Brahmamudi March 6th కావ్యపై ప్రేమను బయటపెట్టిన రాజ్.. మళ్లీ మోడలింగ్ మొదలెట్టిన స్వప్న!
నేటి బ్రహ్మముడి సీరయల్ లో రాజ్‌కు శ్వేత ఫోన్ చేస్తుంది. అత్తారింటికి వెళ్లిన తర్వాత నన్ను మర్చిపోయావని శ్వేత అంటుంది. ఇది అత్తారిళ్లులా లేదు అండమాన్ జైలులా ఉందని, నవ్వుతూనే అందరూ నరకం చూపిస్తున్నారని రాజ్ అంటాడు. మరి అక్కడ ఉండటం ఎందుకు వచ్చేయచ్చుగా అని శ్వేత సలహా ఇస్తుంది. నాకు రావాలనే ఉందని... కానీ ఇంటి అల్లుడు తొందరగా వెళ్లడం ఏంటి అని అత్తమామలు మర్యాదలు చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటాడు.
ఈగో వల్లే ఒప్పుకోవడంలేదు: కానీ భాస్కర్ ఇక్కడ ఉండటమే నాకు నచ్చడం లేదని రాజ్ చెప్పుకువస్తాడు. వాళ్లు పిలవకుండానే జెలసీతో నువ్వు అక్కడికి వెళ్లావు కదా రాజ్ నాటకం మొత్తం కనిపెట్టేస్తుంది శ్వేత. నువ్వు చాలా మారిపోయావని రాజ్‌తో అంటుంది శ్వేత. కావ్యకు రెస్టారెంట్లో ఆమె బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడోనని తెగ టెన్షన్ పడ్డావు.. ఇప్పుడు కావ్య తన బావతో పుట్టింటికి వెళుతుందని తెలిసి నువ్వు కూడా ఆమెతో పాటు అక్కడికి వెళ్లావని శ్వేత అడుగుతుంది. ఈగో వల్ల ఒప్పుకోవడం లేదు కానీ నీ నిజానికి నీ మనసులో కావ్య పట్ల చాలా ప్రేమ ఉందనిపిస్తుందని చెప్తుంది.
Photo Credits: Disney +hotstar

శ్వేత డౌట్: అలాంటిదేం లేదని, కావ్య నా లైఫ్‌లో నుంచి వెళ్లిపోవడం ఖాయమని రాజ్ చెప్పుకువస్తాడు. సరే అసలు ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఎందుకొచ్చాడు. పని మీద వచ్చాడా? లేదంటే నువ్వు కావ్య విడిపోతున్నారని తెలిసి అమెరికా నుంచి ఇండియా వచ్చాడా అని రాజ్ కు శ్వేత చెప్తుంది. గతంలో కావ్యను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కోల్పోయిన ప్రేమను తిరిగి దక్కించుకోవడానికే వచ్చాడా అన్నది నువ్వు తెలుసుకో అని చెప్తుంది. అంత మంచి అమ్మాయి ఒక్కసారి నీ జీవితం నుంచి వెళ్లిపోతే ఎప్పటికీ తిరిగి రాదని అంటుంది శ్వేత. శ్వేత అడిగిన వాటికి ఏం చెప్పాలో తెలియక రాజ్ సైలెంట్ అవుతాడు.
కల్యాణ్ పై సెటైర్స్: మరోవైపు కవితల పబ్లిషింగ్ కోసం కల్యాణ్ వెళ్లిన కల్యాణ్ ఇంటికి వస్తాడు. అక్కడ ఏం జరిగిందో తండ్రికి చెప్తుంటాడు. ఈలోపు అనామిక వచ్చి సెటైర్స్ వేస్తుంది. నీ లైఫ్ మొత్తం వెయిట్ చేసినా నీ కవితల్ని ఎవరూ ప్రింట్ చేయరని అంటుంది అనామిక. కాలంతో అందరూ పరుగులు పెడుతోన్న టైమ్‌లో మీ అబ్బాయి ఇంక కవితల దగ్గరే ఆగిపోయాడని అంటుంది అనామిక. నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని అనామికకు బదులిస్తాడు కల్యాణ్.

