Brahmamudi January 19th భర్త బండారం తెలుసుకున్న కావ్య... ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్!
నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 19వ తేదీ ఎపిసోడులో కావ్య పనులు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావ్.. పని మనిషి ఏమైందని అడుగుతుంది. ఇప్పటిదాకా ఉంటుందా అని కావ్య అంటుంది. ఇలాగే చేస్తూ ఉంటే.. నీతో బాత్రూములు కూడా కడిగించుకుంటారు.. తిరగబడు అని రెచ్చగొడుతుంది. ఇది మన పనే కదా.. చేస్తే ఏమవుతుందని కావ్య అంటుంది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నవ్.. ఇంట్లో వాళ్లు నిన్న మనిషిలా చూస్తున్నారా.. నిన్న మొన్న వచ్చిన అనామిక కూడా చిత్రాంగిలా తయారు అయింది.
రోజుకో చీర కట్టుకుని.. సింగారించుకోవడం తప్ప.. ఏమైనా పనులు చేస్తారా.. ఇవన్ని పనులు చేయనని చెప్పు.. పనిమనిషిని పెట్టుకోమని చెప్పు.. కావాలంటే వండి మొహనా పడేస్తానని చెప్పు అని కావ్యకు స్వప్న చెప్తుంది. ఇది మన ఇల్లు.. మన వంశం.. అలా కండిషన్స్ పెట్టలేం.. ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలి.. అలాంటిది మాటలు అనుకోవడం కన్నా.. సర్దుకుపోవడమే మంచిది అని కావ్య అంటుంది. నీకు చెప్పాను చూడా నన్ను అనుకోవాలే అని స్వప్న వెళ్లిపోతుంది.

మరోవైపు కనకం దగ్గరికి పక్కింటి శాంత కనకం ఇంటికి వస్తుంది. కూతురు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తుంది. అబ్బాయి ఏం చేస్తాడు అంటే.. ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తాడు.. కనకం అక్కలా కోట్ల ఆస్తి ఉన్న అల్లుడును తీసుకురాలేం కదా.. అంత తెలివితేటలు నాకు ఎక్కడివి అంటుంది. మీ చిన్న కూతురుని కూడా ఆ ఇంటి చిన్న కొడుకుతో పెళ్లి చేయాలని చూశావట కదా అని దెబ్బి పోడుస్తుంది. మన కాలనీవాళ్లంతా అంటుంటే విన్నాను అని చెప్తుంది. భలే ప్లాన్ వేశావ్ అక్క అని అంటుంటే.. బాధతో కనకం, లోపల అప్పు, అవమానంగా కృష్ణమూర్తి ఫీల్ అవుతుంటారు.
నాకు పనుంది అని చెప్పి కనకం వెళ్లిపోతుంది. కృష్ణమూర్తి కూడా వెళ్లిపోతాడు. మాట్లాడుతుంటే అలా వెళ్లిపోతారేంటి అని శాంత అంటే.. అసలే జరిగిన అవమానాన్ని ఎలా దిగమింగుకోవాలో మదనపడుతుంటే నువ్ వచ్చి మాపై ఏడుస్తావేంటే అని అన్నపూర్ణ ఫైర్ అవుతుంది. ఏడుపు కాదక్క.. నేను అలా అల్లుడుని తేలేకపోయానని బాధ. అయినా జరిగిందే కదా అన్నాను అని శాంత అంటుంది. ఇంకోసారి ఇటు వచ్చావంటే చెప్పుతో కొడతాను. వెళ్లవే అని అన్నపూర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఉన్నదే కదా అన్నది అనుకుంటూ శాంత వెళ్లిపోతుంది.
మరోవైపు రాజ్ అప్పుడే పడుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది కావ్య. తను కూడా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది. అప్పుకు భోజనం తీసుకొస్తుంది అన్నపూర్ణ. తినాలని లేదని చెప్తుంది. దీంతో అప్పుకు దైర్యం చెప్తుంది అన్నపూర్ణ. మళ్లీ పాత అప్పులా ఉండాలని చెప్తుంది. మరోవైపు రాజ్ ఫోనులో అలారం మోగుతుంది. కాల్ అనుకుని హలో అంటూ మాట్లాడుతుంది కావ్య. అది ఫోన్ కాదు. అలారం. నా ఫోనులో అని రాజ్ అంటాడు. ఆఫీసులో వర్క్ ఉందని... 11గంటలకు వెళ్తాడు రాజ్.
