Naga Panchami: మోక్షను ముద్దుపెట్టుకున్న కరాళీ.. కళ్లారా చూసిన పంచమి.. ఏం జరగబోతుంది?

Naga Panchami November 30th Episode: నాగ పంచమి పంచమి సీరియల్ రోజురోజుకూ మహా అద్భుతంగా సాగుతోంది. ఈ సీరియల్ చూసే వారికి ఆత్రం ఎక్కువయ్యే సీన్స్ పెడుతూ అందరినీ తెగ అలరిస్తున్నారు. సినిమాను మించిన ట్విస్ట్ లు ఇస్తూ.. ప్రతిరోజూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా సాగదీతగా అనిపించకుండా ఉండేందుకు అద్భుతమైన సన్నివేషాలను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో కరాళీ మోక్షను వశపరుచుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మోక్ష ఇంట్లోకి అడుగు పెట్టి అతడిని ముద్దు పెట్టుకుంది. అయితే అప్పటికే సుబ్బుతో కలిసి అక్కడకు వచ్చిన పచమి.. మోక్ష, కరాళీలను చూసి తెగ టెన్షన్ పడుతుంది. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

ఈరోజుటి ఎపిసోడ్ లో మాత్రం.. ముందుగా కరాళీని చూపించారు. పంచమి, మోక్షలకు శోభనం జరిగి.. మోక్ష బ్రహ్మచర్యం పోయిందని ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అవుతుంది కరాళీ. తాను చనిపోయేందుకు చుట్టూ అగ్నిని ఏర్పరుచుకుని సజీవ దహనం అయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే అంతలోనే మహాకాళి వచ్చే కరాళీని చావకుండా అడ్డుకుంటుంది. నువ్వు ఇలా చేయడం తప్పు.. అసహజ మరణం అస్సలే మంచిది కాదని వివరిస్తుంది. అలాగే పంచమి, మోక్షలకు శోభనం జరగలేదని.. గదిలోకి పంచిన మాట వాస్తవమే అయినా ఏం జరగలేదని వివరిస్తుంది. నువ్వు పౌర్ణమి లోగా అతడిని వశపరుచుకుని నీ పని చేసుకోవాలని.. పౌర్ణమికి మోక్ష ప్రాణాలు పోతాయని చెబుతుంది.

Karali Kissed Moksha Infront of Panchami on November 30th Episode Number 214 in Naga Panchami Telugu Serial

అందుకు కరాళీ సంతోషించి... తన ప్రాణాలు కాపాడిన మహాకాళికి ధన్యవాదాలు చెబుతుంది. జన్మాంతం నీ భక్తురాలిగానే ఉంటానని మాట ఇస్తుంది. ఇక ఆ తర్వాత మోక్ష, పంచమిలు కనిపిస్తారు. మనం చాలా సంతోషంగా ఉంటామని అంటాడు మోక్ష. ఇన్నాళ్లూ పట్టుకున్న మబ్బులు వీడిపోయాయని.. ఇకపై మనం సంతోషంగా ఉందామని వివరిస్తాడు. నా వారసత్వాన్ని నీ కడుపులో మోస్తే తప్ప.. నేను చనిపోయిన తర్వాత నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు అని అంటాడు. అందుకు పంచమి.. మీ ప్రాణాలు పోతాయని తెలిస్తే.. ఒక్క నిమిషం ముందే నేను ప్రాణాలు విడుస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత యువరాజు ఫణీంద్ర వస్తాడు.

మొన్న నేను మోక్ష ప్రాణాలు తీయబోతుంటే.. మీకు హక్కు లేదని అన్నావు కదా.. నేను ఇప్పుడు ఆ హక్కు పొందానని ఫణీంద్ర చెబుతాడు. ఇప్పుడు తనకు సర్వాధికారాలు ఉన్నాయని... నిన్ను మోక్ష తాకిన వెంటనే ఆయనను కాటేసి చంపుతానని హెచ్చరిస్తాడు. ఇందుకు పంచమి చాలా భయపడుతుంది. ఇక ఆ తర్వాత పంచమి వెళ్లిపోగా... కరాళీని చూపించారు. కరాళీ తన మంత్రశక్తితో మరోసారి తన అన్న నంబూద్రీ ఆత్మను రప్పిస్తుంది. ఈక్రమంలోనే తాను ఆశ్రమాన్ని వదిలి కొన్నాళ్లు బయటకు వెళ్తున్నానని చెబుతుంది. నన్ను కాపాడడం వదిలేసి వెళ్లిపోతున్నావా అంటూ అడగ్గా.. లేదు అన్నయ్యా.. నీ ప్రాణాలు కాపాడేందుకు నా ప్రయత్నం అంతా అని మహాకాళి చెప్పిన విషయాలను చెబుతుంది.

ముఖ్యంగా మోక్షను వశపరుచుకుంటే తనకు శక్తులు వస్తాయని.. వాటితోనే నాగమణిని సంపాధించి నీ ప్రాణాలు కాపాడతానని వివరిస్తుంది. నీ శరీరాన్ని కాపాడేందుకు నా భటులను ఉంచానని.. అలాగే ఇక్కడ ఓ మంత్రశక్తిని పెట్టి కొన్నాళ్లు వెళ్లి వస్తానని చెబుతుంది. ఇక ఆ తర్వాత మోక్ష కుటుంబ సభ్యులు తమ ఇంటికి బూడిద గుమ్మడికాయను కడుతూ కనిపిస్తారు. ఇంట్లో వాళ్లకు ఎలాంటి దిష్టి తగలకుండా ఈ బూడిద గుమ్మడికాయ బాగా పని చేస్తుందని అయ్యగారు వివరిస్తారు. ఆ తర్వాత పంచమి అతడికి దక్షిణగా ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో చిత్ర, జ్వాలలు ఫైర్ అవుతారు. ఇంట్లో వాళ్లతో గొడవ పెట్టుకోవాలని చూడగా.. వాళ్లంతా వెళ్లిపోతారు.

Karali Kissed Moksha Infront of Panchami on November 30th Episode Number 214 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత కరాళీ... తన రూపాన్ని మార్చుకొని చాలా స్టైలిష్ లుక్ లో మోక్ష ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చిన వెంటనే రక్తార్పణం చేస్తుంది. చెట్టుపై తన రక్తంతో ఏదో మంత్రాన్ని రాస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లడం.. మోక్షను వశపరుచుకునే ప్రయత్నాలు చేయడం చూపిస్తారు. అయితే ఇదంతా రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X