Karthika Deepam June 13th episode: భయంతో పరుగులు తీసిన శ్రీధర్.. భర్త ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కాంచన!

పుట్టినరోజు సందర్భంగా విషయం చెప్పకుండా భర్త దగ్గర కోరిక తీర్చమని మాట తీసుకుంటుంది పారిజాతం. పుట్టినరోజు నాడు జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్ చేత బలవంతంగా ప్రామిస్ చేయించుకుంటుంది పారిజాతం.తరువాత అలా ఎందుకు చేసావంటూ పారిజాతంపై కోప్పడతాడు కార్తీక్. రోడ్డుమీద యాక్సిడెంట్ చేసి గాయపడిన కావేరీ కూతుర్ని సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 13 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 70వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

త్వరలోనే నీ బిడ్డకి తల్లిని లేకుండా చేస్తాను అంటాడు నర్సింహా.నా బిడ్డ అంటే నాకు ప్రాణం దాని జోలికి వచ్చావంటే ఊరుకోను నాకు తోచిన పని ఏదో చేసుకొని బ్రతుకుతున్నాను, నీకు ఇంతకుముందు పెళ్లి అయిందని, ఒక బిడ్డ ఉందన్న సంగతి మర్చిపో అంటుంది దీప.నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టకుండా ఉండి ఉంటే అలాగే మరిచిపోయేవాడిని నా పెళ్ళాన్ని కొట్టకుండా ఉండి ఉంటే మరిచిపోయే వాడిని కానీ నువ్వు అలా చేయలేదు.

Karthika Deepam 13th June

నేను జరిగింది మరిచిపోవాలంటే నా భార్య ని క్షమాపణ అడిగి నీ కూతురు తీసుకుని ఈ ఊరి నుంచి వెళ్ళిపో అంటాడు నర్సింహ. తప్పు నువ్వు చేస్తే నేను ఎందుకు ఊరు వదిలి పారిపోవాలి నా కూతురికి ఏమైనా జరిగితే నా బుర్ర సరిగ్గా పనిచేయదని మొన్నే తెలిసింది అందుకే నా జోలికి నా కూతురు జోలికి రావద్దు అని హెచ్చరించి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు హాస్పిటల్ లో ఉన్న స్వప్న నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉండడం చూసి నవ్వుకుంటాడు కార్తీక్.

నువ్వు నా బుర్ర తినకు ఆకలి అన్నావు కదా టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను వస్తుంది అది తిను అంటాడు కార్తీక్. మీ పేరెంట్స్ కి ఫోన్ చేశాను అన్నావు కదా ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. అంతలోనే కావేరి అటుగా వెళ్లడంతో స్వప్న ఆమెని పిలుస్తుంది. స్వప్నని చూసి కంగారుపడుతుంది కావేరి, స్కూటీ మీద వెళ్లినందుకు కూతుర్ని కోప్పడుతుంది. తల్లిని ఆగమని చెప్పి కార్తీక్ ని పరిచయం చేస్తుంది స్వప్న.

కావేరి కార్తీక్ కి థాంక్స్ చెప్తుంది, మేము ఈ ఊరు కొత్తగా వచ్చాము మాకు ఇక్కడ ఎవరూ తెలియదు అంటుంది. అప్పుడే టిఫిన్ తీసుకుని వచ్చిన దీప వాళ్ళందరినీ అక్కడ చూసి షాక్ అవుతుంది కార్తీక్ బాబు కి వీళ్ళెవరో తెలిసే మాట్లాడుతున్నారా అని అనుకుంటుంది. అంతలోనే దీప ని చూసిన కార్తీక్ అక్కడే నిలబడ్డావ్ ఏమి అని అడుగుతాడు. టిఫిన్ ఆర్డర్ పెట్టారు బాబు ఎక్కడ అని అడిగితే ఇక్కడ చూపించారు అని అంటుంది దీప. నేనే ఆర్డర్ పెట్టాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 13th June 2024 Episode Number 70 Here is full story

కావేరి దీపని చూసి మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా టిఫిన్ ఆర్డర్ చేస్తారా అంటూ దీపతో జరిగిన గొడవ గురించి కార్తీక్ కి చెప్తుంది. గొడవ ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ ఆమె గొడవ పెట్టుకునే మనిషి కాదు ఇక ఈ విషయాన్ని వదిలేయండి అంటాడు కార్తీక్. డాడీ ఇంకా రాలేదు ఏంటి అంటుంది స్వప్న. అప్పుడే శ్రీధర్ కంగారుగా అక్కడికి వచ్చి దీప కార్తీక్ లని చూసి కంగారుపడి వెనక్కి వెళ్ళిపోతాడు.