మరోవైపు శ్వేత పడుకుని ఉంటే ఆమె ఇంట్లోకి ఎవరో వస్తారు. అతనెవరో చూపించరు. కానీ, కాళ్లు చూపిస్తుంటారు. అతను కత్తి తీసుకుని శ్వేత ఇంట్లోకి వెళ్తాడు. ఇంతలో నిద్రలేచిన శ్వేత డోర్ వేసాను కదా. తెరుచుకుందేంటి అని బెడ్ రూమ్ డోర్ వేస్తుంది. ఇంతలో ఏదో చప్పుడు అయి ఆగిపోతుంది. వెళ్లి డోర్ తీసి చూస్తుంది. ఫ్లవర్ వాజ్ ఎలా పడిందనుకున్న శ్వేత దాన్ని పక్కన పెడుతుంది. ఇంతలో డోర్ కర్టెన్స్ పక్కన ఎవరో ఉన్నట్లు చూసిన శ్వేత.. ఎవరు. మర్యాదగా బయటకు రా అంటూ చూసేందుకు భయం భయంగా వెళ్తుంది. భయంతోనే డోర్ కర్టెన్ తీసి చూస్తుంది శ్వేత. కానీ, అక్కడ ఎవరు ఉండకపోయేసరికి ఊపిరి పీల్చుకుంటుంది.
HanuMan: 28ఏళ్లకే ఇరగ్గొట్టేశావ్.. నాకు, నా కొడుక్కి గూస్‌బంప్స్ తెప్పించావ్.. హనుమాన్‌పై హీరో సంచలన ట్వీట్
ఎవరు లేరనుకుని తన బెడ్ రూమ్‌లోకి వెళ్లి నీళ్లు తాగుతుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి ఈవెనింగ్ కాల్ మి అని మెసేజ్ పెట్టావుగా అని అంటాడు. ఏదో పెట్టానులే అని శ్వేత అంటే.. ఏంటీ టెన్షన్‌గా ఉన్నావని రాజ్ అడుగుతాడు. ఏమో తెలియదు. ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో అలా అనిపిస్తుంది అని శ్వేత అంటుంది. మీ ఇంటికి ఈ టైమ్‌లో ఎవరొస్తారు. సరే నేను రానా. నేను బయట ఉన్నాను. ఆఫీస్‌కు వెళ్తున్నాను అని రాజ్ అంటాడు.వద్దులే రాజ్ అని చెప్తుంది.
ఇంతలో హాల్లో టీవీలో ఏదో పోగ్రామ్ ప్లే అవుతుంది. అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్వేత. భయంగా కర్ర తీసుకుని హాల్లోకి వెళ్లి చూస్తుంది శ్వేత. టీవీ ఆఫ్ చేస్తుంది. కంగారుగా అటు ఇటు చూస్తుంది. ఇంతలో మరోసారి నీడ కనిపిస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్ సార్ ఆఫీసులో లేరని, కాల్ చేస్తే కట్ చేస్తున్నాడని, డిజైన్స్ రేపటిలోపు ఇవ్వాలని సెక్రటరీ కావ్యకు కాల్ చేసి చెబుతుంది. సరే మెయిల్ చేయు నేను చూస్తాను అని కావ్య అంటుంది.
మరోవైపు రాజ్‌తో ఇంట్లో జరిగే సంఘటనల గురించి శ్వేత చెప్పినట్లుగా చూపించారు. శ్వేత ఇంట్లో ఉన్న వ్యక్తి దాన్ని వీడియో తీసి కావ్యకు పంపిస్తాడు. ఆ వీడియోలో అర్దరాత్రి శ్వేతతో రాజ్ చనువుగా ఉండటం చూసి కావ్య షాక్ అవుతుంది. మరి శ్వేతకు, రాజ్ కు సంబంధం ఏంటి.. ఆ వీడియో తీసి కావ్యకు ఎవరు పంపించారు.. ఏంటి అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











