Krishna Mukunda Murari: మురారి దిమ్మతిరిగే ప్లాన్.. నిజం చెప్పేసిన ముకుంద.. భవానీకి డౌట్ రావడంతో!
దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఏం జరిగిందంటే : రింగ్‌ల విషయంలో ముకుంద చెప్పిన మాటలను ఆదర్శ్ నమ్మేస్తాడు. దీనిపై మురారి, కృష్ణ చర్చిస్తారు. వాళ్లు కూడా ముకుంద మారిందనే అనుకుంటారు. కానీ, భవానీ దేవి మాత్రం ముకుంద మారలేదని, తన కొడుకుకు అన్యాయం చేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది.
అప్పుడే రేవతి వచ్చి వాళ్లకు పెట్టుడు ముహూర్తంతో శోభనం జరిపించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. కానీ, దీనికి భవానీ మాత్రం ఒప్పుకోదు. పైగా ఆమెపై సీరియస్ అవుతుంది. తర్వాత ఈ విషయం కృష్ణకు చెప్పడంతో ఆమె వచ్చి భవానీని అడుగుతుంది. ఆమెపై కూడా భవానీ కోప్పడుతుంది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!

కృష్ణ మాటకు షాకైన మురారి : శోభనం గురించి మురారి 'పెద్దమ్మ మన సంగతి మనల్ని చూసుకోమని చెప్పారు కదా. శోభనం చేసేసుకుందాం' అని అంటాడు. దీనికి కృష్ణ 'మీరు తిట్టను కొట్టను అంటే ఒక విషయం చెప్తాను. ఇన్నాళ్ళూ ఆగింది మా సంగతి మేము చూసుకోవడానికా పెట్టుడు ముహూర్తాలు అక్కర్లేదు. రెండు జంటలకు కలిపి అదే ముహూర్తానికి చేసుకుంటాం అని చెప్పాను' అంటుంది. దీంతో మురారి షాకైపోతాడు. అప్పుడు సరదాగా కొట్టబోతే కృష్ణ భయపడి పారిపోతుంది. వెంటనే ఆమెను పిలిచి పంతులు పెట్టిన ముహూర్తానికి పెద్దమ్మ ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అంటాడు.
మురారి అదిరిపోయే ఐడియా : మురారి అడిగిన దానికి కృష్ణ 'పెద్దత్తయ్యకు ముకుంద మీద ఇంకా నమ్మకం కలగలేదు. వాళ్ళిద్దరూ బాగాలేరు అనే భ్రమ తొలగించి బాగున్నారు అనే నమ్మకం కలిగించాలి' అని చెప్తుంది. దీంతో మురారి 'ఇందాక గోపి ఫోన్ చేశాడు. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నాడంట. మనల్ని పార్టిసిపెట్ చేయమని అడిగాడు. మనతో పాటు ఆదర్శ్, ముకుంద పేర్లు కూడా ఇస్తే పెద్దమ్మ అనుమానాలు పటాపంచలు అయిపోతాయి' అని ఐడియా ఇస్తాడు. అప్పుడు కృష్ణ ఇది డెఫినెట్ గా వర్కవుట్ అవుతుందనగా.. వాళ్లు గెలిచేలా మ్యానేజ్ చేద్దాం అని మురారి అంటాడు.
ముకుందకు మురారి షాక్ : కృష్ణ వంట చేసి ఎలా ఉందని అడుగుతుంది. దీంతో భవానీ 'ఏమైంది నీకు ఈరోజే వంట నేర్చుకున్నట్టు వండావ్ ఏంటి' అని అడుగుతుంది. అప్పుడు మురారి 'మాములుగా అయితే ఇలా చేయవు కదా. ఏ తింగరి ఏమైంది' అని అడుగుతాడు. అప్పుడు నందినీ కృష్ణకి వంటలో హెల్ప్ చేసింది తనేనని చెప్తుంది. అప్పుడు మధు వాళ్లకు కౌంటర్లు వేస్తాడు. ఆ తర్వాత మురారి 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌లో ముకుంద, ఆదర్శ్ పేర్లు ఇచ్చాం' అని చెప్తాడు. దీంతో ముకుంద షాక్ అయిపోతుంది. దీంతో మా పేర్లు ఎందుకు నువ్వు కృష్ణ పార్టిసిపెట్ చేయవచ్చు కదా అంటుంది.

