బాయ్‌ఫ్రెండ్‌తో సేద తీరుతున్న శోభా శెట్టి... కాబోయే భర్తను అలా కేరింగ్‌గా..
వెండితెర, బుల్లితెర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతుండగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పెళ్లి మాటెత్తడం లేదు కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, యశ్వంత్. ఇద్దరూ కలిసి అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నా.. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నా వైవాహిక బంధాన్ని వీరిద్దరూ ఎందుకు ఏర్పరచుకోలేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ సందర్భంగా వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు ప్రేమను, అభిమానాన్ని బయటపెట్టుకుంటూ ఉంటారు శోభా శెట్టి - యశ్వంత్. ఈ వివరాల్లోకి వెళితే..
కార్తీక దీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శోభా శెట్టి. ఈ సీరియల్‌లో డాక్టర్ మోనిత పాత్రలో అద్బుతంగా నటించారు. ఆమెను తప్పించి మరొకరినీ ఈ క్యారెక్టర్‌లో ప్రేక్షకులు ఊహించుకోలేరంటే శోభా శెట్టి ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు. ఈ సీరియల్ డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో శోభా శెట్టి ప్రేమలో పడ్డారు. ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు కోసం చివరి వరకు కొట్లాడిన శోభా శెట్టి.. నిజ జీవితంలో మాత్రం డాక్టర్ బాబు తమ్ముడికి పడిపోయింది.

కార్తీక దీపం సీరియల్ ముగిసిన తర్వాత కూడా యశ్వంత్‌తో ఫ్రెండ్‌షిప్‌ను సాగిస్తూ వచ్చారు శోభా శెట్టి. దాంతో ఇద్దరూ ఫ్రెండ్స్ అన్నట్లుగానే అందరూ భావించేవారు. సోషల్ మీడియాలోనూ వీరిద్దరూ కలిసి కనిపించేవారు. అయినప్పటికీ ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాలేదు. కార్తీక దీపం అనంతరం యశ్వంత్ - శోభా శెట్టిలు కలిసి ఒక సినిమాలో నటించారు. బుజ్జి బంగారం అనే చిత్రంలో జోడీగా కనిపించారు. ఇందులో ఇద్దరూ అద్భుతమైన కెమెస్ట్రీ పండించారు. ఇక శోభాశెట్టి.. బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకోవడంతో ఆమెను గెలిపించాలంటూ యశ్వంత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.
అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా శోభాశెట్టి తన ప్రియుడు యశ్వంత్ అని చెప్పి బాంబు పేల్చింది. యశ్వంత్‌ని ఆ రాఘవేంద్ర స్వామి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.. తొలుత నేనే ప్రపోజ్ చేశాను, ఆయన ఒప్పుకోలేదు. కానీ నేను వదలకుండా యశ్వంత్ వెంట తిరగడంతో కొన్నాళ్లకు ఒప్పుకున్నాడు. చివరికి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకున్నాం. అయితే తన తల్లికి అనారోగ్యం కారణంగా వాయిదా వేసుకున్నామని శోభా శెట్టి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎంగేజ్‌మెంట్ జరిగి రెండేళ్లు కావొస్తున్నా శోభా శెట్టి- యశ్వంత్‌ల పెళ్లి జరగలేదు. దాంతో పెళ్లెప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వీరిని ప్రశ్నిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్‌కు పూర్తిగా దూరమైన శోభ.. ఇటీవల హైదరాబాద్‌లో బొటెక్ అండ్ డిజైనర్ స్టూడియోను ప్రారంభించింది. ప్రస్తుతం దీనిని డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు శోభ - యశ్వంత్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభా శెట్టి తన వ్యక్తిగత జీవితం, ఇతర వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో యశ్వంత్, శోభలు ఒక గుడి ఆవరణలో కూర్చొని ఉన్నారు. ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ.. యశ్వంత్ ముఖంపై ఏదో పడితే తుడిచారు శోభ. దీంతో కాబోయే భర్తని ఇప్పటి నుంచే ఎంతో కేరింగ్‌గా చూసుకుంటున్నారంటూ శోభా శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications


