Naga Panchami: మోక్షను చంపి పంచమిని నాగలోకానికి తీసుకెళ్లేందుకు వస్తున్న నాగులు.. ఏం జరగబోతుంది?

Naga Panchami November 10th Episode: నాగ పంచమి సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో అద్భుతమైన ట్విస్టులు చోటుచేసుకుంటూ ప్రతీ ఎపిసోడ్ లోనూ ఆసక్తిరమైన సన్నివేషాలను చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు అంతా చాలా ఆసక్తిగా సీరియల్ చూస్తున్నారు. అయితే రేపటి ఎపిసోడ్ లో నాగ దేవత నాగులతో మాట్లాడుతుంది. పంచమి మానవ సంబంధాలకు రుణపడి నాగలోకానికి వచ్చేందుకు అయిష్టత చూపుతోందని.. ఆమెకు ఇక్కడకు రావడం ఏమాత్రం ఇష్టం లేదని వివరిస్తుంది. అది విన్న ఓ నాగరాజు.. యువరాణిని తానే స్వయంగా నాగ లోకానికి తీసుకు వస్తానని.. మోక్షను చంపేస్తామని చెబుతాడు. ఏం చేసైనా సరే ఆమెను తీసుకొచ్చి యువరాణి పీఠంపై కూర్చోబెడతానని అంటుంది.

ఇదంతా ఇలా ఉండగా.. మరోవైపు పంచమి తన భర్తను ఎలా కాపాడుకోవాలా అని తెగ ఆలోచిస్తుంది. నాగుల నుంచి మోక్షను కాపాడుకునేందుకు తన శక్తులు సరిపోవని... ఈ సమయంలో తనకు దేవుడే దిక్కు మనసులోనే స్వామి వారిని కోరుకుంటుంది. పంచమి ఇలా కోరుకుంటుండగానే... సుబ్బు ఓ చోట కూర్చొని ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. అలా చూపించడం చూస్తుంటేనే పంచమి సమస్యను తీర్చబోయేది సుబ్బుయేనని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Naga Devatha Said The Nagas to Kill Moksha And Bring Panchami to Nagalokam on November 10th Episode Number 197 in Naga Panchami Telugu Serial

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా.. చిత్ర, జ్వాలలు కూర్చున్న కుర్చీలోంటి లేచే ప్రయత్నాలు చేస్తారు. అప్పుడే అక్కడకు సుబ్బు, శిశిరలు వస్తారు. అయితే మోక్షతో పాటు పంచమిలను చంపాలని వారిద్దరూ ప్లాన్ చేసుకోవడం విన్న సుబ్బుయే వారికి ఈ శిక్ష వేశాడు. మీరు ఎవరికైనా కీడు చేయాలనుకుంటేనే ఇలా జరుగుతుందని.. తప్పు అయిపోయిందని లెంపలు వేసుకుంటే మీరు సులువుగా లేస్తారని చెప్పగా.. ముందుగా చిత్ర మనసులోని తప్పయిందని చెప్పి లేస్తుంది. ఆ తర్వాత జ్వాల కూడా అలాగే చేసి కుర్చీలోంచి బయటకు వస్తుంది.

ఇక ఆ తర్వాత మోక్ష నానమ్మ అయిన శబరి, ఆమె కూతురు పంచమి వద్దకు వచ్చి సమస్య ఏంటని అడుగుతారు. మోక్ష ఎందుకలా మాట్లాడుతున్నాడని ఆరా తీస్తారు. అలాగే నువ్వు నిజంగానే వాడిని కాపాడగలవా అని ప్రశ్నిస్తారు. మీ మధ్య ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తుందని వారు అనగా... అదేం లేదని తన ప్రాణాలను అడ్డు వేసైనా సరే భర్త మోక్ష ప్రాణాలు కాపాడుకుంటానని చెబుతుంది. ఇక ఆ తర్వాత గదిలోకి వెళ్లగా.. మోక్ష నేను ఎందుకు చనిపోవాలి పంచమి అంటూ అడుగుతాడు. తీవ్ర ఆవేదన చెందుతూ... తనను పాము ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పాలని కోరుతాడు. అందుకు స్పందించిన పంచమి కారణం చెబుతుంది.

చిన్నప్పుడు మీరు ఓ పాముని కొట్టారు కదా... ఆ పాము శాపం వల్లే మీకు ఈ పరిస్థితి అని వివరిస్తుంది. అయితే ఆ జాతి పాముల పగ, ప్రతీకారం చాలా కఠినంగా ఉంటాయని... ఈ పంచమి మీ ప్రాణాలు కాపాడేందుకు ఉందని వివరిస్తుంది. ఓ భార్యగా మీ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యత అని చెబుతుంది. దానికి మోక్ష కూడా చాలా హ్యాపీగా ఫీలవుతునే టెన్షన్ పడతాడు. భార్య గురించి ఆలోచిస్తాడు. ఇక ఆ తర్వాత కరాళీని చూపిస్తారు. తాను కోల్పోయిన శక్తులు తిరిగి తెచ్చుకునేందుకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంది.

Naga Devatha Said The Nagas to Kill Moksha And Bring Panchami to Nagalokam on November 10th Episode Number 197 in Naga Panchami Telugu Serial

దీంతో అమ్మవారు ప్రసన్నం కాగా.. తాను గతంలో కోల్పోయిన శక్తులు తిరిగి కావాలని వేడుకుంటుంది. కానీ అలా కదరదు అని... లోక కల్యాణం కోసం అయితే ఆ పని చేస్తానని చెబుతుంది. కానీ నువ్వు దుష్టడు అయిన నీ అన్నకోసం ఇలా చేస్తున్నావు కాబట్టి.. నానుంచి ఎలాంటి వరాలు పొందలేవని చెబుతుంది. నాగమణి గురించి, నీ అన్నను బతికించడం గురించి మర్చిపోవాలని హెచ్చరించి మాయమైపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X