Janaki Kalaganaledu Weekly Roundup: మారిపోయిన జ్ఞానాంబ.. మల్లికకు షాక్.. జానకి హ్యాపీ!

ఈ మధ్య కాలంలో టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం

కూడా అంటే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఆగస్టు 1వ ఎపిసోడ్

ఆగస్టు 1వ ఎపిసోడ్

ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి నిరంతరం కష్టపడుతుంది. కానీ చదువుకున్న కోడలు అంటే అత్త జ్ఞానాంబకు ఇష్టం ఉండదని జానకికి తెలుసు. అయినా కూడా జానకి భర్త సహకారంతో ఇన్స్టిట్యూట్ కు వెళుతుంది. ఇక జ్ఞానాంబకు అసలు విషయం తెలుస్తుంది. దీంతో జ్ఞానాంబ చదువుకుంటున్న కొడలిపై అలాగే చదివిస్తున్న కొడుకుపై మరింత కోపంగా ఉంటుంది. వారిద్దరితో మాట్లాడకుండా ఉంటుంది.

ఆగస్టు 2వ ఎపిసోడ్

ఆగస్టు 2వ ఎపిసోడ్

జానకి విషయంలో జ్ఞానాంబ అసలు నిజం తెలుసుకున్న అనంతరం కోపం మరింత ఎక్కువవవుతుంది. ఈ తరుణంలో ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్న సమయంలో అందరూ బిజీగా ఉంటారు. అయితే క్రమంలో రామచంద్ర పూజలో కావాల్సిన స్వీట్స్ తయారు చేస్తుండగా గాయమవుతుంది. అయినప్పటికీ కూడా తల్లి జ్ఞానాంబ కొడుకు గురించి ఏ మాత్రం పట్టించుకోదు. ఆ విషయంలో రామచంద్ర ఎంతగానో బాధపడతారు. చదువు విషయంలో మరో ఆలోచన లేకుండా లేకుండా ఉండాలని మాట తీసుకున్నా కూడా అదేమీ లెక్క చేయకుండా జానకి మోసం చేయడం జ్ఞానాంబ తట్టుకోలేకపోతుంది.

 ఆగస్టు 3వ ఎపిసోడ్

ఆగస్టు 3వ ఎపిసోడ్

జవరలక్ష్మి వ్రతం పెద్ద కొడుకు కొడలితో చేయాలి అని ఆనవాయితీ ఉన్నప్పటికీ జ్ఞానాంబ చిన్న కొడుకు కోడలితో చేయించాలని అనుకుంటుంది. అయితే చిన్న కోడలు మల్లిక పూజ విషయంలో కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంది. కేవలం జానకి మీద ఉన్న పగతో మల్లిక ఆ పూజలో హడావుడి చేస్తుంది. అయితే పూజా సమయంలో ఒక పాట పాడాలని చెప్పినప్పటికీ ఆమె తనకు రావని అంటూంది. ఇక ఫైనల్ గా జానకి పూజలో పాట పాడి మెప్పిస్తుంది.

 ఆగస్టు 4వ ఎపిసోడ్

ఆగస్టు 4వ ఎపిసోడ్

వరలక్ష్మీ వ్రతం పూజ ముగిసిన తర్వాత వాయనం ఇవ్వడానికి జానకి ముందుకు వచ్చినప్పటికీ కూడా జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గోవిందరాజులు చెప్పిన మాటలకు ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక మరోవైపు అత్తగారు జానకి మళ్ళీ కలిసిపోతే తన పరిస్థితి ఏమైపోతుందో అని మల్లిక కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అందుకే వాళ్ళని కలవనివ్వకుండా చేయాలి అని అత్తగారి మాటకు విలువ లేకుండా చేసిన జానకి క్షమించమంటారా ? అని మల్లిక అంటుంది. దీంతో ఒక్కసారిగా గోవిందరాజులు కోపంతో ఊగిపోతాడు. నువ్వు మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇస్తాడు

 ఆగస్టు 5వ ఎపిసోడ్

ఆగస్టు 5వ ఎపిసోడ్

జ్ఞానాంబ ఫైనల్ గా జానకి చదువుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ తనలో ఉన్న ఒక ఆందోళన కారణంగా కొన్ని షరతులను కూడా పెడుతుంది. గతంలో నా తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయినీ పెళ్లి చేసుకొని ఇబ్బందుల్లో పడ్డాడు. ఆమె అవమానించడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పరిస్థితి నా కొడుకుకు రావద్దని నాలో ఒక ఆలోచన ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా రామచంద్రను అవామనించే విదంగా చూడవద్దు అని అంటుంది. అంతేకాకుండా నీ ఐపిఎస్ చదువు ఈ ఇంటికి వారసుడీని ఇవ్వడానికి ఆటంకం కాకూడదు అలాగే నువ్వు గతంలో వెన్నెల విషయంలో తల దూర్చినట్లు ఇప్పుడు కూడా అలానే ప్రవర్తించకూడదు అని జ్ఞానాంబ షరతులు పెడుతుంది. అలాగే జానకి కూడా అందుకు ఒప్పుకుంటుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X