జబర్ధస్త్ వర్ష నిజంగా లవ్ చేసేది ఆ డైరెక్టర్‌నే.. పెళ్లి కాకుండానే ఆ పని చేసేశాడా?

దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని ద్వారా చాలా మంది ఆర్టిస్టులు కూడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిలో క్యూట్ లేడీ వర్ష ఒకరు. చాలా ఏళ్లుగా జబర్ధస్త్ షోలో తనదైన మార్కును చూపిస్తోన్న ఈ చిన్నది.. మరిన్ని అవకాశాలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వర్ష ఓ డైరెక్టర్‌తో ప్రేమలో పడినట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

జబర్ధస్త్‌తో సెన్సేషన్‌గా
చాలా కాలం పాటు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వర్ష.. కొన్నేళ్ల క్రితం జబర్ధస్త్ షోలో ఓ స్కిట్ చేసేందుకు వచ్చింది. అందులో అదరగొట్టిన ఈ భామ.. ఆ తర్వాత అదే షోలో పర్మినెంట్‌ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి పలువురు టీమ్ లీడర్లతో కలిసి పని చేస్తూ ఫుల్ ఫేమస్ అయింది. తద్వారా బుల్లితెరపై వర్ష సెన్సేషన్‌గా మారిపోయింది.

Jabardasth Varsha Fell In Love With Television Director

అతడితో లవ్ ట్రాక్‌తో
జబర్ధస్త్ వర్ష తన అందం, అభినయంతో హైలైట్ అయితే.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించి మరింత పాపులర్ అయింది. అతడితో ప్రేమలో ఉన్నట్లు తరచూ స్కిట్లు చేస్తోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ కిస్‌లు, హగ్గులతో రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ రావడంతో జంటగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు.

ప్రేమలో పడిన వర్ష
జబర్ధస్త్ వర్ష తనదైన రీతిలో ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే ప్రేమలో పడిందంటూ కమెడియన్ ఇమాన్యూయేల్ ఇటీవలే కామెంట్స్ చేశాడు. అంతేకాదు, 'నువ్వు ప్రేమించే వ్యక్తి ఎవరో చెప్పొచ్చుగా. ఈ సెట్ మొత్తం వెయిట్ చేస్తోంది. మాకు తెలిసినోడు హ్యాండ్సమ్‌గా ఉండడు కదా' అంటూ వర్ష లవ్ బయటపెట్టేశాడు.

Jabardasth Varsha Fell In Love With Television Director

వర్ష లవర్ ఎవరని?
ఇమాన్యూయేల్ జబర్ధస్త్ స్కిట్‌లో భాగంగా వర్ష లవ్ ట్రాక్ గురించి కామెంట్స్ చేశాడు. అయితే, ఇవి గతంలో మాదిరిగా ఫన్నీగా చేసినట్లు అనిపించలేదు. నిజంగానే ఆమె ప్రేమను బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ యంగ్ కమెడియన్ ఈ మాటలు మాట్లాడినట్లు అర్థం అయింది. అప్పటి నుంచి వర్ష లవర్ ఎవరు? అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు.

డైరెక్టర్ ప్రేమలో వర్ష
జబర్ధస్త్ వర్ష లవ్ ట్రాక్ గురించి ఇప్పుడు ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం ప్రసారం అయిన ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌లో ఇమాన్యూయేల్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. తన స్కిట్‌లో భాగంగా అతడు వర్షను డైరెక్ట్ చేస్తానని అంటాడు. అప్పుడామె 'నాకు డైరెక్టర్లు అంటే భయం' అని చెప్తుంది. దీంతో ఇమాన్యూయేల్ అసలైన మ్యాటర్ లీక్ చేశాడు.

Nandita Swetha: అందాలతో బందీ చేస్తోన్న నందిత.. ఈ పిక్స్‌లో చూస్తే మైండ్ బ్లాకే!

పెళ్లి కాకుండానే అలా
వర్ష తనకు డైరెక్టర్లు అంటే భయం అని అనడంతో ఇమాన్యూయేల్ 'అప్పుడే ప్రేమ పోయి భయం కూడా వచ్చేసిందా' అని కామెంట్ చేశాడు. తద్వారా డైరెక్టర్‌తో ఆమె ప్రేమ నిజమే అని మరోసారి చెప్పకనే చెప్పేశాడు. అంతేకాదు, పెళ్లి కాకుండానే భయపెట్టేలా వర్షతో సదరు బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తించినట్లు కూడా చెప్పాడు. దీంతో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X