Naga Panchami 26th January: ఫణీంద్రను కరుణించిన నాగ దేవత.. మేఘనే కరాళీ అని తెలియనుందా?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీదు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నాగ దేవత శాపానికి గురైన పంచమి, ఫణీంద్రలు.. బాధతో కుమిలిపోతుండగా.. తాజాగా ఫణీంద్ర నాగ దేవతను వేడుకున్నాడు. ఒంటికాలుపై నిలబడి మరీ ధ్యానం చేయడంతో మెచ్చిన నాగ దేవత ఆయనకు శక్తులను తిరిగి ప్రసాదించింది. ఈక్రమంలోనే పంచమితో కలిసిన ఫణీంద్ర... తమను మోసం చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈక్రమంలోనే పట్నం వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
అయితే ఈ లోకంలో తనను ఎవరైనా మోసం చేసే వాళ్లు ఉన్నారు అంటే అది ఒక్క కరాళీయే అని ఆమెకు మాత్రమే అనేక మంత్ర శక్తులు ఉన్నాయని పంచమి అంటుంది. అదంతా విన్న ఫణీంద్ర కూడా ఆ శక్తి ఏంటో తెలుసుకుని ఆమెను నాగ దేవత వద్దకు తీసుకెళ్లి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలని అంటాడు. అప్పుడు నాపై పడిన మచ్చ పోతుందని చెబుతాడు. సరే అనుకున్న పంచమి కూడా అతడితి కలిసి వెళ్లేందుకు ఓకే చెబుతుంది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ ప్రారంభం కాగానే.. పంచమి సుబ్బుతో మాట్లాడుతూ కనిపిస్తుంది.

నేను మోక్షతో కలవను.. కలవలేను అంటూ చెప్పగా.. పంచమి నిద్రలో ఉన్నట్లు చూపిస్తారు. ఇక ఆ తర్వాత తల్లి లేపగా.. అది కళ అని గుర్తిస్తుంది. ఇక ఆ తర్వాత పంచమి తన భర్త సుఖంగా ఉండాలని దేవుళ్లను కోరుకుంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర ఒంటి కాలుపై నిల్చొని మరీ ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఆయన కఠోర దీక్షకు కరుణించిన నాగ దేవత వెంటనే ప్రత్యక్షం అవుతుంది. నీ తపస్సును మెచ్చాను ఫణీంద్ర అని నాగ దేవత చెప్పగా.. ఫణీంద్ర సంతోషపడిపోతాడు. తాను ఏ తప్పూ చేయలేదని.. తనను, యువరాణిని ఎవరు మోసం చేశారో నిరూపించుకుంటానని అంటాడు.
అయితే అలా నిరూపించుకోవాలంటే తనకు కొన్ని శక్తులు అవసరం అవుతాయని.. వాటిని అర్ధం చేసుకుని శక్తులు ప్రసాదించమని అంటాడు. అందుకు నాగ దేవత సరేనని అంటుంది. శక్తులను ప్రసాదిస్తుంది. కానీ ఆ శక్తులను దుర్వినియోగం చేసినా.. నువ్వే తప్పు చేస్తున్నట్లు తెలిసినా అస్సలే ఊరుకోను.. అందుకు తగ్గ పెద్ద శిక్షలను కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుందని అంటాడు. ఇందుకు ఓకే చెప్పిన ఫణీంద్ర శక్తులను పొంది.. నేరుగా పంచమి వద్దకు వెళ్తాడు. నా వల్లే నీ శక్తులు పోయి.. ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందంటూ పంచమి బాధ పడుతుంది.

అప్పుడు ఫణీంద్ర అలాంటిదేమీ లేదు పంచమి నాకు శక్తులు తిరిగి వచ్చాయి.. మనల్ని మోసం చేసింది ఎవరో నాగదేవతకు తెలిస్తే మన సమస్యలు అన్నీ తీరిపోయినట్టేనని అంటాడు. అయితే తమను అడ్డుకున్న శక్తి కరాళీయే అని ఆమెను పట్టుకోవాలని పట్నం బయలు దేరుతారు. అంతకంటే ముందే మోక్ష పంచమి కోసం నాగుల వరానికి రావడం.. పంచమి తాను అస్సలే మోక్షతో కలవనని చెప్పడం జరుగుతంది. తనకోసం ఇక్కేడ ఉంటే తాను చనిపోయినట్లేనని పంచమి చెప్పడంతో మోక్ష బాధతో వెనుదిరుగుతాడు.
OTTలోకి రాబోతున్న రీసెంట్ సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
https://telugu.filmibeat.com/ott/vijay-sethupathi-merry-christmas-movie-ott-streaming-date-fixed-check-details-131941.html
మరోవైపు మోక్ష ఇంట్లో లేడని గుర్తించిన కుటుంబ సభ్యులు.. పంచమి వద్దకే వెళ్లి ఉంటాడని భావిస్తారు. అతడు చాలా తప్పు చేస్తున్నాడని ఫైర్ అవుతారు. అలాగే పోనీ.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా ఇంటికే తిరిగి వచ్చేస్తాడని వైదేహి అంటుంది. మోక్ష, పంచమిలను అలా విడగొట్టడం మంచిది కాదని మోక్ష తండ్రి చెప్పగా.. తన కొడుకు సంతోషమే తనకు ముఖ్యం అంటూ వాదిస్తుంది. ఆ తర్వాత మేఘన దేవుడికి పూజ చేయడం.. దాన్ని చూసి వీరంతా మురిసిపోవడం మనం చూడవచ్చు.


Click it and Unblock the Notifications











