Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ తల్లికి ఆరోగ్య సమస్యలు.. కొడుక్కు చెబుతూ ఎమోషనల్ అయిన తండ్రి!
Pallavi Prashanth Father in BB House: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో.. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. సోమవారం రోజు నుంచి రోజు ఇద్దరి నుంచి ముగ్గురు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపారు. చివరగా ఇద్దరి కుటుంబ సభ్యులు రావడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అందులో ఒకటి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రెండోది రతికా రోజ్. అయితే తాజాగా బిగ్ బాస్ టీం వదిలిన ప్రోమోలో.. రైతుబిడ్డ తండ్రి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా స్టోర్ రూం ద్వారా పల్లవి ప్రశాంత్ కోసం బంతిపూలు పంపిన బిగ్ బాస్.. ఆ తర్వాత ఆయన తండ్రిని లోపలికి పంపారు.
ముందుగా వచ్చిన బంతిపూలు చూసి పల్లవి ప్రశాంత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. చాలా రోజులైతుంది చూడక అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత బాబు బంగారం.. బాబు బంగారం అంటూ.. పల్లవి ప్రశాంత్ తండ్రి బంతిపూలు చేతపట్టుకొని బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అది చూసిన రైతుబిడ్డ పరిగెట్టుకుంటూ వచ్చి తండ్రి కాళ్లపై పడ్డాడు. కాళ్లు పట్టుకొనే చాలా సేపు ఏడ్చాడు. పైకి లేపిన తండ్రి కొడుకును కౌగిలించుకొని మరింత ఎగ్జైట్ అయ్యాడు. ఈక్రమంలో కొడుకు తండ్రిని ఎత్తుకొని.. మా బాపు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడంటూ ఎత్తుకొని తిరిగాడు. శివాజి మెళ్లిగా మెళ్లిగా అంటూ పక్కనుంచి చెబుతున్నాడు. ఇది చూసిన కంటెస్టెంట్లు అందరూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

అందరూ కలిసి మెలిసి ఉండుర్రి.. కొట్లాడుకోకుర్రి..:కొడుకు ఎత్తుకొని ఉండగానే.. తగ్గేదే లేదు బిడ్డు అంటూ పుష్పని ఇమిటేట్ చేశాడు పల్లవి ప్రశాంత్ తండ్రి. అది చూసిన హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ కొడుతూ ఫుల్లుగా నవ్వారు. ఇక ఆ తర్వాత పల్లవి తండ్రి శివాజికి చేతులు జోడించి మరీ దండం పెట్టాడు. నా కొడుకును అయితే కన్నకొడుకు లెక్కనే చూసుకున్నవ్ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే అమర్ దీప్ ను మాట్లాడిస్తూ.. అందరూ కలిసి మెలిసి ఉండుర్రి.. కొట్లాడుకోకుర్రి అని చెప్పిండు. ఇక ఆ తర్వాత ఎమోషనల్ అవుతూ తండ్రి ఏడ్వగా.. పల్లవి ప్రశాంత్ ఊరుకోబెట్టాడు.
నేన్ సచ్చినా బతికినా ఈనితోనే...:ఇదంతా అయ్యాక తండ్రికి అన్నం తనిపిస్తూ పల్లవి ప్రశాంత్ మురిసిపోయాడు. ఆయన కూడా కొడుక్కు ముద్దులు పెడుతూ మరింత ఎగ్జైట్ అయ్యాడు. నేను సచ్చినా బితికినా ఈనితోనే అంటూ రైతుబిడ్డ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ అయితే చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడు. తండ్రి ఊరుకోబెడుతూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత బెడ్రూంలో కూర్చొని తండ్రీ,కొడుకులు మాట్లాడుకోగా... టాలెంట్ ఉంది.. ఉపయోగించుకో అని ఆయన చెప్పారు. నేను ఏది చెప్పినా నువ్వు ఏడ్వకు.. అమ్మ ఏడుస్తుంది అని తెలిపాడు.

నువ్వు ఏడిస్తే అమ్మకు బీపీ ఎక్కువైతుంది..:నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది... బీపీ పెరుగుతుంది. నువ్వు ఎంత మంచిగుంటే మేము అంత మంచిగా ఉంటామని తండ్రి చెప్పిన వెంటనే పల్లవి ప్రశాంత్ ఏడుపు ఆపేశాడు. ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ముఖ్యంగా తాను ఏడిస్తే తల్లి కూడా ఏడుస్తూ.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుందని లోలోపలే బాధ పడుతున్నాడు. ఇదంతా అయ్యాక శివాజి ఓ పక్కన, ప్రశాంత్ ఓ పక్కన ఉండి తండ్రిని బయటకు తీసుకు వచ్చారు. గార్డెన్ ఏరియాలో రైతుబిడ్డ మీసం తిప్పుతుండగా.. ఆయన తండ్రి తొడ కొట్టాడు. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అయింది. పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఈరోజు రాత్రి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











