కీరవాణి ఒక వ్యభిచారి.. 40 ఏళ్లుగా ఇలా చేశాడు.. ప్రవస్తి వివాదంపై ప్రముఖ దర్శకుడు
సింగర్ ప్రవస్తి.. ఇప్పుడీ పేరు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారింది. లెజెండరీ సింగర్, దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన 'పాడుతా తీయగా' సింగింగ్ రియాలిటీ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన గాత్రంతో చిన్నప్పటి నుంచి ఆడియెన్స్ ను, సంగీత ప్రియులను ఆకట్టుకుంది. బాల సుబ్రహ్మణ్యంతో పాటు సుశీల, జానకమ్మ లాంటి లెజెండరీ సింగర్స్ ఆమె గాత్రానికి ప్రశంసలు కురిపించారు. ఎంతోగానో పొగిడి మంచి పలు సలహాలు, సూచనలు చేస్తూ సింగర్ గానూ తీర్చిదిద్దారు.
అయితే, ఈ పాపులర్ సింగింగ్ షోకు బాల సుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా ఉండే వారు. ఆయన తదనంతరం కొడుకు ఎస్పీ చరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా షోలో ఆయన లెగసీని కొనసాగిస్తున్నారు. ఈ షోకు సునీత, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ వంటి స్టార్ సింగర్స్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈషో సిల్వర్ జూబ్లీ సిరీస్ అద్భుతంగా సాగింది. అందులో ఆస్కార్ విన్నర్, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కూడా జడ్జీగా వ్యవహించారు.

అయితే ఇటీవలనే ఈషో నుంచి ప్రముఖ సింగర్ ప్రవస్తి ఎలిమేట్ అయ్యింది. వెంటనే షోలో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వచ్చింది. షోలో జడ్జీలు తనను చీడ పురుగులా చూశారని, ప్రొడక్షన్ వారు తనను బాడీ షేమింగ్ కు గురి చేశారని, చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకోమని ఇబ్బంది పెట్టారని చెప్పింది. ఎంఎం కీరవాణి, సునీత, చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని ఆరోపించింది. దీనిపై సునీత ఇప్పటికే స్పందించి తన వెర్షన్ వినిపించింది. కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కూడా స్పందించారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ సింగర్ ప్రవస్తి వివాదంపై స్పందించారు. ఈ విషయంలో సింగర్ ప్రవస్తికి గీతా కృష్ణ మద్దతు ఇచ్చారు. ఈక్రమంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి వ్యభిచారి, పెద్ద వ్యభిచారి నాకు ఏడెనిమిది ఏళ్లుగా బాగా పరిచయం, అంతకంటే ముందే 40 ఏళ్లుగా అతని వేషాలు తెలుసు. తెలిసినా కూడా ఎందుకులే అని చెప్పలేదు. నేనే కాదు చాలా మంది అతని గురించి డైరెక్ట్ గా చెప్పారు. అతనిపై దుమ్మెత్తి పోయాల్సిన అవసరం నాకేంటి అని సైలెంట్ గా ఉన్నాను. ఇటీవల పెద్దోడయ్యాక మాట్లాడటం మానేశాడు.
అజిత్ ప్రేయసి గురించి తెలుసా? బ్రేకప్ తర్వాత ఆమె కెరీర్ క్లోజ్.. అన్ని వదిలేసుకొని
అమ్మాయిలను సప్లై చేసే వారితో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగే వాడంట. అతనిపై ఫోక్సో కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు... ప్రస్తుతం గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చకు దారి తీశాయి. ఇక ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీర్తి పొందుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రంలో 'నాటు నాటు' సాంగ్ ను అందించి ప్రపంచ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఏకంగా ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు - ఎంఎం కీరవాణి రాబోయే చిత్రం ఎస్ఎస్ఎంబీ29కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో సంగీతం సమకూర్చే పనిలో బిజీ అయ్యారు. ఇలోగా ఇలా ప్రవస్తి ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు.


Click it and Unblock the Notifications











