భర్తను కాటేసి నాగలోకానికి వెళ్లిపోతున్న పంచమి.. మోక్షను కాపాడేదెవరు?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 1వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష పంచమిపై చేయి చేసుకోగా.. ఆమె ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అయితే తల్లి పంపించినట్లు తెలుసుకున్న మోక్ష చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. తాను అలా చేసుండకుంటే బాగుండేదని అనుకుంటాడు. అమ్మా అలా ఎందుకు చేశావు.. నా భార్యే నా ప్రాణం అంటూ తన మనసులోని ప్రేమను కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. తాను ఎక్కడ ఉందో వెతికే ప్రయత్నాలు చేస్తాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 1st to January 6th episode

జనవరి 2వ తేదీ ఎపిసోడ్ లో.. భర్త కొట్టడం, అత్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుంటుంది పంచమి. సుబ్రహ్మణ్య స్వామి పాదాలపై పడి తల పగులకొట్టుకుంది. అప్పుడే సుబ్బు వస్తాడు. పంచమి సమస్యలు అడిగి తెలుసుకుని.. చనిపోవడం తప్పు అని అంటాడు. అయినా చిన్న చిన్న సమస్యలకు చనిపోవడం చేయకూడదు.. ఆ భగవంతుడు ఇచ్చిన జన్మను ఆయనే తీసుకుంటాడని పేర్కొంటాడు.

లేటు వయసు ఘాటు అందాలు.. 48 ఏళ్ల వెంకీ మామ బ్యూటీని గుర్తు పట్టారా?
జనవరి 3వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి ఏమైపోయిందో తెలుసుకునేందుకు ఫణీంద్ర మేఘన వద్దకు వస్తాడు. ఆమెతో మాట్లాడుతూ.. పంచమి చనిపోయితే ఎలా అని ఆలోచిస్తాడు. మేఘన మాత్రం పంచమి చనిపోదని.. మోక్షను కాపాడుకోవడానికి కచ్చితంగా వస్తుందని వివరిస్తుంది. ఆ తర్వాత ఆమె వెళ్లిపోగా జ్వాల వస్తుంది. వెంనటే ఫణీంద్ర పాము రూపంలోకి మారడంతో.. అదంతా చూసిన జ్వాల భయంతో గజగజా వణికిపోతుంది.

జనవరి 4వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి ఎక్కడకు వెళ్లిందో నాగ సాధువు ద్వారా తెలుసుకున్న మోక్ష ఆమె వద్దకు వెళ్తాడు. వెంటనే ఆమెను కలుసుకుని గట్టిగా హత్తుకుంటాడు. ఇంటికి తీసుకు వస్తాడు. వైదేహి.. పంచమి పాము అని కొట్టి చంపేయాలని చెబుతుంది. అదంతా తప్పు అని పంచమి తన భార్య అని ఇంట్లోకి తీసుకు వస్తాడు మోక్ష. కానీ పంచమి మాత్రం బాధ పడుతూనే ఉంటుంది.

జనవరి 5వ తేదీ ఎపిసోడ్ లో.. ఇంటికి వచ్చిన పంచమి భర్తను నాగ గండం నుంచి ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది. అదే విషయాన్ని భర్తకు చెబుతుంది. ఫణీంద్ర, మేఘనలు సాయం చేస్తారని.. అలా నేను మిమ్మల్ని కాపాడుకుంటానంటూ వివరిస్తుంది. ఇక భయంతో బతకడం ఇష్టం లేదని... ఏది జరిగినా సరేనని మోక్ష అంటాడు. అలా భర్త తన ప్లాన్ కు ఒప్పుకోగానే తెగ సంబురపడిపోతుంది పంచమి.

జనవరి 6వ తేదీ ఎపిసోడ్ లో.. మేఘన రూపంలో ఉన్న కరాళీ మరోసారి మహాకాళిని ఆవాహనం చేసుకుంటుంది. మళ్లీ ఎందుకు పిలిచావని అమ్మవారు అడగ్గా.. తన కోరిక నెరవేరబోతుందని చెబుతుంది. నాగమణి భూలోకంలోకి రాబోతుందని.. దాన్ని పట్టుకుని తట్టుకోగలిగే శక్తి తనకు ఇవ్వాలని అమ్మవారిని ప్రసాదిస్తుంది. మరోవైపు పంచమి పాముగా మారి మోక్షను కాటేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X