ఇష్టం లేదన్న ముకుంద : ముకుందతో కృష్ణ 'మా పేర్లు ఇచ్చాం.. మాతో పాటు మీ పేర్లు కూడా ఇచ్చాం' అని చెప్తుంది. అప్పుడు తొండ సంగతి, ఉంగరం సంగతి అన్ని తేలిపోతాయని మధుకర్ అనుకుంటాడు. ఆదర్శ్ కాంపిటీషన్‌లో పార్టిసిపెట్ చేయడానికి తనకి ఒకేనని చెప్తాడు. ముకుంద మాత్రం మౌనంగా ఉంటుంది. దీంతో భవానీ ఎవరిని బలవంతం చేయవద్దంటుంది. దీనికి ముకుంద 'అలా ఏం లేదు.. ఆదర్శ్ ఇప్పుడే కదా వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు' అంటుంది. దీంతో మధు కల్పించుకుంటాడు. అప్పుడు ముకుంద అవును మధు ఇష్టం లేకే అని చెప్పడంతో షాక్ అవుతారు.
కట్టుకథ అల్లేసిన ముకుంద : ఆ తర్వాత ముకుంద 'ఇష్టం లేదంటే ఆదితో కలిసి పార్టిసిపెట్ చేయడమని కాదు. అక్కడ ఎవరైనా ఏమైనా అంటే ఆది తట్టుకోలేడెమో అని అలా అన్నా' అని చెప్తుంది. దీంతో రేవతి 'ఆదర్శ్‌ను ఎవరు ఏమని అంటారు' అని అడుగుతుంది. దీనికామె 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌లో ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండే దంపతులను తీసుకుంటారు. కానీ మేము కలిసి ఉన్నది లేదు. పెళ్ళైన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారని అడిగితే ఏం చెప్పాలి? అందరి ముందు తల దించుకోవడం తప్ప చెప్పడానికి సమాధానం ఏముంటుంది' అంటుంది.
ఎలా తప్పించుకోవాలని : ముకుంద మాటలకు మురారి 'నువ్వు చెప్పింది కరెక్టే ముకుంద. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండే కపుల్స్ బెస్ట్ కపుల్ అయితే లోకంలో 90 శాతం మంది బెస్ట్ కపుల్ కావాలి. కానీ అందరూ అవరు కదా. వందేళ్లు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా బెస్ట్ కపుల్ కాలేరు. బెస్ట్ కపుల్ అంటే ఎంత కాలం కలిసి ఉన్నామనేది కాదు ఉన్న దూరాన్ని అధిగమించి ఎలా కలిసి ఉన్నామనేదని' అని అంటాడు. దీంతో ముకుంద 'రింగ్ పెట్టడం దగ్గర నుంచి తప్పించుకున్నానని అనుకుంటే ఈరోజు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంటున్నారు. ఈరోజు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి' అనుకుంటుంది.

భవానీలో పెరిగిన డౌట్ : ముకుంద తీరుపై భవానీ 'ఎవరు ఏమైనా అంటే ఆదర్శ్ ఫీల్ అవుతాడనే వద్దు అని చెప్పిందా? లేకపోతే వెళ్ళడం ఇష్టం లేకనా? ఆదర్శ్‌కు ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళడం ఇష్టం. నైట్ బయటకు వెళ్ళడం మరీ ఇష్టం. కానీ ముకుంద ముందే కలుగజేసుకుని వద్దని చెప్పించింది. ఆదర్శ్ కాదనలేక నీ ఇష్టం అన్నాడు. మొన్న ఇలాగే పెట్టమని రింగ్ ఇస్తే పెట్టమని కృష్ణకి ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే తన మీద అనుమానం రోజురోజుకీ పెరిగిపోతుంది' అనుకుంటుంది. ఆదర్శ్‌కు కూడా డౌట్ రావడంతో ముకుంద అబద్దాలు చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