రాజ్ ను ఏడిపించేందుకు: ఇప్పటికైనా కళ్లు తెరిచి... మీ అన్నయ్యలా ఆలోచించమని సలహా ఇస్తుంది అనామిక. అతడిలా గొప్పగా బతకడంపై దృష్టిపెట్టమని భర్తకు సలహా ఇస్తుంది అనామిక. నువ్వు అంటున్న గొప్పతనం డబ్బు, ఇలాంటి బంగళాలో బతకడం వల్ల రాదని అనామికకు ధీటుగా బదులిస్తాడు కల్యాణ్. మొదటిరోజు కాబట్టే ఇలా మొండిగా వాదిస్తారు. నెల రోజుల్లో నువ్వే నా దారికి వస్తావని కోపంగా అనామిక అక్కడి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను మళ్లీ ఏడిపించాలని కావ్య, భాస్కర్ అనుకుంటారు. రాజ్ ముందు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు.
భర్తతో విడాకులు... అసలేం జరిగిందో చెబుతూ నయనతార ఎమోషనల్ వీడియో పోస్ట్!
కావ్యపై ప్రేమ చూపించిన రాజ్: ఎంతైనా మన అల్లుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేదని కృష్ణమూర్తి అంటాడు. మన అల్లుడు కాదు..మేనల్లుడు అంటూ కృష్ణమూర్తిపై రాజ్ ఫైర్ అవుతాడు. బావ అంటు అప్పు పిలుస్తుంది. ఏంటి అని రాజ్ వెటకారంగా అంటాడు. నిన్ను కాదు అంటూ భాస్కర్ దగ్గరకు వెళుతుంది. కావ్య, నువ్వు కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంటుందని భాస్కర్‌తో అంటుంది. నీతో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తే రాజ్ ఏమనుకోడని చెబుతుంది. భాస్కర్‌తో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తుండగా నిప్పుపై అడుగుబేయబోతుంది.

రుద్రాణిని డబ్బులడిగిన స్వప్న: కావ్య ఎక్కడ నిప్పుపై అడుగువేస్తుందోనని రాజ్ చేతితో దాన్ని నెట్టివేస్తాడు. అది కాస్త భాస్కర్ కాలి కిందకు వెళ్తుంది. రాజ్ చేతికి, భాస్కర్ కాలుకు గాయం అవుతుంది. కావ్య ప్రేమను చూపిస్తున్నా వినకుండా రాజ్ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు క్రెడిట్ కార్డ్ బిల్ యాభై వేలు రావడం చూసి స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ డబ్బులను రుద్రాణిని అడగాలని అనుకొని ఆమె రూమ్‌కు వెళుతుంది. అప్పుటికే డబ్బుల కోసం రుద్రాణిని బతిమిలాడుతుంటాడు రాహుల్.
అత్తకు అల్లుడు పాఠాలు: రుద్రాణిని డబ్బుల కోసం నిలదీస్తుంది స్వప్న. తన దగ్గర డబ్బులు లేవని, ఉన్న ఇవ్వనని రుద్రాణి మొండిగా పట్టుపడుతుంది. డబ్బులు ఎలా, ఎవరి నుంచి రాబట్టుకోవాలో నాకు తెలుసు అని స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భాస్కర్ నడవలేకపోవడాన్ని కనకం చూసి... మన అల్లుడు నడవలేకపోతున్నాడు అంటూ అరుస్తుంది. భాస్కర్‌ను కనకం అల్లుడు అని పిలవడం రాజ్ సహించలేకపోతాడు. దీంతో కనకంకు అల్లుడు అనే పదంపై పాఠాలు చెప్పినట్లు ఊహించుకుంటాడు. మనల్లుడు, మేనల్లుడి పదాలకు అర్థం వివరిస్తాడు.
స్వప్న మోడలింగ్: మరోవైపు డబ్బుల కోసం మోడలింగ్ చేయాలని స్వప్న అనుకుంటుంది. ఇంట్లోనే ఫొటోషూట్ ఏర్పాటుచేస్తుంది. ఆమె ఫొటోషూట్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ అడ్డుకుంటారు. తనకు డబ్బులు అవసరం అయ్యాయని, భర్తతో పాటు అత్తయ్యను డబ్బులు అడిగితే పుట్టింటి నుంచి తెచ్చుకోమంటున్నారని స్వప్న అంటుంది. మీ పుట్టింటివారే మా దయాదాక్షణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారని స్వప్నపై సెటైర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. డబ్బుల కోసమే కళ్యాణ్‌ను పెళ్లిచేసుకోవాలని అప్పు అనుకున్నదని అనామిక కూడా నోరుజారుతుంది. దీంతో రాజ్ అనామిక అంటూ ఫైర్ అవుతాడు.


Click it and Unblock the Notifications