దీప నిజం చెప్పేసిందా కార్తీక్ ని అందుకే హాస్పిటల్ కే తీసుకు వచ్చిందా అని అనుకుంటాడు. కానీ స్వప్న మాటల్లో స్వప్నని షేవ్ చేసింది కార్తీక్ అని తెలుసుకుంటాడు. ఏమైనా ఇప్పుడు వీళ్ళ కంటపడితే ప్రమాదంలో పడతాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే కావేరి శ్రీధర్ కి ఫోన్ చేయటంతో ఒక క్లైంట్ దగ్గర ఇరుక్కుపోయాను ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్తాడు.

Karthika Deepam 2 Serial 13th June 2024 Episode Number 70 Here is full story
అకీరా, ఆద్యకు తీవ్ర అవమానం.. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం వేళ ఏం జరిగిందంటే?

సరే అంటుంది కావేరి. కార్తీక్ మాట్లాడుతూ నేను బయలుదేరుతాను నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని స్వప్నకి చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత దీపకి డబ్బులు ఇవ్వబోతుంటే వాళ్ళు ఏమవుతారు అని మీరు డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతుంది దీప. గంట క్రితం వరకు వాళ్ళు ఎవరో తెలియదు, రోడ్డుమీద యాక్సిడెంట్ చేసి దెబ్బ తగిలించుకుంటే తీసుకువచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేశాను అంటాడు కార్తీక్.

ఆ అమ్మాయి చాలా అమాయకంగా అల్లరిగా ఉంది అంటుంది దీప. నాకు కూడా అలాగే అనిపించింది చూస్తే నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండు అనిపించింది అంటాడు కార్తీక్. ఆ అమ్మాయి మీ చెల్లిలే అని మనసులో అనుకొని ఆ అమ్మాయిని సేవ్ చేసి మంచి పని చేశారు అప్పుడప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి కార్తీక్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది దీప. దీప లో మార్పు మొదలైంది అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత ఇంటికి వచ్చిన శ్రీధర్ తో కార్తీక్ స్వప్న నేను సేవ్ చేసిన సంగతి చెప్తుంది కాంచన.

Karthika Deepam 2 Serial 13th June 2024 Episode Number 70 Here is full story
వాడికి ప్రజాసేవ ఎక్కువైపోయింది అని మందలిస్తుంది. మళ్లీ కొడుకుని వెనకేసుకొస్తుంది. ఆ అమ్మాయి ఎవరో స్వప్న అంట చాలా బాగా మాట్లాడుతుందట నాకు చెల్లెలు లా అనిపించిందన్నాడు అంటుంది కాంచన. చెల్లెలు లాంటిది ఏమిటి చెల్లెలే అని కంగారు పడిపోతాడు శ్రీధర్. ఆ అమ్మాయిని భోజనానికి పిలుస్తాను అంటుంది కాంచన. వద్దు అని కంగారుగా అంటాడు శ్రీధర్. అతని ప్రవతనికి ఆశ్చర్య పోతుంది కాంచన ఎందుకు వద్దంటున్నారు అంటుంది.

హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే ట్రీట్మెంట్ చేయించాడు కదా అంతవరకు చాలులే మిగిలిన విషయాలు మనకెందుకు వదిలేయ్ అంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. మరోవైపు ఇంట్లో కూతురికి పాట నేర్పిస్తూ ఉంటుంది దీప. గుమ్మంలో నించోని ఆ పాట వింటాడు కార్తీక్. అది చూసిన శౌర్య ఒకసారి అటు చూడు అని తల్లితో చెప్తుంది. దీప తలతిప్పి చూసేసరికి అక్కడ కార్తీక్ ఉండటంతో షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X