Brahmamudi August 5th: అపర్ణ-రుద్రాణిలకు కావ్య ఇచ్చిపడేసిందిగా... భార్య మాటలకు అవాక్కయిన రాజ్
ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఉత్కంఠగా సాగింది. కళావతి పేరు మీద డిజైనర్ గా అపాయింట్ మెంట్ రెడీ చేసి తీసుకురమ్మని మేనేజర్ కి రాజ్ చెప్తాడు. ఈరోజు ఇంట్లో కావ్య వేసే డిజైన్స్ గురించి చెప్పి అందరి ముందు ఆఫర్ లెటర్ ఇవ్వాలని అనుకుంటాడు. అపర్ణ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. చెల్లిని ఇరికించినందుకు తెగ సంతోషపడిపోతుంది. అప్పుడే కావ్య ఇంటికి వస్తుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...?
కావ్య పుట్టింటి నుంచి ఇంటికి వస్తుంది. అపర్ణ ఎక్కడ నుంచి వస్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్న అని కావ్య చెబుతుంది. మరోవైపు స్వప్న నన్ను ఇరికించేసి నిజం చెప్పించాలని అనుకున్నావ్ కదా ఇప్పుడు నిన్నే ఇరికించాను అని చెబుతుంది. ఏం తీసుకుని వెళ్లావ్ మీ ఇంటికి అని ప్రశ్నించగా.. మీరు నాకోసం కాచుకుని కూర్చున్నట్టు ఏదో నేరం చేసినట్టు ఎందుకు అలా అరుస్తున్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను అని చెబుతుంది.

మన డబ్బు మనకి తెలియకుండా పుట్టింటికి చేరవేస్తుంది. నా కొడుక్కి మాయ మాటలు చెప్పి డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి ఇస్తున్నావా లేదా అని అపర్ణ నోరుపారేసుకుంటుంది. నువ్వు ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి ఇస్తున్నావా అని అంటుంది. పుట్టింటి కష్టాలు నా కొడుకు ముందు చెప్పుకుని డబ్బు తీసుకెళ్ళి ఇస్తుంది. ఆస్తి మీద ఆశ లేదంటూనే ఇలా చేస్తుంది. నువ్వు ఇంతకముందు, ఈరోజు డబ్బు తీసుకెళ్ళి పుట్టింటికి ఇచ్చావా లేదా అని అడుగుతుంది.
ఇక రుద్రాణి ఎంటర్ అయి... ఈ అలగా జనమే ఇంత. రాజ్ కి రాహుల్ కి ఎర వేసి నాలుగు రోజులు దూరంగా ఉన్నట్టు నటించి కనకం డబ్బు దండుకోవడం మొదలు పెట్టింది. ఏ ఆడది అయినా కూతురు డబ్బు తీసుకుంటుందా? ఇన్నాళ్ళూ టైమ్ తీసుకుని నువ్వు ఇప్పుడు డబ్బు చేరవేస్తున్నావ్ అంటుంది. దానికి కావ్య కల్పించుకుని ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు. చేరవేసే అలవాటు నాకు లేదు. ఫ్రీగా ఇస్తే తీసుకునే అలవాటు వాళ్ళకి లేదు. మీరంతా అపార్థం చేసుకుంటున్నారు. కనీసం నేను చెప్పేది కూడా వినరా? అని చెబుతుంది. కావ్య రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.

కావ్య మాట్లాడుతూ... పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కూతురికి పుట్టింటితో సంబంధాలు తెంచుకోవాలా? మీరు అన్నట్టు ఆ డబ్బు ఈ ఇంటి నుంచి తీసుకెళ్లింది. కానీ నేనేమీ ఫ్రీగా తీసుకెళ్లలేదు. ఆ డబ్బు నా కళకి ఇచ్చిన ప్రతిఫలం. ఆఫీసులో కావాల్సిన డిజైన్స్ వేసినందుకు మీ అబ్బాయి నాకు ఇచ్చిన పారితోషకం. నేనేమీ దోచుకోలేదు అని చెబుతుంది. కాసేపు కావ్య, అపర్ణ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
కృష్ణమూర్తి దగ్గరకి శ్రీనివాసరావు వచ్చి కస్టమర్స్ బొమ్మలు ఆర్డర్ ఇవ్వమని చెప్పారని అంటాడు. మీరు లాస్ట్ టైమ్ చేసినట్టు ఈసారి డిజైన్ చేసివ్వాలి. వెయ్యి విగ్రహాలు చేయాలని అంటాడు. చేసి ఇస్తానని కృష్ణమూర్తి చెప్తాడు. కావ్య ఎక్కడని అతను అడుగుతాడు. కావ్య చేసిన డిజైన్స్ నచ్చడం వల్ల ఈ కాంట్రాక్ట్ ఇద్దామని వచ్చాను, వీలైతే తనని పిలవమని చెప్తాడు. అది కుదరదని అనేసరికి అయితే కాంట్రాక్ట్ కావ్య ఉంటానంటేనే ఇస్తానని అంటాడు. నా మీద నమ్మకం ఉంటేనే కాంట్రాక్ట్ ఇవ్వండి అంటాడు కృష్ణ మూర్తి. మా అమ్మాయిని మాత్రం పిలవలేను అని చెబుతాడు.
Free OTTs: నో సబ్ స్క్రిప్షన్.. ఈ ఓటీటీల్లో ఫ్రీగా మూవీస్ చూడొచ్చు.. మీరూ ట్రై చేస్తారా?
ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్ తను లేకుండా నేను ఇవ్వలేను. ఏదైనా తేడా వస్తే నేను రోడ్డున పడతాను. వేరే వాళ్ళకి ఇస్తాను అని శ్రీనివాస రావు చెప్పి వెళ్తాడు. అమ్మాయితో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని కనకం చెబుతుంది. నేను అడిగితే కావ్య వస్తుంది. కానీ అక్కడ సమస్యలు వస్తాయి. పెద్ద ఇంటి కోడలు ఇలాంటి పనులు చేస్తుందని తెలిస్తే వాళ్ళకి అవమానం కదా. అయినా కావ్య సంపాదించి పంపిస్తానని చెప్పింది అదే గొప్ప అని కృష్ణ మూర్తి చెబుతాడు. ఇక ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ప్రోమోలో రాజ్.. డిజైనర్ గా ఆఫర్ లెటర్ ఇస్తే.. కావ్య తిరస్కరిస్తుంది.


Click it and Unblock the Notifications











