‘రాత్రి 9 గంటలు దాటితే అది కావాల్సిందే.. లేకుంటే ఉండలేను’
దక్షిణాది టెలివిజన్ రంగంలో టాప్ యాక్టర్ కస్తూరి ముక్కు సూటిగా మాట్లాడుతూ ఎన్నో సమస్యల్లో కూరుకుపోతుంటారు. సినిమా రంగంలో నుంచి బుల్లితెర షిఫ్ట్ అయిన తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే తన మాటు తీరు వల్ల కోరి కష్టాలు తెచ్చుకొనే ఈ టాలెంటెడ్ నటి ఎలాంటి పరిస్థితులు ఎదురైన తన తీరు మార్చుకోకుండా ఉంటారనేది ఇండస్ట్రీలో టాక్. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
Kanguva Day 2 Collections: ట్రోల్స్, నెగిటివిటీని ఎదురించిన కంగువ.. సూర్య మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే
కస్తూరి శంకర్ అలియాస్ కస్తూరిగా 1991 సంవత్సరంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో గ్యాంగ్ వార్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. బాలకృష్ణతో నిప్పు రవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య సినిమాల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆకాశ వీధీలో, శమంతకమణి, గాడ్ ఫాదర్, సింబా సినిమాల్లో నటించి మెప్పించారు.

అయితే కస్తూరికి వివాదాలు కొత్త కాదు. వివాదాలు లేకపోతే నిద్రపట్టనంతగా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు. అయితే తాజాగా చెన్నైలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఆమెను ఇబ్బందుల్లో పడేశారు. తెలుగు వారాంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసులు నమోదయ్యాయి. అటు తమిళుల నుంచి తెలుగు వారంతా ఆమె తీరుపై మండిపడుతున్నారు.
ఓ సామాజిక వర్గం సమావేశంలో తెలుగు మహిళలపై నోరుపారేసుకొన్నారనే విషయంపై కస్తూరిపై కేసు నమోదైంది. కఠిన సెక్షన్లపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను శాఖాహారిని. నేను విదేశాల్లో ఉన్నప్పుడు భోజనానికి బాగా కష్టపడ్డాను. అయితే కొన్ని విషయాల్లో నేను కొన్నింటిని వదలుకొన్నాను. అయితే నాకు ఇష్టమైన ఆలుగడ్డలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే నాకు రాత్రి 9 గంటలైతే నాకు ఆలు చిప్స్ తినడం నాకు చాలా ఇష్టం. రాత్రంతా చిప్స్ తిని తెల్లారి ఎందుకు తిన్నానురా అని బాధపడుతుంటాను. ఇప్పుడు నేను వాటిని తినడం మానేశాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications











