందీలో ప్రారంభం కాగా.. సూపర్ హిట్టుగా నిలిచింది. దీనితో రిజినల్ భాషలకు తీసుకువచ్చారు. అలా హిందీ భాషలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయగా... ఇక సౌత్ లోని తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడంలో సుదీప్ చేయగా.. తెలుగులో మొదట ఎన్టీఆర్, నానిలు చేయగా.. ఆ తర్వాతి సీజన్స్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు.

తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్... ఏడో సీజన్ కు సిద్ధం అయింది. అందులో భాగంగా తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేయనున్నారు. ఈ సీజన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో షూటింగ్ జరుపుకుని... సెప్టెంబర్ 3వ తేదీన అంటే ఆదివారం నాడు టెలికాస్ట్ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారని టాక్ వినిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా... సీజన్ 2 నాని, సీజన్ 3 నుంచి 6 వరకు వరుసగా 4 సీజన్స్‌కు నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. ఇందులో నాగార్జున హోస్ట్ చేసిన 4వ సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరో సీజన్ మాత్రం విమర్శల పాలైంది. ఇక దీనికి ఓటీటీ వర్షన్ కూడా విడుదల చేయగా.. వ్యూవర్ షిప్ లేకుండా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ప్రయోగానికి స్వస్తి చెప్పారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్ చేస్తూ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి హౌజులో మొత్తంగా 20 మందిని దింపనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని ఎంట్రీ దాదాపుగా ఖరారు అయ్యినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇక నరేష్ జబర్దస్త్ తో పాటు ఈటీవీలో వచ్చే పలు షోల్లో కమెడియన్ గా చేస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక నరేష్ బిగ్ బాస్ హోజ్ లోకి వస్తే... ఓ పొట్టి మనిషి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నరేష్ అవుతాడు. ఇక తన మాటలతో, అల్లరితో ఆకట్టుకుంటోన్న నరేష్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. అతను బిగ్ బాస్ లోకి వచ్చేందుకు రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











